సొంత పార్టీ ని, నాయకులు ను, పాడు చేసుకునే పరిస్థితి? కూర్చున్న కొమ్మ ను నరుక్కుంటారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,117; 104 తత్వాలు (Tatvaalu) and views 225,560.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ తమ సొంత పార్టీ ని, తమ సొంత నాయకులు ను అనుచరులు ను, పాడు చేసుకునే పరిస్థితి ఉంటుందా? తాము కూర్చున్న కొమ్మ ను తాము నరుక్కుంటారా? నాకు కొంతమంది విషయాలు చూస్తుంటే, అలాగే అనిపిస్తుంది.

జవాబు, రాజకీయం మరియు అధికార, మోహం మత్తు అంటే అదే. అది అధికార పక్షం అయినా, ప్రతిపక్షాలు అయినా, ఆఖరికి మన ఇంట్లో అయినా అంతే.

* పాము లేదా ఏవో జంతువులు, తన పిల్లలను తామే తింటుంది అంటారు. అరిషడ్ వర్గాలు లో మునిగిన, పార్టీ అయినా కుటుంబం అయినా అంతే.

* మన ఇంట్లో నే, ఒక జీవిత భాగస్వామి, తప్పుడు సంపాదన లేదా తప్పుడు పనులు తో ఎదుగుతున్నారు అని తెలిసి కూడా, తానూ ఆ సౌకర్యాలు హోదా దర్జాలో మునిగి, లోక న్యాయ ధర్మం మరచి, తన తప్పును ఆపరు, మంచి చెడు విచక్షణ చెప్పరు.

కానీ తర్వాత అదే ధన మత్తులో, తర్వాత తనను వదలి ఇంకో దోవలో భాగస్వామి వెళ్ళినా లేదా ఆ తప్పు కు భాగస్వామి లేదా తను బలియైపోయిన తర్వాత, కళ్ళు తెరిచినా ప్రయోజనం ఉండదు కదా.

అంటే తెలిసి తెలిసి, తన కుటుంబం నాశనం చేసుకుంది తనే, దురాశ ధన సంపాదనలో. అలాగే పిల్లల పెంపకం కూడా, చేతులారా వారే పాడు చేస్తున్నారు.

* అందరి గురించి కాకుండా నాయకులు లో కొందరు గురించి, ఒక అన్నం మెతుకు ఉడికింది, అని చూసిన చాలు కదా. కొన్ని ఉదాహరణ లు చూద్దాం.

* అధికార పక్షం - మనకు తెలిసిన వైసీపీ ముగ్గురు పార్టీ పెద్దలు లో, చురుకు గా ఉంటూ ప్రతిపక్షంను చీల్చి చెండాడేది విజయ సాయి గారు మాత్రమే. ఆయనను వైజాగ్ కు పరిమితం చేసి, చేతులు కట్టేశారు. మిగతా రాష్ట్రంలో, పార్టీ నాశనం జరుగుతున్న కూడా, ఆయన వేలు పెట్టడానికి, నోరు ఎత్తడానికి లేదు.

ఉత్తరాంధ్రా వైజాగ్ లో, తమకు కావాల్సిన పనులు చేయించుకున్న తర్వాత, ఆయన పరిస్థితి ఇంకా మారవచ్చు, భవిష్యత్ చెప్పలేము.

సజ్జల కు మా ప్రాంతం ఇస్తే, ఆయనకు ఓపిక తీరిక లేక మంత్రి చేతిలో పెట్టారు.

మంత్రి గారు, మా ఊళ్ళో ఉన్న వైసీపీ నాయకుని చేత అధికార పనులు చేయించి, వైసీపీ బలం పెంచి, నాయకుని ఇంకా గట్టిగా చేయాలి. కానీ ఆయనేం చేస్తున్నారు, ఆ పార్టీని అలాగే స్థానిక నాయకుని బలహీనం చేసి, తెదేపా నుంచి ఎమ్మెల్యే ను తెచ్చి, కొంత బలం ఇచ్చారు.

పోనీ ఆయనకన్నా పూర్తి బలమా పూర్తి గౌరవమా, అదీ కాదు. రేపు టికెట్ ఇవ్వకపోతే, మరలా వెనక్కి వెళతారు. అంటే ఇద్దరు నాయకులు ను, సగం బలహీనం చేసి, ఆట ఆడిస్తూ కధ నడుపుతుంది, సొంత పార్టీ నాయకుల రాజకీయమే కదా? అంటే అందరికీ నష్ట మే.

ఇక అలా చెప్పుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగతా ప్రాంతాల్లో, ఎక్కడ కక్కడ స్ధానిక రాజకీయ సయ్యాటలు, అక్కడ జరుగుతున్నాయి.

* తెదేపా - అధికారంలో లేరు కాబట్టి, పార్టీ పెద్దలు మరియు ఇతర నాయకులు గురించి, అనుకోవడం బాధ పెట్టడం అనవసరం.

మా ఊళ్ళో పదేళ్ళు గా, స్ధానికంగా ఒక్క బలమైన నాయకుని, తయారు చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా తన ఎమ్మెల్యే ను పక్కకు పంపి, రెండు ఏళ్లుగా నోరు కలిగి, వైసీపీ ని నోరు ఎత్తి విమర్శలు చేసే, ఒక్క గట్టి దమ్మున్న నాయకుని పొంద లేక పోయింది. కనీసం విలేకరులు లాగా, గట్టిగా అడగలేరు, నటించడానికి అయినా.

అంటే మా ఊళ్ళో, తెదేపా ను అణిచివేస్తుంది ఎదగనీయకుండా చేస్తోంది, స్వయంగా తెదేపా అధిష్టానమే నాయకత్వమే, కదా? మా ఊరు, తెదేపా ఫేస్బుక్ చూడండి, స్ధానిక ఎమ్మెల్యే మీద ఒక్క విమర్శ ఉండదు, అభివృద్ధి గురించి పలుకు ఉండదు.

ఎందుకంటే ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే, మరలా మన దగ్గరకు వస్తారని ఆశ. ఇంతకన్న, తెదేపా కు ఆత్మహత్య పద్దతి ఉందా?

* బీజేపీ, జనసేన - మనకు తెలిసిన వారిని అడుగుతూ ఉంటా, ఊరక ఏమైనా తెలుసా అని, మీకు బీజేపీ జనసేన పట్టణ నాయకులు అధ్యక్షుడు తెలుసా అని, ఎవరూ మాకు తెలీదు, మా వార్డు కు రాలేదు ఎప్పుడూ అంటారు.

మనం గతంలో వారి ఫేస్బుక్ పేజీలు గురించి రాశాము. వారూ స్ధానిక సమస్యలు అభివృద్ధి మాట్లాడరు, సోషల్ మీడియా లో ప్రచారం చేయరు, ఫోటోలు పెట్టకోరు. ఇదంతా వారి అధిష్ఠానం కు తెలుసు, కానీ పట్టించుకోరు.

ఇక పైన, వీరన్న కు సహాయ నిరాకరణ చేస్తున్నారు, పేరు రానీయకుండా. అలాగే పార్టీ మారిన తెదేపా ఎంపీలు, తమ ప్రాబల్యం చాటాలని ప్రయత్నాలు, రాష్ట్ర బీజేపీ గందరగోళం. అంతా కోవర్టు రాజకీయాలు.

కేంద్ర పార్టీ పదవులు లో ఉన్న వారిలో మన రాష్ట్రం నుంచి, ఒకరో ఇద్దరో తప్ప, ఎవరూ మనస్ఫూర్తిగా పార్టీ పటిష్ట తకు పనిచేయడం లేదు.

* కాబట్టి పార్టీని లేదా కుటుంబం ని నాశనం చేస్తుంది, సొంత నాయకులు సొంత మనుషులే కదా మిత్రమా? ఏ ఊళ్ళో అయినా, ఇదే కధ కొంచెము అటూ ఇటూ అంతే. మమ్మల్ని ఎవరు నాశనం చేయక్కరలేదు, మాకు మేమే చేసుకుంటాం, ఇది ఇప్పుడు అందరి నినాదం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,117; 104 తత్వాలు (Tatvaalu) and views 225,560
Dt : 20-Feb-2021, Upd Dt : 20-Feb-2021, Category : Politics
Views : 994 ( + More Social Media views ), Id : 984 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , politics , harms , own party , own leaders , ysrcp , bjp , janasena , tdp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content