మేము మూడిళ్ళ అవతల, రోడ్డు పక్కన, ప్రభుత్వ స్ధలం లో, ఫలానా వారి స్థలం ఎదురు చెత్త పోస్తాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,275; 104 తత్వాలు (Tatvaalu) and views 224,953.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చదువుకున్న వారి కన్నా, ఎవరో మేలు అని ఒక సామెత ఉంది. మనము చేసేది తప్పు, మరలా ఎదురు వారిని బెదిరించడం. ఎప్పుడూ లాగే మా అక్క గారు, నాకు రోగము వచ్చినా పర్లేదు అని నవ్వుతూ తలవంచుకుని వచ్చారు అంట, మన బజారు మిగతా జనం బాధ్యత గా ఉన్నట్లు గా.

సుశీలమ్మ (పేరు మార్చ బడినది) గారు నిన్న, అక్క ను మరలా అడిగారు అంట, మేము మూడిళ్ళ అవతల, రోడ్డు పక్కన, గవర్నమెంట్ స్ధలం లో, క్రుష్ణారావు (పేరు మార్చ బడినది) గారి స్థలం ఎదురు చెత్త పోస్తాం. మా ఇష్టము, అడగడానికి మీకు గానీ ఇంకొకరుకు గానీ హక్కులు ఏమున్నాయి. మేమే తిరిగి, చెత్త ఇంకొకరి స్థలము ఎదురు పోస్తూ ఉంటే, ఫోటోలు తీస్తుంది అని మీ మీద కేసు పెడతాము. మా వారు పెడతారు అని చెప్పారు బెదిరించారు అంట. చూడండి ఇది ప్రజా స్వామ్యము అంటే.

పక్కన వారి ప్రాణాలు విలువ కన్నా, ఇంకో చోట వారి చెత్త పోయటము ముఖ్యమా? దానికి పంచాయితీ ఆఫీసర్ గారు రావలా? పోలీసులు రావాలా? అదే పని మొన్న లేదా ఇప్పుడు అక్కగారు చేస్తే, ఏమంటాము, ఇంత చిన్న విషయానికి మనము పరిష్కరించుకోలేమా అనమా?

అక్క గారు వెంటనే ఏమి అనాలి, చెత్త పోసేది మీరు, కేసు పెట్టేది మీ వారా? ఆయనెందుకు, రాండి ఇప్పుడే, ఇద్దరము వెళదాము స్టేషన్ కు. చెత్త పోసే వాళ్ళకు దూరముగా ఉండి, నా కళ్ళలో పడే చెత్తను కూడా, ఫోటో తీసే హక్కు నాకు లేదా? అది ఇంకొకరు చెపితే, వినే చిన్న పిల్లనా? నా ఆరొగ్యమును, పాడు చేసే హక్కు మీకు ఉంది, కానీ మాకు ఫోటో హక్కు లేదా.

మీ ఇంటి ముందు ప్రభుత్వ స్థలము ఉంది, నేను తెచ్చి చెత్త పోస్తే ఊరుకుంటావా? ఇంత చదివి, ఉపయోగము ఏమిటో తెలియడము లేదు. అని గట్టిగా అందరు వినేటట్లుగా జవాబు చెప్పవద్దా?

నన్ను, ముందు ఇద్దరు రోడ్డు మీద ఆపి బెదిరింపులు చేశారు అరిచారు. ఇప్పుడు మరలా నన్ను ఒంటరి దాన్ని చేసి అరచారు. మేము పోస్తామని ఏం చేస్తారు, మీ సంగతి తేలుస్తాం అని, నేనూ కేసు పెడతాను, ప్రాణభయము ఈ మనుషులతో నూ మరియు చెత్తతోనూ అంటే. వారు వస్తే, మంచిదే కదా.

అసలే కరోనా తో ఓ వైపు జనము భయముతో చస్తూ ఉంటే, మరలా ఈ అనవసరపు మాటలు ఏమిటి దేవా? రేపు అక్కకు ఏదన్నా, జబ్బు వస్తే, చుట్టాలు ఎక్కడ తిరిగావు కరోనా సమయములో అంటే, నేను ఇంట్లోనే ఉన్నా, ఇదుగో చెత్త తెచ్చి పోస్తున్నారు జనము చెప్పినా వినకుండా, అని చూపించుకోవద్దా.

ఫోటో లేక పోతే, మేము 3 ఇళ్ళు అవతలకు వచ్చి పోసామా? అంత తప్పుడు వాళ్ళమా అని వారు తిరిగి మాటమార్చి అంటే? మన దగ్గర సమాధానము ఉంటుందా?

ఇప్పుడు పెద్దలు మీరే న్యాయం చెప్పండి ఇద్దరు కూ.

1. ఏమ్మా ఇంత మంది చదువు కున్న వాళ్ళం ఉన్నాము. మేము గమ్ముగా ఉన్నాము కదా, సామాజిక బాధ్యత తో. నువ్వు కూడా గమ్ముగా ఉండాలి. మీ ఇంటి ఎదురు గా, గవర్నమెంట్ స్ధలం లో పోసినా కూడా, చూసి జాగ్రత్తగా చిమ్ముకో, వాళ్ళు పెద్ద వాళ్ళు. అలాగే రోజు కోక ఇంటి ముందు, పోయమని చెపుతాము అంటారా? లేక

2. మీరు మాత్రం, ఆమెను రోడ్డు మీద బెదిరింపు చేశారు, ఇప్పుడు మరలా అరచారు అని అక్క గారును కూడా కేసు లు పెట్టాలా? లేక

3. మీకు ఎవరికన్నా వారు తెలిసి ఉంటే, కొంచెము కరోనా వ్యాధులు గురించి, రోడ్ న నడిచే మిగతా జన ప్రాణాల గురించి, మన చెత్త మన ఇంటి దగ్గర ఉంచుకోవాలి, అని కొంచెము ఎవరన్నా నచ్చ చెపుతారా, అక్కకు తోడుగా?

వీళ్ళందరికి మా మేనకోడళ్ళు స్థలము మీద, ఎందుకు ఇంత చిన్న చూపు? ఎవరి స్థలము అయినా, వారు ఉన్నా లేక పోయినా, మనము మర్యాదగా శుభ్రముగా ఉంచాలి కదా. పెళ్ళికి మనము ఇల్లు అడిగితే, ఇవ్వలేదు, గతము లో. ఆ కోపము మరియు ఈ చెత్త కోపము రెండు కలిపి చూపిస్తున్నారు ఏమో? దేవా.

అక్క మరియు అక్కడ ఉండే లేదా నడిచే ప్రజలు, స్వార్థం వీడి అందరి ప్రాణ రక్షణ కై, గట్టిగా మాట్లాడుతూ ఉండకపోతే, ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి.

అని తన అక్క బాధ రాము, సోముతో వెళ్ళగక్కాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,275; 104 తత్వాలు (Tatvaalu) and views 224,953
Dt : 12-May-2020, Upd Dt : 12-May-2020, Category : General
Views : 864 ( + More Social Media views ), Id : 543 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : after 3 houses distance , roadside govt land , our trash , no worry about public health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content