శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, కఠినం గా, అవమానించినట్లుగా, తక్కువ చేసినట్లు, కొన్ని సార్లు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,716; 104 తత్వాలు (Tatvaalu) and views 226,019.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మా శ్రేయోభిలాషులు ఉన్నారు, నిస్వార్థంగా ఆచరణలో ఏళ్ళుగా మంచి పనులు చేస్తూ, మాతో వ్యాపార ధన లావాదేవీలు లేకుండా, మా నుంచి మంచినీళ్ళు కూడా ఆశించకుండా, మాకు దూరంగా ఉంటూ, మా బాధలు గంటలు గంటలు వింటారు. కానీ వారు చెప్పే సలహాలు, కఠినం గా, మమ్మల్ని అవమానించినట్లుగా, తక్కువ చేసినట్లు, గేలిచేసినట్లూ ఉంటాయి, కొన్ని సార్లు. బాధ వేస్తుంది. కానీ వాళ్ళు చెప్పింది కూడా నిజమే నని అనిపిస్తుంది లోపల, కానీ మా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటారు?

జవాబు - మమ్మల్ని కూడా అలాగే అంటారు కొంతమంది కఠినం మాటలు అని, వారు మోహం లో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు. నవ్వుకుని గమ్ముగా ఉంటాము. మీరు మమ్మల్ని అంటున్నట్లే ఉంది ఇండైరెక్ట్ గా, అయినా పర్లేదు ప్రశాంత వాస్తవ జవాబు చూద్దాము.

మిత్రులకు బంధువులకు ఎప్పుడూ ఓ మాట చెబుతా, మీ మనసు తో మీ అంతరాత్మ తో నిజం మాట్లాడే ధైర్యం, నిజం ఒప్పుకునే సంస్కారం, మీకు ఉంటే మాత్రమే, మాతో మాట్లాడు, సమస్యలు చెప్పు.

లేదా అసలు చెప్పకు ఇష్టం లేకపోతే. కానీ అబద్ధాలు చెబితే, సలహాలు ఫలితాలు కూడా అబద్దమే కదా. ఆ వ్రుధా సమయము వలను, మీకు వచ్చిన లాభము మాత్రం ఏముంది?

అసలు బాధ వెళ్ళగక్కక పోతే, ఎవరితోనో ఒకరితో, మనసు చికాకుగా, ఇంకా మతి పొతుంది. చివరకు మనసు చెడిపోయి పిచ్చి ఎక్కుతుంది.

మన లక్ష్యం, మీ భవిష్యత్తు సమస్యలు కు వీలైనంత మంచి చూపడం. మీరు మోహము లోపల, మేము మోహము బయట, అంతే తేడా. మీరూ మోహము బయటకు వస్తే, ఎవరినీ ఏమీ అడగనవసరము లేదు.

లేదంటే ఎక్కువ రోజులు, దగ్గర గా ఉండనూ లేరు. ఆ తర్వాత సంతోషంగానూ ఎటూ ఉండలేరు, తప్పుడు పనులకు ఫలితాలుగా, విపరీత సమస్యలు చుట్టుముట్టాయి అని. అవన్నీ మీ స్వయ అహంకార చర్యల ఫలితమే కాదా?

పూజలు దేవుడు మంచివారు, శిక్ష(ణ) కాలంలో అండగా రారు, రాకూడదు.

రాముడు రావణాసురిని వధించే విషయములో, శివుడు కలుగ చేసుకోలేదు తన వీర భక్తుడి గురించి.

పంతులు గారు, మా అబ్బాయి సంక్షేమం కోసం, బాగా చదవమని తిడుతూ ఉంటే కొడుతుంటే, మేమెందుకు ఆపాలి? మనకెటు చేతకాదు కదా?

అందుకే అరిషడ్వర్గాలు కు మనం బానిసలు కాకూడదు. ఆ నియంత్రణ మనకు ఉంటే, ఇంకొకరు కి చెప్పనవసరం లేదు.

కానీ 75 శాతం మంది, ప్రాపంచిక వ్యామోహం లో, భ్రమ ల లో ఉంటారు. వారిని తిట్టి దోవలో ఉంచడం కు, నియంత్రణ కలిగిన వ్యక్తి, దగ్గర లో ఉండాలి. వారికి చెప్పి చేయాలి, వారి మాట సంపూర్ణంగా విశ్వాసం తో వినాలి ఆచరణలో పెట్టాలి. వారి పై నమ్మకం లేకపోతే చెప్పకు.

మనకు నియంత్రణ లేక తూలుతూ ఉన్నప్పుడు రోగములో లేదా ముదుసలి తనంలో, కర్ర లేదా గోడ సాయం వద్దు, అవమానం అనవసరం అనుకుంటే, మనం కింద పడి ఎముకలు విరిగితే, ఆసుపత్రిలో లక్షల ఖర్చు కదా? మనవాళ్ళు వదిలేస్తారు? ఇంకా పూర్తిగా మంచం పైనే కదా? జీవిత సమస్య అంతే కదా?

అసలు ఈరోజు లలో, మన బాధ వినేవారు ఉన్నారా, ఓపికగా అరగంట? విని తమ స్వార్ధానికి వాడుకోని వారు ఉన్నారా?

మోహం లో ఆడంబరంలో, లక్షల ఖర్చు తో, పెళ్లి విందుకు వెయ్యి మంది ని పిలుస్తాము, వారూ వస్తారు పదిమంది తో.

అదే తగువులు మధ్యవర్తిత్వం విడాకులు కు పిలవండి, 50 మందిలో 5 గురు కూడా రారు కదా?

తప్పు మనదా? రాని వారుదా? మన అహంకారాన్ని మనం అంగీకరించం.

కృష్ణుడు, రాయబారి గా వెళ్లి, దుర్యోధనుని తో, తమ్ముళ్లు కు సగ రాజ్యం ఇవ్వు లేదా కనీసం 5 ఊళ్ళు ఇవ్వు. లేదంటే ఒకవేళ యుద్ధం వస్తే, అధర్మం ఉన్న మీతో సహా మీ పిల్లలు బంధువులు అందరూ నాశనం అవుతారు. ఒకరు కూడా మిగలరు. ఒకరూ సహాయం ఎవరూ చేయరు అన్నారు. తప్పు ఉందా, బంధువుగా మధ్యవర్తి గా?

నచ్చలేదు, గమ్ము గా పంపించు, తర్వాత కబురు చేస్తాము అని లేదా వాదాలు వద్దు యుద్దమే ముద్దు అను సగర్వముగా.

ఇప్పుడు దుర్యోధనుడు, అసలు సమస్య ను పక్కన పెట్టి, తన అహంకారం ఆధిపత్యం హోదా పెత్తనం గొప్ప తనం వదులు కో లేక, ధర్మము నకు మనసు అంగీకరించక, కృష్ణుని నిందించడం మొదలు పెట్టాడు.

ఎందుకంటే తన దగ్గర ధర్మ బద్దమైన జవాబు లేదు, ఏం చెప్పాలో తెలీదు, పెద్దలు ఎవరూ తన పనులను మాటలను అంగీకరించరు, అరిషడ్వర్గాలు కు పూర్తిగా బానిస లై ఉన్నారు అందరూ, తన చుట్టూ అవసరం కోసం నటిస్తూ.

మమ్మల్ని మా వీరత్వం ను, పరాక్రమం ను, వంశం ను, అధికారం మంది మార్బలం ను అవమానించి, రారాజు ను మమ్మల్ని అవమానించి, నాశనం అవ్వాలని అంటావా, భయపెడతావా, చులకనగా మాట్లాడతావా, నువ్వు ఎవరు అసలు గోవులు కాచుకునేవాడివి అని, మాకు నీతలు చెపుతావా అంటూ, తనను నిందించడమే గాక, ఓ పెద్ద తాడు తో కృష్ణుని ఒంటరిని చేసి బంధించబోయారు అన్నదమ్ములు అందరూ కలిసి.

కానీ వారి బుద్ధి మారలేదు ఆతర్వాత కూడా. వారి పతనం కూడా ఆగలేదు, మొత్తము సర్వ నాశనము అయ్యారు.

ఇప్పుడు కలియుగములో, ఇంటికి ఒక దుర్యోధనుడు కనీసం ఉన్నారు, వీలైతే ఇద్దరు ముగ్గురు కూడా, కనీసము తల్లి దండ్రుల మాటలు కూడా వినరు గౌరవించరు ముదుసలి తనములో తోడు ఉండరు.

ఇప్పుడు కూడా, మన శ్రేయోభిలాషులు మంచి చెప్పినప్పుడు, అసలు సమస్య ను మన అహంకారం గురించి పక్కన పెట్టి, మన భవిష్యత్తు మన కళ్ళకు కట్టినట్లు, చెప్పిన వారిని తూలనాడి, మన చుట్టూ మనల్ని పొగిడే వారిని మాత్రమే పెట్టుకుని, పరిపూర్ణముగా నాశనం అవుతాము కదా.

ఎందుకంటే జరగాల్సిన యుద్ధం ను, కౌరవ వంశ నాశనం ను, కృష్ణుడే ఆపలేకపోయాడు. మానవ మాత్రులం మనమెంత. మౌనం గా జరిగేది చూస్తూ, పంచభూతాలు తో పాటుగా సాక్షి భూతులు గా ఉండటం మాత్రమే కదా, మన లాంటి వారి పని.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,716; 104 తత్వాలు (Tatvaalu) and views 226,019
Dt : 06-Feb-2022, Upd Dt : 06-Feb-2022, Category : General
Views : 577 ( + More Social Media views ), Id : 1288 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : advice , wishers , harsh , insulting , demeaning , ridiculous , krishna , duryodhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content