Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
Above all else is the health of the people - As a father who rules the people, with a foresight for their well-being, some good works - Respected Bapatla, District, Vetapalem, Mandal, Kothapeta, Panchayat EO garu
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
*గౌరవ బాపట్ల జిల్లా వేటపాలెం మండంలం కొత్తపేట పంచాయితీ అధికారి గారికి*,
అయ్యా, ఇది మన మంచి ప్రజా సంక్షేమ ప్రభుత్వం అనేట్లుగా ముఖ్యమంత్రి చంద్రన్న అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీరాజ్ శాఖా మాత్యులు పవనన్న సారధ్యములో, శరవేగముతో కొత్త పనులు అలాగే పాత పనుల ప్రక్షాళన సాగుతున్నది.
మంచి మనసున్న నాయకులు అలాగే మీ లాంటి మంచి మనసున్న అధికారుల సమిష్టి క్రుషితో, ఇంకా ఎన్నో మంచి పనులు ముందు ముందు జరగాలని ఆశిస్తున్నారు ప్రజలు.
అన్నిటి కన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యం. ప్రజలకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా, బాధ్యత గల ప్రభుత్వముగా, ప్రజలను పాలించే తల్లి తండ్రిగా, ముందు చూపుతో వారి క్షేమం కోసం, కొన్ని మంచి పనులు మనమే సంకల్పించుకుని చెయ్యాలి.
వాతావరణ మార్పులతో, ప్రజలలో జ్వరాలు రోగాలు పెరుగుతున్నవి, అలాగే ఆసుపత్రుల ముందు క్యూలు అధికమౌతున్నాయి. ప్రజల జేబులకు ఖర్చులతో చిల్లులు పడుతున్నాయి, బతుకులు భారం అవుతున్నాయి.
మొన్న కురిసిన వర్షాల వలన కాని, రాబోయే వర్షాల వలన కానీ అంటువ్యాధులు పెరిగి, ప్రజలు ఇంకా ఎక్కువ అనారోగ్యం పాలు కావడానికి అవకాశం ఉంది. దానికి ముఖ్య కారణం, పరిసరాల అశుభ్రత.
ఒక ఉదాహరణ ఫోటోలో చూడగలరు, సాయి బాలాజి అపార్ట్మెంట్ ఎదురుగా ఐల్ టీడీ కాలనీలో, 3 ఇళ్ళ మధ్య పోగైన చెత్త, ఇది ప్రజల అందరి అనారోగ్యపు నిర్లక్ష్యపు బాధ్యత. ఆ మెయిన్ రోడ్ పై నడిచే, ప్రజలు అందరికీ, వాయువు ద్వారా వైరసు లు చేరే అవకాశం మెండుగా ఉన్నది.
గతములో కరోనా దెబ్బ చూసాము, పరుగులు తీసాము, అల్లాడిపోయాము. భవిష్యత్ లో ఇంకా ఎన్నో అలాంటివి మన ముందు ఉన్నాయి. గత ఈవో గారు కూడా, ఆ చోటును జేసీబీతో ప్రక్షాళన చేసారు, ప్రజలకు వారి ఆరోగ్యానికి అండగా నిలచారు.
కానీ కుక్క తోక వంకరే అన్న సామెతగా, సామాజిక బాధ్యత చైతన్యం ఆరోగ్య జాగ్రత్తలు ముందు చూపు లేని చుట్టుపక్కలవారి మరియు యజమాన్య నిర్లక్షము వలన, మరలా చెత్త పోగైనది, ఇంకా ఎక్కువ పోగు అవుతుంది.
కావున, పంచాయితీ ప్రజల ఆరోగ్య క్షేమం కోసం, పంచాయితీ ఈవో గారు నడుము బిగించి, చంద్రన్న పవనన్న ఆశయాలకు అలాగే స్థానిక ఎమ్మెల్యే కొండయ్య గారి ఆలోచనలు కు అద్దం పట్టేవిధము గా, ప్రజలకు వారి ఆరోగ్య రక్షణకు ముందు చూపుతో మంచి చేస్తారని, దీనికి ప్రతి ఏడాది గుర్తు చేయకుండా, శాశ్వత పరిష్కారం చేస్తారని పలువురు కోరుతున్నారు.
అలాగే మురుగు నీరు పారుదలకు శాశ్వత పరిష్కారము చూపుతారని, చెత్త పన్ను రద్దు చేసి మేలు చేసిన ప్రజా ప్రభుత్వం, రోజూ దాని తొలగింపునకు శ్రద్ద వహిస్తారని, అలాగే పంచాయితీ పన్నులను ఆన్లైన్ లో చెల్లించే అవకాశం కల్పిస్తారని, ప్రజలు ఎన్నోమార్లు విన్నపాలు పంపారు. ఈ మన మంచి ప్రభుత్వం లో, అవి త్వరలో సుసాధ్యం అవుతాయని అందరి ఆకాంక్ష.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,926,167; 104 తత్వాలు (Tatvaalu) and views 446,773
Dt : 23-Sep-2024, Upd Dt : 23-Sep-2024, Category : General
Views : 606
( + More Social Media views ), Id : 2161
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
health ,
people ,
father ,
foresight ,
well-being ,
good works ,
Bapatla ,
District ,
Vetapalem ,
Mandal ,
Kothapeta ,
Panchayat ,
EO
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments