వ్యక్తి మరీ నీతి నిజాయితీ గా ఉండకూడదు, నిటారు చెట్లు మొదట కత్తిరించబడతాయి, వారు కష్టాలపాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఒక వ్యక్తి మరీ నీతి నిజాయితీ గా ఉండకూడదు, నిటారు చెట్లు మొదట కత్తిరించబడతాయి, వారు కష్టాలపాలు, నిజమేనా?* A person not be too honest. Straight trees cut first and honest people Screwed first? #ashtavyasan #saptavyasan

Rajo and Tamo guna People say - A person should not be too honest. Straight trees are cut first and honest people are Screwed first.

Actually these folks will get more hammer hits later anyway.

But don't loose character and values if we want to be with God.

Gold/ Stone will also get big hammer hits to become more valuable Jewelry/ Vigrah.

So anyway we can't escape from God punishments by loosing character and values also, now or later.

So please always remember Satyaharischandra Story, be good with Ethics and honesty.

ఒంటి పాదముతో కుంటే కలియుగములో, 100 కి 75 శాతం ఉన్న, రజో మరియు తమో గుణ వ్యక్తులు ఎప్పుడూ అంటారు - ఒక వ్యక్తి మరీ నీతి నిజాయితీ గా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే నిటారుగా ఉండే చెట్లు మాత్రమే మొదట కత్తిరించబడతాయి. అలాగే నిజాయతీపరులు మొదట కష్టాలపాలు చేయబడతారు అని.

చాలా మంది అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు లోబడి ఉంటారు కాబట్టి, మానసిక బలహీనురు కాబట్టి, ఇది నిజమేనని వెంటనే వీరి మాటలు నమ్మి, వీరి తప్పుడు దోవలో కలసి పోతారు, దగ్గర దోవలో ఎదుగుదామని ఆశపడతారు, చివరలో లేదా మధ్యలో పతనము పాలు అవుతారు.

ఆనాడు, మంచి వాడైన, కర్ణుడు అలాగే కౌరవ పక్షానికి వెళ్ళింది. ఇది తప్పు అని ఎవరు చెప్పినా, కౌరవులు అంటారు, ఈ రోజుల్లో నీతి నియమము ఏమిటి, రాజ్యం భోజ్యం ఇచ్చింది రారాజు, కాబట్టి వీరి సేవనే కరెక్ట్. నీతి చెప్పే వారు, ఈ రాజ్యాలు భోగాలు ఇస్తారా అంటారు. పాపం ఆ మోహ మాయలో పడి, అన్ని పాపాలలో పాలు పంచుకుని, రారాజు కన్నా ముందే, కర్ణుడు ప్రాణాలు విడిచాడు.

ఈనాడు, ఇద్దరు స్నేహితులు ఇలా అనుకుంటున్నారు, నీతి నిజాయితీలు వద్దు, వంకర మార్గములో అయినా ఎదుగుదాము తొందరగా అని. ఒక మిత్రుడు తన మామను/ తండ్రిని అడిగాడు, వ్యాపారం చేయాలి, ఆస్తి నాకు ఇస్తావా ఇవ్వవా అని. ఇవ్వము అన్నారు ఆ పెద్దలు, వీరి మీద నమ్మకము లేక.

వారికి వెన్నుపోటు పొడిచి, ఆస్తి తీసుకున్నాడు. అందరూ, ఈ రోజుల్లో నీతి ఏమిటిలే, అని బంధువులు గమ్ముగా ఉన్నారు. తర్వాత, ఆ మిత్రుడు, ఈ మిత్రుని మోసము చేసి, ఆ ఆస్తి కొట్టేసాడు.

ఆ తర్వాత వారి బంధువులు పిల్లలు, అందరి ఇళ్ళలో ఇదేదో తేలిక మార్గము లా ఉంది అందరితో పాటూ మనము అని, అలా ఒకరి నొకరు వెన్నుపోటులు పొడుచుకుంటూ, ఆ ఆస్తి అలా చేతులు మారుతూ పోతుంది, ఏ ఒక్కరు దానిని పూర్తిగా అనుభవించలేదు.

కాబట్టి, మనము తప్పు దోవపడితే, మన బంధువులు స్నేహితులు పిల్లలు అందరూ, అదే దోవలో మనల్ని పతనము చేసి, వారు పతనము పొందుతారు. అందుకే ధర్మాన్ని కాపాడు, అది మనల్ని కాపాడుతుంది అని పెద్దలు చెప్పింది.

అందుకనే, ధర్మం తో అలాగే దేవునితో ఉండటానికి, గుణం మరియు మంచి లక్షణాలను ఏనాడూ వదులుకోవద్దు. బంగారం మరియు రాయి కూడా, పెద్ద పెద్ద సుత్తి దెబ్బలు పొందుతాయి విలువైన నగలు/ విగ్రహంగా మారడానికి.

ఒకవేళ, అవసర అవకాశం కోసం, గుణం మరియు విలువలు చంపుకున్నా, ఇంకొకరు మనల్ని అదే మోసము చేస్తారు, అలాగే దాని పర్యవసనాల దేవుని శిక్షల నుంచి ఎటూ పారిపోలేము. వెంటపడి మరీ, శిక్షలను ఇస్తుంది. కాబట్టి దయచేసి సత్యహరిశ్చంద్ర కథను గుర్తుంచుకోండి.

75 శాతం పాపాలతో, నేడు పంచభక్ష పరమాన్నాలు తిన్నా సౌకర్యాలు పదవులు ఆస్తులు అనుభవించినా, చివరకు అందరూ, కన్నీళ్ళు కష్టాలు తోనే పోయారు, పోతారు. వారిలోనే మనమూ ఉందాము అంటే, ఆపే వారు ఎవరూ లేరు. పంచభూతాలు వాటి పని అవి ఎటూ చేస్తాయి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 01-Nov-2022, Upd Dt : 01-Nov-2022, Category : General
Views : 184 ( + More Social Media views ), Id : 1603 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : person , honest , trees , cut , first , people , screwed , first , ashtavyasan , saptavyasan , arishadvarg
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content