ఉచితముగా పాఠము చెప్పే గురువు, శనీశ్వరుడు మకరం లోకి - గత అనుభవాలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 989 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

భారతం లో ఈరోజు అంటే 24 వ తేదీ షుమారు ఉదయం 10 గంటలు కు, కాలీఫోర్నియా లో 23 రాత్రి షుమారు 8.30 కు, మన జీవితంలో తప్పనిసరి గా వచ్చే, వద్దు అన్నా కొట్టి మరీ ఉచితముగా పాఠము చెప్పే గురువు, శనీశ్వరుడు మకరం లోకి మారుతున్నారు. 5 రాశులకు, అంటే దాదాపుగా నూటికి 40 మంది, ఇక పండగే 2 1/2 ఏళ్ళు, విపరీతమైన లాభము(పనులు కావడము, డబ్బు రావడము, పెళ్ళి కావడము, . . .) లేదా నష్టము కలగలిపి ఉంటాయి. ఇంకో వైపు రాహువు, కేతువు స్థానాలు కలిపితే మొత్తము సగము జనాబా, వీరి అధీనములో ఉంటారు.

జాగ్రత్తలు మరి , మాయా మోహం లో పడవద్దు. ఆశ చూపి, పై పైకి లేపి, నేలకు పడవేస్తుంది మాయా మోహము తెలియకుండానే. జన్మ రాశులు, దశ అంతర్దశలు కూడా చూసుకోండి. అనుమానం ఉంటే ఎవరినైనా అడగండి, నష్ట పోకూడదు. అందరం బాగుండాలి.


ఏడున్నర సంవత్సరాల, గోచార శని మహా దశ నుంచి, ఈరోజు బయట పడ్డాము. దుమ్ము దులిపి, ఉతికి, బండ కేసి బాది, పిండి ఆరేసి, పిప్పి చేసి వదిలారు భగవంతుడు కొన్ని లాభాలు కూడా చేసి.

అమ్మ తోడుగా ఉండ బట్టి శారీరకంగా, మానసికంగా వదిలేసి, కేవలం ఆదాయం మీద దెబ్బ కొట్టారు.

ఎందుకంటే ఆల్రెడీ నేల నిద్ర, శాఖాహారం, వేప పొడి, కాకర రసం, 31 వారాల 108 ప్రదక్షిణలు, 6 ఏళ్ల శనివారం గుడి తైల దీపం, . . .ఇంకా ఎన్నో. మన కష్టం నష్టం శ్రమ అణుకువ తప్ప, శని దేవుని దగ్గర డబ్బు తో పూజలు పని చేయవు. సంవత్సరం గా మీరు అన్ని చదివి ఉంటే, ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసు, గుండె ధైర్యము వచ్చి ఉంటుంది.

ఇంక ఇక్కడ ఉంచడమా , ఇంటికి పంపడమా అనే నిర్ణయం జరగబోతోంది, రాబోయే నెలలలో. శని భగవానుడు జీవితం మలుపు తిప్పుతారు. మరలా రెండు న్నర ఏళ్ల కు అర్ధాష్టమ శనిగా వచ్చి పలకరిస్తారు, 7 1/2 ఏళ్ల గాయాలు ఎలా ఉన్నాయి అని.


శని భగవానుడు జీవిత పాఠాలు నేర్పిస్తారు, వచ్చే 30 ఏళ్ల కి. మధ్య మధ్యలో అర్ధాష్టమ, అష్టమ శని గా వచ్చి, మన బుద్ధి నడత మారిందా అని, మరలా చెక్ చేసి వెళతారు. అది అంతా మన మంచికే, శని మనకు మంచి చేస్తాడు సక్రమంగా పెట్టి.

మాకైతే ఆదాయం పోకుండా ఇంకొకరి ని చేయి చాచి ఆధారపడకుండా, ఆయన ఎప్పుడూ మాతోనే ఉండాలి, ఆ కష్టాలు ఇబ్బందులు ఇస్తూ అనిపిస్తుంది. అవి ఉంటేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, దేవునికి దగ్గర అవుతాము.

సుఖాలకు అలవాటు పడితే, ఇవన్నీ ఆనందంగా భరించలేము, దేవుని కి దూరం అయి, మాయా మోహం లో పడతాము విల విల లాడుతాము.

ఇంతకన్నా మంచి చేసినా, చెడు చేసినా ఈశ్వరార్పణం అంటూ, కన్నతల్లి ని మాత్రం వదలకుండా, చేయమని ప్రార్ధన తప్ప వేరేది కోరము. కావాలంటే అక్కడ కు తోడుగా వెళతానికి రెడీ అని, ఎప్పుడో అనుకున్నాము గుర్తు ఉంది కదా.

జన్మరాశి గోచారము తో పాటు గా దశ , అంతర్దశలు కూడా చూడాలి. మంచి వారిని ఏ గ్రహాలు ఏమీ చేయవు. భయము లేదు, దేవుని అండ తో.


శని దేవుని నుంచి సగం బాధలు తప్పించే శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఆశ్చర్య పోతారు. తల్లి దండ్రులు కు. దేవుని కాళ్ళు కాదు పట్టు కోవాలసింది తల్లి దండ్రుల కాళ్ళు. వాళ్ళు మన ఇంట్లో ఉంటే, వారి సలహాలు మనము పాటిస్తే, సగం రక్షణ దొరికినట్టే. పిచ్చి వాళ్ళు చాలామంది తెలీక, వారిని దూరంగా పెట్టి, గుడులు స్వాములు గురువుల చుట్టూ పూజలు అని డబ్బులు వెదజల్లుతారు వృధాగా.

పదేళ్ల లోపు పసిపిల్లల కు శని టైం నడుస్తున్న, దాన్ని తల్లి దండ్రులే భరించాలి. పసి పిల్ల కు ఆదాయం పోదు కదా, కాబట్టి తల్లి తండ్రి కి పోతుంది.

తేలిక మార్గం ఏమిటి? తప్పులు చేయవద్దు. వెరే మనిషి చూడకపోయినా, మన పాపం కుట్రలు కుతంత్రాలు కృతఘ్నతలు మోసం అన్నిటిని, పంచ భూతాలు రికార్డు చేస్తున్నవి మరువద్దు. పాపం కు దూరంగా ఉండటమే ఉత్తమం.

ఖర్మ కాలి, మానసికంగా లేదా శారీరకంగా దెబ్బ తింటే, ఇక మందే లేదు. గమ్ముగా ఉన్నా పర్లేదు, మంచి తప్ప చెడుకు నటనకు పోవద్దు.

శని వెళ్ళగానే అంతా మంచి గా ఉంటుందా అని కొందరి సందేహము. జవాబు ఉండదు, రోగం తో మంచం దిగిన తర్వాత, కొన్ని నెలలు పడుతుంది కదా, మామూలు గా తిరగడానికి. కూలిన ఇల్లు కట్టలి అంటే, నెలలు పడుతుంది.

భార్య లేదా భర్త కు ఒకరికి ఏలినాటి శని వస్తే? రెండవ వారూ భరించాలి, మొదటి వారికి కొంత ఉపశమనం ఈ విషయములో. ఇక ఇద్దరు కూ వస్తే, ఇంటి చుట్టూ పక్కల వారికి పెళ్లి సందడే.

ఏవండీ నాకు శని, రాహు, కేతువు లు లేవు. కానీ పనులు కావడం లేదు, అన్ని తగవులు గొడవలు అనుకుంటున్నారా? గోచారం మొదటి లెక్క, కానీ దశ అంతర్దశలు జన్మ నక్షత్రం ప్రకారం చూస్తే , అక్కడ శని రాహు కేతు ఉండవచ్చు. తెలిసిన వారికి చూపించండి.

అని రాము సోముతో చెప్పాడు తన అనుభవాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1017 General Articles, 46 Tatvaalu
Dt : 24-Jan-2020, Upd Dt : 24-Jan-2020, Category : General
Views : 378 ( + More Social Media views ), Id : 286 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : saturn transit into Capricorn , makaram , shani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content