సోషల్ మీడియా - మన ఫోటోలు, ఫ్లెక్సీ ల ఫోటోలు, వివరాలు, అనర్ధాలు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,473; 104 తత్వాలు (Tatvaalu) and views 224,966.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పెళ్ళిళ్ళ పేరయ్య పల్లెటూరిలో, సంబంధం మాటలు మరియు వివరాల కోసము , చారి గారింటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కోసం. అన్ని వివరాలు మాట్లాడుకున్నాక, పేరయ్య అమ్మాయి ఫోటో అడిగాడు. చారి గారు ఒక ఫోటో ఇచ్చారు. అదేమిటండి, పది మందికి చూపించాలి అంటే, కనీసం 10 ఫోటోలు లేదా 5 అన్నా ఇవ్వాలి గదా. అలా మొహమాట పడితే ఎలా అన్నారు. పల్లెటూరు గదండి, బయట ఇవ్వద్దు, చూపించి మరలా తేండి , అన్నారు సాంప్రదాయముగా.

పేరయ్య నవ్వారు, మీరు బయట లోకము చూడటము లేదు. పెద్ద పెద్ద ఫ్లెక్సీ లలో ఫోటోలు, ఫేస్బుక్ లో ఫోటోలు, వాట్సాప్ లో ఫోటోలు ఎక్కడ చూసినా ఫోటోలే ఫోటోలు. ప్రతి పెళ్ళికి, పుట్టిన రోజుకి, పది పాస్ అయినా లేదా పది సార్లు తప్పినా, లుంగి కట్టినా, మనిషిని ఎత్తినా, విదేశం ఎక్కినా దిగినా, లేదా ఏ కార్యానికైనా కూడా , రోడ్ మీద ఇంట్లో వాళ్ళను, పిల్లలను, పెద్దలను ఫ్లెక్సీ ఫొటో లతో నిర్భయముగ జంకు లేకుండా అందరికి చూపిస్తున్నారు, అన్నారు నవ్వుతూ.

నిజమే లేండి, మా అబ్బాయి బెంగుళూర్ లో పని చేస్తున్నాడు. వాడు చెప్పాడు, ఈ విషయముతో పాటే జాగ్రత్తలు కూడా. పోకిరీ లు మన ఫోటోలు తేలికగా తీసుకోని, ఫోటోషాప్ లో మార్చి, చెండాలము గా చూపిస్తున్నరు అంట గదా. మహిళలు, పిల్లలు జాగ్రత్త. మన సమాచారము దొంగిలించి కూడా, నష్టము చేస్తున్నారు అంట గదా. ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్ తో, ఫోటోలే ఫోటోలు. ఇంకా కనపడని కెమెరా ల తో, ఏమి చేస్తున్నారో కూడా తెలీదు . టెక్నాలజి పెరిగి కొంపలు కూలుస్తుంది, మనమూ దానికి ఎదురు సహాయము చేస్తున్నాము. వినాశకాలే విపరీత బుద్ది అనీ.

మన పేరు మీద దొంగ గాస్, ఐడి కార్ద్, ఆధార్, సింకార్డు , ఇంకేదన్నా దొంగ స్థలానికి పెట్టుకోవాలన్నా సమాచారము(ఇల్లు చిరునామా, ఫోన్ , ఈమైల్, పేర్లు, వయస్సు, చదువు, కాలేజి, తిరిగిన ఊర్లు, చుట్టాలు స్నేహితుల పేర్లు, . . . ) మొత్తము ఫేస్బుక్ లో వాట్సప్ లో ఫోటోలతో సహ మనమే పెడుతున్నాము గదా, ఎదుటివారు కష్టపడకుండా . ఆఖరుకి దొంగలకు కూడా, తిరుపతి లో ఉన్నాము అని స్టేటస్ అప్డేట్ చేస్తున్నాము, దొంగలను తేలికగా రమ్మని. మన జాగ్రత్తలో ఉంటే మంచిది గదా అన్నారు నవ్వుతూ.

ఇప్పుడు అశ్చర్యపోవడం పేరయ్య గారి వంతు, నిజమే గదా అంటూ.

చాలా మందికి తెలియనిది ఏమిటి అంటే, ఫేస్ బుక్ లో తమ ఫొటో, తమ స్నేహితులే, చూస్తున్నారు అనుకుంటారు. కాదు, మీ సెట్టింగ్ లు బట్టి, స్నేహితుల స్నెహితులు కూడా చూడొచ్చు, వారు ఎలాంటివారో మీకు తెలీదు. అంతే కాదు, ఫేస్ బుక్ లేదా గూగుల్ సెర్చ్ లో మీ ఫొటోలు వివరాలు రావచ్చెమో.

ఇంకా మన సమాచారము, మాట్రిమోని వెబ్సైట్ లోనో, ఫ్రీ సర్విస్ ఇచ్చే వెబ్సైట్ లోనో , ప్రవాసుల ప్రభుత్వ వెబ్సైట్ లోనో,సిం కార్డ్ దగ్గరో, బాంక్ లోనో, ఓటర్ కార్డ్ సేకరణ ద్వారానో, ఎలాగో ఒకలా, దొంగలకు చేరుతుంది. ఇందుగలదు అందు లేదు అను సందేహము వలదు, ఎందెందు వెతికినా మన సమాచారమే.

ఇంకొంతమంది డబ్బుకు కక్కుర్తి పడి, ఇంట్లో ఏ కార్యక్రమం అయినా, ఫోటో/వీడియో లు, ఎవరు బడితే వాళ్ళతో తీయిస్తున్నారు. నమ్మకము ముఖ్యము, ఖర్చు ఎక్కువ అయినా. ఎందుకంటే, కార్యక్రమం తర్వాత, మన ఇంట్లో వాళ్ళవి, ఆ ఫోటో/వీడియో లు ఎక్కడకు చేరుతున్నాయో మనకు తెలీదు. తెలిసిన, నమ్మకము, అనుభవము, వయస్సు(మెచ్యూరిటి) ఉన్న వాళ్ళతో వెళితే మంచిది.

అలాగే వాట్సప్ లో మీ ఫొటోలు, స్టేటస్ అప్డేట్ ల ఫొటోలు వివరాలు, ఎవరు చుస్తున్నారో తీసుకుంటున్నారో, జాగ్రత్త మరి. దొంగలకు అన్ని మనమే చెపుతున్నాము, చూపిస్తున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,473; 104 తత్వాలు (Tatvaalu) and views 224,966
Dt : 30-Dec-2018, Upd Dt : 11-Apr-2019, Category : Devotional
Views : 1742 ( + More Social Media views ), Id : 9 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : social media , fake id , identity theft
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content