APLatestNews.com top Banner
         
మనం రాజకీయ నాయకులు ను అడగలేం కడగలేం, మన తాను ముక్క లే - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సమర్ధులు నాకెందుకు లే అని చేతులు కట్టుకుని కూర్చొని ఉంటే అసమర్ధులు రాజ్యాన్ని ఏలతారు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.

1. గుంటూరు లో 5 ఎకరాలు ఊరక ఒక అతను కొట్టేసి, అతను 5 గురికి ఉద్యోగం ఇచ్చి కొన్ని రోజులు తక్కువ జీతం తో, 10 మందికి 1000 పంచితే , 20 మందికి ఉచిత భోజనం పెడితే.

జనం , అతనిని నాయకుడు, దాత , మంచి వాడు అంటారు. ప్రాణం ఇస్తామంటారు. మా అన్న అంటారు.

గుంటూరు లో 5 ఎకరాలు కొట్టేసింది దాని రేటు 5 కోట్లు పై మాట బయటకు రాదు , వచ్చినా మనది కాదులే. అది ప్రభుత్వ ఆస్తి అంటే మనదే.

2. గుడి లో అప్పయ్య ను ధర్మ కర్తగా పెడితే, జనం డబ్బులు వేస్తుంటే , అప్పయ్య ఉచిత భోజనం అని పేరు పెట్టి ఆయన పెడుతుంటే.

ఓరి నీ యంకమ్మా , మేము వెర్రి జనం కాము. జనం డబ్బు తో భోజనం పెడుతూ , నీ పేరెందుకు పెడుతున్నారు అని అడగరూ. ప్రసాదం పెట్టమంటే , నీ జేబు సొమ్ము లా , భోజనం ఎందుకు పెట్టి గొప్పగా, ఖజానా ఖాళీ చేస్తావు అని అడగరే? ఎంత నొక్కారు లోపల అని అసలు అడగం.

అలాగే రాజన్న, రామన్న, రాజీవన్న , చంద్రన్న, పధకాల పేర్లు కూడా.

3. ఊరుకోవయ్యా 5000 ఇచ్చారు, మజ్జిగ బిర్యానీ ఇచ్చారు. నెలకు 5000 ఇచ్చారు. ఇది మాకు చాలు.

దీని తోటే అపోలో కి వెళతాము , గీతం లో చదువు తాము , 50 వేల ఉద్యగం తెచ్చుకుంటాం అంటారా నిద్ర లో. మనల్ని ఎవరూ కాపాడలేరు.

4. ఓటు వేయని లేదా కుల , మతం, వర్గం, ధనం కి అమ్ముడు పోయే మనం రాజకీయ నాయకులు ను అడగలేం కడగలేం. మన తాను లో ముక్క లే వారు. తప్పు మనదే.

 
Dt : 04-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 227 ( id : 75 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content