APLatestNews.com top Banner

Social Media links
7 అడుగు ల దేవుని విగ్రహమా లేదా 70? మనసు నిగ్రహం, అష్ట వ్యసనాలకు దూరంగా, 7? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గణనాధా ఓ గణనాధా, మూషిక వాహన గజాననా, మోదక హస్తా గజాననా, పార్వతి తనయా గణనాధా - ఇలా ఎన్ని విధాలుగా కీర్తించినా, చిరునవ్వుతో మనల్ని ఆశీస్సులు తో ముంచేస్తారు. గుంజీలు అంటే ఆయనకు మక్కువ, మనకు మంచి వ్యాయామం.

గణపతి మింగిన చక్రాయుధం బయటకు తేవడానికి, మహా విష్ణువే గుంజీలు తీసారు అంట, ఆయన ఎదురుగా. మామయ్య ఎందుకు అలా చేస్తున్నారు, అని పకపకా నవ్వారు అంట, మన బుజ్జి గణపతి. నవ్వుతో బయటకు వచ్చిన చక్రం ను తీసుకుని, ఇందుకు అల్లుడు అని ముద్దాడి ఆశీర్వదించారు అంట.

కుబేరుడు అపార సంపద ఉందని, గర్వం తో భోజనానికి పిలిస్తే, ఎంత తిన్నా ఇంకా కావాలని, సమస్తం ఆరగించి, కుబేరుని గర్వం అణిచారు. కుబేరుడు ఇంక ఏమీ లేదు పెట్టడానికి అని మన్నించమని కోరారు. భక్తి తో చిన్న పసుపు ముద్ద చేసి, శక్తి మేర చిన్న నైవేద్యం పెట్టిన కూడా చాలు. మనసు ముఖ్యం.

7 అడుగు ల దేవుని విగ్రహమా లేదా 70 అడుగులా, అన్నది కానే కాదు ముఖ్యం. మోహం లో అటు వెళుతున్నాము ఆర్భాటంగా, గొప్ప లు మరియు ఖర్చు కోసం. విగ్రహం, నిగ్రహం కోసం మాత్రమే అని, మనం గ్రహించేది ఎప్పుడు? మనకే తెలీకపోతే మనం పాటించకపోతే, మన పిల్లల కు ఎలా చెపుతాం? అమెరికా లో కూడా 18 అడుగు ల విగ్రహం దాకా వెళ్ళారంట, ఇంకెంత ఎత్తు వెళతారో గణపయ్యా?

అంగుళం లేదా బొటనవేలు అంత విగ్రహం చాలు, అని ఎంతమంది కి తెలుసు? బయట పందిరి లో, మనిషి ఎత్తు 7 అడుగు ల కు మించి అవసరమా? ఇంట్లో, బొటనవేలు పరిమాణం, గణపతి పసుపు ముద్ద చాలు కదా? దొరికితే అన్ని పత్రి ఆకులు మంచిది, అవి మన ఆరోగ్యం కోసమే. అవి లేకనే గదా ఇమ్యూనిటీ లేదని, కరోనా గురువు తో భయం భయం. పత్రి లేకపోతే దొరకక పోతే, పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు కదా గీతలో. లేనివాడైన కూడా, నీళ్లు ఆకులు చక్కెర బెల్లం ముక్క ఉంటాయి కదా, ఇబ్బంది లేదు. మనసు, మానసిక శుద్ది ముఖ్యం.

నైవేద్యం, అలంకరణ కొంత వరకు చాలు, అదీ భక్తి తో దేవుని తలుస్తూ. డీజే సినిమా సాంగులు చెవులు పగిలేలా, అర్థం లేని డాన్సులు ఎందుకు? హాయిగా వినసొంపుగా భజనలు, నోటి తో పాడితే, సన్న వాయిద్యాలతో చాలు ను కదా?

ఎన్ని రోజుల మనసు నిగ్రహం మనకు ఉన్నది మిత్రమా, ఇంటర్నెట్ తో కలిసి అష్ట వ్యసనాలకు దూరంగా ఉండటానికి? 7 గంటలా, రోజులా, నెలలా లేదా ఏళ్లు నా? అది ముఖ్యం మన ప్రగతికి, మన కుటుంబం కి.

7 గంటలు లేదా రోజులు, అష్ట వ్యసనాలకు దూరంగా, నిగ్రహం గా ఉండటం చాతకాని మనకు, 7 అడుగులు విగ్రహం గురించి, తపన ఆరాటం ఎందుకు? కరోనా గురువు ను గౌరవించు, ఇంట్లో తల్లి దండ్రలను సేవించు.

కావ్యం రాయడానికి, ముఖ్యమైన శరీర భాగం దంతం విరిచి ఇచ్చారు గణపతి. మనం ఏమిస్తున్నాము, ఇతరులకు? జనం లేదా ప్రభుత్వం ది లాక్కుని, బతకకుండా ఉంటే చాలు. చాటంత చెవులు, ఇతరులు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి. మరి మనం కనీసం, మన పెద్దల మాట వింటున్నామా?

ప్రమధ గణాలకు అధిపతి అయి కూడా, అందరితో వినయంగా నమస్కారం చేసి, మాట్లాడుతూ ఉంటారు గణేషుడు. మనం నాయకులం లేదా ఓ అధికారి అయితే లేదా సామాన్య జనం గా, ఎవరినైనా లెక్క చేస్తున్నామా?

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్యా , అంటూ ఎన్ని మంచి పనులు ఆయనవి పాటిస్తూ, గౌరవిస్తూ ఉన్నామో , ఆత్మ విమర్శ చేసుకోవాలి.

విగ్రహం నిగ్రహం కొరకే. మంత్రం మనసు అదుపు కొరకే. సర్వేజనా సుఖినోభవంతు. జై గణేష్ మహా రాజ్ కి జై.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 21-Aug-2020, Upd Dt : 21-Aug-2020, Category : General
Views : 101 ( + More Social Media views ), Id : 655 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : 7 foot , idol , god , 8 addictions , 7 days , 7 months
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content