APLatestNews.com top Banner
ఏమిటీ ఈ అరాచకం, వెన్నుపోటు లేని ఇల్లు ఉందా? బందిపోటులేని గ్రామం ఉందా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఏమిటీ ఈ అరాచకం,

వెన్నుపోటు లేని ఇల్లు ఉందా? బందిపోటు లేని గ్రామం ఉందా?
మేము ఇన్నాళ్ళు మగ్గలేదా, మా వాళ్ళు ఇంకొన్నాళ్ళు మగ్గవద్దా,
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

మాకు లేని సంతోషం మా పిల్లలకు ఇవ్వాలా? మాకు లేని విజ్ఞానం మా పిల్లలకు రావాలా,
అందరు తప్పుడు వాళ్ళైతే, తక్కువ తప్పు వారిని ఎన్నుకోవాలి అని,
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

చిన్న చదువుకు కట్టాము వేలు, పెద్ద చదువుకు కడతాము లక్షలు,
ప్రవేట్ విద్యకు అమ్ముతాము ఆస్తులు, ప్రభుత్వ బడి కాలేజీ మాత్రం బాగుపడవు
ఒప్పుకోము ఒప్పుకోము కొత్త నాయకత్వం, మగ్గుతాము మగ్గుతాము మా జీవితాంతం

జబ్బుకు పోతాము భాగ్య నగరం, కాదంటే వెళతాము చెన్న పట్నం,
ప్రవేట్ ఆస్పత్రిలో ప్రాణం పోయినా సరే, ప్రభుత్వ దవాఖాన బతుకు మాత్రం ఇంతే
||ఒప్పుకోము||

పక్కనోడు ఆక్రమించినా కొంత, బయటోడు కబ్జా చేసినా అంతా,
పలుకుబడి ఉన్నొడికే న్యాయం, మంచివాడికే ఎన్నేళ్ళైనా అన్యాయం,
||ఒప్పుకోము||

రౌడీలు వీధులు ఏలినా, గుండాలు ఊళ్ళు ఏలినా,
రక్షణ న్యాయం అధికారం కాపు కాచినా, మా బతుకులు చింద్రం అయినా,
||ఒప్పుకోము||

ఉచిత నాణ్య విద్య వైద్యం మా కొద్దు, సామజిక రక్షణ మాకొద్దు
5 ఏళ్ళకు ఒక్కసారి 5 వేలు బిర్యాని మజ్జిగ చాలు మా ఖర్చులకు ,
||ఒప్పుకోము||

చవక బారు ఉచిత పధకాలతో, ప్రభుత్వ ఆస్తులు తాకట్టో తెగనమ్మో
దోచి విదేశాల బాంకుల్లో దాస్తుంటే, మా బిడ్డలు బలి అవ్వాలి బానిసలు గా
||ఒప్పుకోము||

ఫీజ్ వెనక్కితో కాలేజీకి లాభం, అనారోగ్యశ్రీతో కార్పొరేట్ కి లాభం
సెజ్ తో తమ వ్యాపారికి లాభం, ఖజానాకి జనానికి మాత్రం నష్టం
||ఒప్పుకోము||

పించను కు మూడేలిస్తే చాలు, నిరుద్యోగికి ఐదేలిస్తే చాలు,
చేయి చాపి, ఎదురు చూసే మా పరాధీన బతుకులు మాత్రం ఎదగకూడదు ఎన్నడూ
||ఒప్పుకోము||

ఊరికి నీళ్ళు లేకపోయినా సర్దుకుంటాం, మందు లేని ఊరు ఉంటే రచ్చచేస్తాం
సినిమా రాజకీయ ప్రేమ కోసం ప్రాణాలిస్తాం, తల్లి దండ్రుల ను అనాధలుగా వదిలేస్తాం
||ఒప్పుకోము||

మా కులపోడు వస్తే మాకు లాభం, వాళ్ళ వర్గం వస్తే వాళ్ళకు లాభం
మరి మోదీ లా ఎవరు వస్తే లాభం , మన రాష్ట్రానికి, జిల్లాకి, ఊరికి
||ఒప్పుకోము||

బడుగు సన్న రైతుకు అండలేదు, పిండుకోని వ్యాపార దళారి లేడు
బువ్వ కూర రేటు ఆకాశం కెగిరినా, అన్ని వస్తువుల రేట్లు అందకుండ పోయినా,
||ఒప్పుకోము||

రామన్న, చంద్రన్న, రాజన్న, జగనన్న, కుటుంబాలేనా పాలక నేతలు,
మా అన్న, మీ అన్న, చిన్నన్న, నేతలు కాకూడదు ఎన్నడూ
||ఒప్పుకోము||

కులం పేర పదవులు ఇచ్చినా, వర్గం పేర వరాలు పంచినా,
అయిన వాళ్ళకు అన్ని ఇచ్చి, కాని వాళ్ళకు సున్న మేసినా,
||ఒప్పుకోము||

అనుభవం కావాలి వెన్నుపోటులోనూ, ఫ్యాక్షన్, రౌడీ, కేసుల రాజ్యం లోనూ
కుల, ధన, వర్గ, మత వర్గీకరణలోనూ , సమాజానికి వీలైనంత చెడులోనూ
||ఒప్పుకోము||

లంచం లేనిదే ఏమీకాదు, తిండి నిద్రా ఎటూ లేదు, పిల్లల భవిష్యత్ కానరాదు
అవినీతి, అక్రమాలు, అన్యాయం పోకుండా, అమెరిక బతుకులా ఆశలేదు
||ఒప్పుకోము||

రామన్న రాజ్యంలో అధర్మం ఎంతో, చంద్రన్న పాలనలో అధర్మం అంతే
రాజన్న పాలనలో అన్యాయం ఎంతో, జగనన్న రాజ్యంలో అన్యాయం అంతే
||ఒప్పుకోము||

నాయకుడంటే వెన్నుపోటు పొడవాలి, కుల జాడ్యం తో నిండాలి
నాయకుడంటే కేసులతో కోర్ట్కు పోవాలి, ఫ్యాక్షన్ బాగ్రౌండ్ ఉండాలి
||ఒప్పుకోము||

కాంగ్రెస్ చెయ్యి విరిచి, కమలం తో వెలుగుతున్నాం,
మాసాని కో స్కాము నుండి, ఏడాది కో స్కాము వెతుకుతున్నం ,
||ఒప్పుకోము||

తక్కువ అవినీతి, కేసులు, మోసాలు, వెన్నుపోటులు గల వారు ఎవరు? చంద్రం? జగన్? పవన్? పాల్?

గుండెల మీద చెయ్యి వేసుకోని, మన పిల్లలు, మనుమల కోసం ఆలోచించి, వాళ్ళ బంగారు భవిష్యత్తు ను, మన చేత్తో మనం రాస్తున్నాం, గుర్తు ఉంచుకుందాం, ఓటు వేసేటప్పుడు.

తప్పక ఓటు వేద్దాం, మన దేశ, రాష్ట్ర, జిల్లా, పట్టణ, గ్రామ సౌభాగ్యం కోసం, బాధ్యతతో కూడిన రుణం తీర్చుకుందాం.
 

Dt : 22-Mar-2019, Upd Dt : 11-Apr-2019 , Category : Politics
Views : 686 ( + More Social Media views ) ( id : 64 )
Tags : andhra election , jagan , pavan , chandra babu , paul

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content