అనుభవం లేని నా బిడ్డకు ఉద్యోగం వద్దా? మూడో మనిషికి ఓటు వద్దా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,572; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రామయ్య, సోమయ్య మాటలు, వారు వేయబోయే ఓటు గురించి :

రామయ్య: అన్నా, ఎలా ఉంది, ప్రచారంలో మునిగి తేలుతున్నారు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి, వారి ఆస్తిలో నుంచి తీసి మనకు ఇస్తున్నట్లు. ఎవరు గెలుస్తారు అంటావు.

సోమయ్య : చెప్పలేము చాలా కష్టము అందరికి. పోయిన సారి గూడా తక్కువ మార్జిన్ తో బాబు గెలిచారు. అనుభవం ఉంది అనుకుంటే, ప్రత్యేక హోదా దగ్గర, ఒకసారి అటు, ఒకసారి ఇటు మారి, మా అబ్బాయికి ఉన్న తెలివితేటలు కూడా లేవు అని నిరుపించారు. లోకెష్ని రాయల్ గా తాకుండా దొడ్డిదోవన ఎమ్మెల్సి చేసి మంత్రి పదవి ఇచ్చారు. పచ్చ లోకంలో మునిగి తేలుతున్నారు.

నెలకి 150 రూపాయలకి , ఇంటర్నెట్ ఫోన్ టీవి కేబుల్ ఎటు పోయిందో తెలీదు. మన పిల్లలకి మంచి చదువు చెప్పించి, ఉద్యోగం ఇప్పించి, అన్ని కోనే సామర్ధ్యము ఇవ్వాలి గాని, అది చెయ్యటము లేదు. 10 ఏళ్ళు హైద్రబాద్ రాజధానిగా ఉంటే, ఓట్ కి నోట్ లో, అమరావతి వచ్చేసారు.

నిరుద్యోగ భ్రుతి తో అంతా తీరిపోతుందా. ఫీజ్ వెనక్కు వల్ల, దొంగ కాలేజ్ లు పెట్టి లేదా విద్యార్ధులు లేకుండానే డబ్బులు నొక్కేసారు తమ వాళ్ళతో కాలేజ్ లు పెట్టించి. అనారోగ్యశ్రీ వల్ల, ప్రవేట్ ఆస్పత్రులు బాగుపడ్డాయి లేని వాటికి ఆపరేషన్ చేసి, అవసరం లేని మందులు ఇచ్చి.

ఇంక జగన్ గురించి తక్కువ చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అసలే ఫాక్షన్ వాసనల మనిషి. పార్టీ అభ్యర్దులు, అలాగే తయారు అయ్యారు. రౌడీ సాంప్రదాయం పెరుగుతుంది ఏమో? ప్రధాన ప్రతిపక్ష నేత గా, శాసన సభలో నిలదీయల్సింది పోయి, రోడ్లు వెంట తిరిగారు ఓదార్పు అంటూ నెలలు గా. జనం బాధలు చెపితే, నేను గెలిచినాక చూద్దాము అని గమ్ముగా ఉన్నారు.

ఆ కేసుల చిట్టా పోయేదెప్పుడో. శుక్రవారం కోర్ట్ కు పోయినట్లుగా, అస్సెంబ్లీకి ఎందుకు పోకూడదు ప్రతిపక్ష నేతగా. ప్రత్యెక హోదా ఇవ్వని మోడీని ఎమీ అనరు. కేసీయార్ తో కలిసి, ఇంకా హైదరాబాద్ నుంచే అభ్యర్ధుల ప్రకటన జరుగుతుంది. గెలిస్తే, ఆంధ్రాకు రావలసినవి రాకుండా, కేసీయార్ కు అప్పగిస్తాడేమో ప్రతిఫలంగా. ఆంధ్రాలో ఉండటం కష్టము గా ఉంది తనకు.

రామయ్య : మరి చంద్రన్న కాక, జగనన్న కాక ఇంకెవరికి వెయ్యాలి అంటావు? పవన్ కొత్తవాడు గదా? చిరు లాగ వెనక్కి పోతాడేమో? అనుభవం?

సోమయ్య : మన కేంద్రంలో, చెయ్యి, పువ్వు తప్ప ఇంకో పెద్ద పార్టీని ఎదగనివ్వరు. హోదా ఇవ్వకుండా, కాంగ్రెస్స్ చీల్చింది. బాబు మోడీ తో కలసి ఆడిన నాటకంలో హోదా రాలేదు. మరి ఇంకో పార్టీ లేదు.

పక్క రాష్ట్రంలో, కాంగ్రెస్స్ ని, చంద్రన్న ని ఓడించి, కేసియార్ గెలిచారు ప్రజలకు బంగారు పాలన ఇవ్వాలి అని. అలాగే ఇక్కడా చంద్రన్న కి, జగనన్న కి 3 వ మనిషి పోటీ ఉండాలి. ఇప్పుడు పవన్ దొరికాడు.

ఒక ఇంట్లో ఉన్న పిల్లలు అందరు ఒకే రకము గా ఉండరు. చిరుతో పోలిక అనవసరం. మా వాళ్ళ పిల్లలు లేదా మనుమలు కాలేజ్ చదువు అయ్యి, ఉద్యోగం కోసం చూస్తున్నారు. అనుభవం లేదు అని ఎవ్వరు ఉద్యోగం ఇవ్వకపోతే ఎలా, నీకూ పిల్లలు ఉన్నారు, ఆలోచన చెయ్యి.

కొత్త రక్తం రానిదే, వ్యవస్థ ఎలా మారుతుంది , బాగుపడుతుంది. పవన్ లేదా 3 వ మనిషి గెలిస్తే, జగన్ మరియు బాబు భయపడతారు. తర్వాత ఇంకా మంచి పనులు చేస్తారు. పవన్ అధికారము లోకి తగ్గ సీట్లు రాకపొయినా, మద్దతు ఇచ్చే సంఖ్య వస్తే కూడా మిగతా ఇద్దరు భయపడతారు. పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని, పవన్ కష్టపడతారు.

మన బిడ్డలు, మన సమాజం గురించి మనము ఆలోచన చెయ్యకపోతే, ఇంకెవరు ఆలోచన చేస్తారు. తెలివిగా ఆలోచన చేసి ఓటు వెయ్యండి. అవకాశవాదులకు(కులానికి, వర్గానికి, 2000 కు, చిల్లర బిస్కెట్ లకు) అమ్ముడు పోతే, నష్టపోయేది మన బిడ్డల భవిష్యత్తే. ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, జవాబుదారీ తనం, సామజిక రక్షణ, స్వేచ్చ, భద్రత, ఇవి మన పిల్లలకు అందించాల్సింది.

అందరూ దొంగలైతే, తప్పదు, చిన్న దొంగను ఎన్నుకోవాలి. తర్వాత ఎన్నికలలో, దొంగలు లేదా అవకాశవాదులు తగ్గుతారు.

ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలి, రాజ్యంగ పరి రక్షణకు బాధ్యత వహించాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,572; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608
Dt : 22-Mar-2019, Upd Dt : 12-Apr-2019, Category : Politics
Views : 1430 ( + More Social Media views ), Id : 63 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra election , jagan , pavan , chandra babu , paul
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content