APLatestNews.com top Banner
దేవుడు ఉన్నారా? మరి నాకు కనపడరే, 50 ఏళ్ళు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా? - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పాలలో నెయ్యి ఉంది లేదా వస్తుంది అని అంటారు, మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఐతే ఇవిగో గిన్నెడు పాలు, దీనిలో నుంచి నెయ్యి తీయండి.

అదెలాగ వస్తుంది అండి నేరుగా పాల నుంచి, దానికి సమయం తో కూడి, చాల పెద్ద పద్ధతి ఉంది, అది నియమంగా ఓర్పుతో చిత్తశుద్ధి తో పాటిస్తేనే, నెయ్యి వస్తుంది.

అయితే వివరంగా చూద్దాం, మరి ఆ పద్దతి ఏమిటో.

మంచి ఆవు పాలు తెచ్చి, శుభ్రంగా కడిగిన పాత్రలో పోసి, కట్టెలు లేదా ఇంకో విధంగా అగ్ని తో వేడి చేయాలి. పాలు పొంగకుండా కింద పోకుండా, పొయ్యి తగిన వేడి ఉండేటట్లు, జాగ్రత్తలు తీసుకుని, కనిపెట్టి కూర్చోవాలి. మీగడ పోతే వెన్న రాదు.

అంటే మన మనసులో కూడా పాత్రత, చిత్తశుద్ది, ఓర్పు ఉండాలి కదా.

ఆ తర్వాత పాలను చల్లార్చి, తగిన వేడి ఉన్నప్పుడు సేమిరి అంటే మజ్జిగ కొంచెం వేసి, మూత వేసి, జాగ్రత్తగా పక్కన పెడితే కదలకుండా, తర్వాత రోజు కు లేదా కొన్ని గంటలకు, రసాయన చర్యలు జరిగి, పెరుగు ఏర్పడుతుంది.

ఆ పెరుగును నీళ్ళు తో కలిపి, కవ్వం తో చాలా సేపు కష్టపడి చిలికితే, మజ్జిగ తో పాటుగా వెన్న వస్తుంది. ఆ వెన్న ను మరలా, పొయ్యి మీద కాచిన ఎడల, నెయ్యి వస్తుంది.

ఈ మొత్తం పద్ధతి లో ఎక్కడ అయినా, చిన్న పొరపాటు జరిగినా, నెయ్యి రాదు. అంటే పాలు మంచివి కాకపోయినా, పాత్ర శుభ్రం లేకపోయినా, వేడి సరిగ్గా చేయకపోయినా, పాలు పొంగి పోయినా, పిల్లలు పిల్లి కుక్క తాగినా కదిలిస్తూ ఉన్నా ఇంకోటి కలిపినా, సేమిరి సరిగ్గా వేయకపోయినా, రసాయన చర్య సరిగ్గా జరగకపోయినా, పెరుగు గడ్డ కట్టకపోయినా, పెరుగు చిలకడం రాకపోయినా, ఇలా ఏ చిన్న తప్పు జరిగినా, నెయ్యి రాబట్టలేము. మొత్తం ప్రయత్నం వృధా అవుతుంది. మరలా మొదలు పెట్టాలి కొత్త పాలతో కొత్త లేదా తోమిన పాత్రతో.

అంటే భవ బంధాలు, మోహాలు, భ్రమలు, అరిషడ్వర్గాలు ఇలా ఎన్నో, మన మనసు ను, కలుషితం చేయడానికి సిద్ధంగా ఉంటాయి, అప్రమత్తంగా ఉండాలి. మరలా ఎదురు దెబ్బలు తిని లేదా మరు జన్మలో సాధన మొదలు పెట్టాలి.

చూసారా, కేవలం నెయ్యి కోసం ఎంత కష్టపడి, ఎంత మనస్సు దాని మీద లగ్నము చేసి, ఎంత సమయం లో, ఈ పద్ధతి పాటించాలి. ఈ రోజులలో అసలు పాల తోడు వేసి పెరుగు, పెరుగు నుంచి మజ్జిగ వెన్న, తీసే ఓపిక ఉన్నదా ఎవరికైనా? అందరు, నేరుగా నెయ్యినే కొంటున్నారు, ఎక్కడ పడతాము ఆ కష్టాలు అని.

ఈ రోజుల్లో పాడి ఉన్న వారు కాకుండా, వారు కూడా నమ్మకం లేదు అనుకోండి, ఎంతమంది పాలు తోడు వేసి, మజ్జిగ కవ్వం తో చిలికి, నెయ్యి ఇంట్లో నే చేస్తున్నారు?

అంత ఓపిక సహనం శ్రద్ధ ఏకాగ్రత ఉన్నాయా మనలో? డబ్బు విదిలించి, పెరుగు నెయ్యి మజ్జిగ, క్షణంలో కొంటున్నాము. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి? మరి మన శ్రద్ద లేని పూజ ఉపయోగం ఏమిటి? దేవుని గురించి ఆలోచనలో, వంద మైళ్ల దూరంలో ఉన్నాము. అందుకే పాపం, వేయి పాదాల పరుగులు తీసి పెద్దదై, 80 శాతం మందిని అంటే మనల్నే కబళించివేస్తుంది, మనకు పుట్టిన లేదా ఇంటికి వచ్చిన బిడ్డలు గా.

మరి దేవ దేవుని కోసం, రోజూ నిరంతరం, ఎంత శ్రద్ద మనసు పెడుతున్నామో, ఎవరికి వారు, ఆలోచన చెయ్యాలి. అప్పుడే ఆయన దొరుకుతారు. దానికి కొన్ని వందల జన్మలు ఎత్తాలి కొందరు, కోతి లాంటి మనసు ను కట్టడి చేసి, భగవంతుని ధ్యానం చేయాలి అంటే. అలాగని, కష్టం కాదు సుమా, మనం మూడు అడుగు లు వేస్తే, ఆయన ఆరు అడుగులు, మన వైపు వేస్తారు.
 

Dt : 15-Feb-2020, Upd Dt : 15-Feb-2020 , Category : Devotional
Views : 224 ( + More Social Media views ) ( id : 46 )
Tags : finding god

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు