APLatestNews.com top Banner
గోవర్ధన గిరి బృందావనం - గోపాలురం కదా మనం గోవులను ప్రకృతి ని పూజించాలి - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
గోవర్ధన గిరి, భాగవతం లో ప్రస్థావించబడిన ఒక పర్వతం పేరు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది. గోవర్ధనం అనగా గోవుల్ని వృద్ధిచేయడం.

కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు, బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.

గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు, శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా, పండుగ జరుపుకుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం, ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులను ప్రకృతి ని పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తారు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు, ఏడు రోజులు కుండపోతగా, రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు.

దిక్కు తోచని ప్రజలు, కృష్ణున్ని వేడుకొనగా, తన చిటికెని వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. వారంతా, ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం, వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి, కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను, ప్రజలకు తెలియజేశారు.

గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు కూడా, కృష్ణ భగవానుడు నన్ను పూజించాలి అని చెప్పలేదు. అదీ దైవత్వం అంటే.

ఢిల్లీ నుండి కొద్ది దూరంలో మధుర దగ్గరలో బృందావనం ఉంది. గోవర్ధన పర్వతం బృందావన్ నుండి 22కి.మి దూరంలో వుంటుంది. బస్సులు, ఆటోలు వెళుతుంటాయి. దారిలో రాధాకుండ్ వుంది. రాధాకుండ్ నుండి 5కి.మి దూరంలో వుంటుంది గోవర్ధన పర్వతం. ఇక్కడ ఒక చిన్న ఊరులా వుంటుంది. ఈ ఊరినీ గోవర్ధన్ పేరుతోనే పిలుస్తారు. గోవర్ధన పర్వతం వున్న చోట గోవర్ధన మందిరం వుంది. అందరూ అక్కడ దర్శనం చేసుకునే ప్రదక్షిణ మొదలుపెడతారు.

అక్కడ ఒక దగ్గర కృష్ణుడి విగ్రహం, మరో దగ్గర చిన్న గోవర్ధన పర్వత నమూనాలో గుడి వున్నాయి. గోవర్ధన గిరి ప్రదక్షిణ ఇక్కడ ఒక చోటునుండి మొదలవుతుంది, సుమారు 11 కి.మీ, కొనసాగుతుంది.

సాధారణంగా గోవర్ధన పర్వతం అంటే చాలా ఎత్తుగా నిలబడి వుంటుంది అనుకుంటారు. కాని గోవర్థనగిరి పడుకున్న పర్వతం, ఎత్తు తక్కువగా వుంటుంది. చుట్టు కొలత మాత్రం 11కి.మి. ఉంటుంది.

సేకరణ మరియు సవరణ
 

Dt : 20-Dec-2019, Upd Dt : 20-Dec-2019 , Category : Devotional
Views : 385 ( + More Social Media views ) ( id : 45 )
Tags : Govardhan giri

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు