Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏవండీ మన ఇంట్లో ఎవరికైనా, అలా వైరస్ వస్తే, ఎలా జాగ్రత్తలు పడాలి, దూరం విషయంలో?
గురువు గారు, దీనికి మన పెద్దలు, ఎప్పుడో మార్గాలు చూపించారు, అనుసరించారు. మీ ఇంట్లో 30 ఏళ్ళు దాటిన వారు ఉంటే, వారికి అవి బాగా తెలుసు.
మొదట గా అసలు మనకు, రాకుండా జాగ్రత్తలు పడాలి. అందరికీ మొఖము కాళ్ళు చేతులు సబ్బు తో పరిశుభ్రముగా కడగందే, సొంత ఇంట్లో మనిషి, పిల్లలు పెద్దలు అయినా కూడా తాక కూడదు.
గతములో చిన్నప్పుడు నేరుగా సినిమా నుంచి వచ్చి, ఇంట్లో కి వెళ్లి, అన్నం పెట్టు అంటే. ఆ రోజుల్లో అమ్మా నాన్న, ఇద్దరూ అరచే వారు. ముందు బట్టలు మార్చి, మొఖం కాళ్ళు చేతులు కడిగి రా. ఆ తర్వాతే భోజనం అని, లేకపోతే ఏమీ లేదు అని. మన ఇంటికి, చుట్టాలు వచ్చిన కూడా, అదే పద్ధతి, చెంబు నీళ్ళు ఇచ్చి, అన్ని కడిగించేవారు.
మా తాత అయితే, అసలు కడగందే, లోనికి రానీయరు, పద్ధతి పద్ధతే. ఆరోజుల్లో బాత్రూమ్ దూరంగా ఉంటుంది కదా, శుచి శుభ్రం కోసం. దానికి వెళ్లినా కూడా, కాళ్ళు చేతులు కడిగి మాత్రమే లోనికి రావాలి.
మరి ఇప్పుడు, ఆ దరిద్రం అంతా, మన ప్రతి బెడ్రూమ్ లోనే మన పక్కనే పెట్టుకున్నాం, క్రిములకు నిలయము చేసి, హయిగా నిద్ర పోతున్నాము సువాసనలు పీలుస్తూ, నాగరికత పెరిగి.
మన ఇంట్లో అమ్మ కూడా చిన్నప్పుడు మడి లాగా ఉండి, కనీసం పూజ అయిన దాకా, రెండు గంటలు అందరికీ దూరం గా ఉంటారు. ఇక బ్రాహ్మలు ఇళ్ళు లో, మడి ఇంకా కఠినం, బయట వారు లోన వారు అనే తేడా లేదు, అందరూ దూరమే, 4 గంటలు అయినా ఇంకా ఎక్కువ అయినా.
ఒకవేళ మన ఇంట్లో కూడా, ఈ రోగం కూడా వస్తే, వారిని మందు లు వాడుతూ, విడి గదిలో పెట్టాలి, ఎక్కువ గదులు ఉంటే. గదులు లేకపోతే, మూలన కూర్చో పడుకో పెడతారు. ఒక మనిషి తప్ప, ఇంకెవరు కూడా, ఆ గదిలో కి వెళ్ళకుండా, వారిని తాకకుండా చూడాలి. ఆ వెళ్లిన ఒక మనిషి కూడా, కడుగుతూనే ఉండాలి ఎప్పుడూ. వార్తల్లో చూస్తేనేమో, ఇంటిల్లి పాదీ కలసి వస్తున్నారు, ఒకరికి రోగము ఉన్నా కూడా.
పాత రోజుల లో, మన ఇంట్లో ఆడపిల్ల, పుష్పావతి అంటే పెద్ద మనిషి అయితే, ఏ విధంగా విడి గది లో ఉంచి, రాచ మర్యాదలు చేస్తామో తాక కుండా, అలాగే ఇప్పుడు ఆ రోగికి చేయాలి.
ముదుసలి వాళ్ళ కు కూడా, ఒక విడి గది కేటాయింపు చేసి, ఇబ్బంది కలగకుండా విశ్రాంతిగా ఉంచి, అన్ని సమకూర్చే వారు.
ఇలా అన్ని రోగాలకు, విరుగుడు, మన వాళ్ళు ఎప్పుడో నేర్పారు. నాగరికత అంటూ, మైకంలో వ్యామోహం లో మనల్ని మనం, పాడు చేసుకుంటూ, పతనం వైపు పరుగులు తీస్తున్నాము.
కరోనా వైరస్ జాతి పాతదే, కానీ కోవిడ్ 19 కొత్తది. తర్వాత లేవిడ్ 20 కూడా రావచ్చు. అప్పుడు మరలా బాత్రూమ్ లు, స్నానాలు గదులు, బయట పెట్టమని చెపుతారేమో? చూద్దాం.
గుర్తు ఉందా, బాత్రూమ్ లో నుంచి, పాము వచ్చింది బయటకు అని కూడా, పేపర్లో వేశారు గతంలో.
మన పెద్దలు నేర్పన పద్దతిలో మనం బతికితే, మన జోలికి, ఏ రోగము రాదు. మంచి పద్ధతులు పిల్లల కు నేర్పిన, వారూ తర్వాత తరాలకు అందిస్తారు. జాగ్రత్తలు సుమా.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,837,019; 104 తత్వాలు (Tatvaalu) and views 221,566 Dt : 27-Mar-2020, Upd Dt : 27-Mar-2020, Category : General
Views : 822
( + More Social Media views ), Id : 448 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
carona ,
kovid 19 ,
taking care of the sick person Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments