APLatestNews.com top Banner
సూక్ష్మ కరొనా కోవిడ్ మనల్ని ఏమి అడిగింది? డబ్బు, తిండి, ఆస్తులు, పదవులు? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పొద్దున్నే ఒక వాట్సప్ మెసేజ్ లో ఇలా ఉంది, దేవుడా కరోనా ను చంపు ప్రపంచం ను రక్షంచు అని, శాంతి ని ఇవ్వు, మంచి ఆరోగ్యం ను ప్రసాదించు అని ఉంది.

అంటే దేవుడా అది నీ పని కాబట్టి నువ్వు చెయ్యి, మేము మాత్రం విచ్చలవిడిగా, క్రమశిక్షణ లేకుండా, బాధ్యత లేకుండా తిరుగుతాము, అని ప్రార్ధన చేద్దామా కోరుదామా?

మేము మాత్రం మారము, పురాణాలు లో చెప్పిన మంచి మార్గాలు ఆచరించము, క్రమశిక్షణ తో ఉండము. అంటే అర్ధం ఏందండీ? అన్ని ఆయనే చేయాలి? మన బాధ్యత, మార్పు మాత్రం ఏమీ లేదా?

నారాయణుడు, రాముడు గా అవతరిస్తే, రావణుడు శివుడు ని పెద్దగా ప్రార్ధన చేస్తే, రాముడు ని కట్టడి చేయమని కోరగా, చివరకు ఏమి జరిగింది?

మంచి వాడైన రామునికి, ఏమీ కాలేదు, ఎందుకంటే ధర్మం ఉంది తనతో. దుర్మార్గపు ఆలోచన కలిగిన, రావణుడు మాత్రమే పతనం అయ్యాడు. రావణుడు ఏమి చెయ్యాలి అసలు, రాముడు దండ యాత్ర కు వస్తున్నారు అని తెలిసి?

తన దుర్గుణాలను వదలి, సాత్వికంగా మారి, సన్మార్గంలో సీతమ్మని రాముని కి ఇచ్చి, లెంపలేసుకోవాలి. కానీ ఆ పని చేశారా? చేయలేదు, ఇంకా రాముని, హనుమంతుని, వానర సైన్యం ను దూషించారు.

సూక్ష్మ కరొనా కోవిడ్ 19 ఏమి చేసింది, మనల్ని ఏమి అడిగింది? డబ్బు, తిండి, ఆస్తులు, పదవులు అడిగిందా? అసలు నేరుగా మన ఇంటికి వచ్చిందా?

మన కన్నా నీతి నిజాయితీ పద్దతి గలది. ఒరే బడుద్దాయిలు, మంచి మాటలు పెద్దల మాట వినండి, విచ్చలవిడి లెక్క లేని తనాన్ని వీడండి. అందరి క్షేమం కోరండి అంది. అది తప్పా?

శుభ్రంగా శుచిగా పద్దతి గా, దైవ మార్గం లో ఉండే, వారి జోలికి రానంది. వీరు దోవ తప్పినా కూడా, తాట తీస్తా అంటుంది. క్రమశిక్షణ లేని వారి జోలికి, అలాగే జీవ హింస చేసే, వారి జోలికి మాత్రమే పోతానంటుంది.

అంటే చెడును మనం ఆపము ఆపలేము. ఆపే వారిని కూడా, ఆ పని చేయనీయమా? నేను మంచి చేయను, వాళ్ళు వినరు అంటాం కదా. మరి మంచి చేసే వాళ్ళ ను, వద్దు అని ఎలా అంటాం, అవ్వ. ఈ ఉదాహరణ లు చూడండి.

1. ఇంట్లో భర్త, సీసాల కు సీసాలు మజ్జిగ తాగి పడిపోతుంటే, జూదం ఆడుతుంటే, లేదా చిన్నిల్లుకు పోతుంటే ఇన్నాళ్లు ఆపలేని, భార్యలకు మహిళలు కు అండగా ఉంది ఈ సూక్ష్మ జీవి. తప్పా?

2. పిల్లలు యువకులు పెద్దలు ను సినిమా లు, పిచ్చి షికార్లు, క్లబ్బులు, గాలి తిరుగుళ్ళు, దుబారా ఖర్చు ఇన్నాళ్ళు ఆపలేని, తల్లి దండ్రులు కు అండగా ఉంది. తప్పా?

3. రోడ్డు, పొగ, సౌండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేసింది. దొంగ తనాలు దోపిడీ ఆపింది. పెట్రోలు వాడకం తగ్గించింది. యాక్సిడెంట్ లు తగ్గించింది. పోలీసులు పనులు అన్ని కలపి, కేవలం జనాన్ని ఆపే ఒక పనిగా మార్చి, శ్రమ తగ్గించింది. తప్పా?

4. ఇంట్లో నుంచి పనిచేసే అవకాశం ఇచ్చి, కుటుంబం తో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇచ్చింది. ఇంట్లో అందరూ కలసి, నవ్వుతూ మాట్లాడుతూ ఉండే, అవకాశం ఇచ్చింది, తప్పా?

5. కల్తీ నూనె తో వండిన, దుమ్ము ధూళి తో నిండిన, కల్తీ వస్తువులు తినకుండా ఆపింది. ఆసుపత్రి , ప్రయాణాలను ఖర్చు తగ్గించింది. తప్పా? బంధువులు, రాబందులు రావడాన్ని ఆపింది. దేశాల మధ్యలో దొంగ రవాణా స్మగ్లింగ్ ఆగింది. తప్పా?

6. దొంగ వ్యాపార సంస్థలు ను మూయించింది. కేవలం సంపాదన కోసం పెట్టిన ఆలయాలను మూపించింది.

7. ఎలక్షన్ వాయిదా వేయించి, ఓటు మరియు ప్రాణాలు విలువ తెలిపింది, డబ్బు కు విలువ లేదని, బాధ్యత గా మంచి వారికి ఓటు వేయమని తెలిపింది. ఈ కష్ట కాలంలో, ఎంతమంది మీ ఇంటి కి వచ్చి, లేదా ఫోన్లు లో , వాట్సప్ లో పలకరించారో తెలుసుకునేట్టు చేసింది.

ఇంకా ఎన్నో . . .

ఇవన్నీ మనం చేయగలమా? మన నాయకులు చేయగలరా? ఎన్నేళ్ళు పడుతుంది? దైవ దూత తో కూడా, చేయించ వద్దు అంటారా?

ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసింది, ఓ బుల్లి సూక్ష్మ జీవి, ఒక్క రెండు నెలల లో నే. రాజకీయ నాయకుల కు, సినిమా వారికి దండలు వేసి, గుడులు కట్టే, స్వార్థ పచ్చి అవకాశవాదులం మనం. మరి ఇన్ని మంచి పనులు చేసిన, దైవ దూత బుల్లి చిట్టి చిన్ని బుజ్జి కరోనా కోవిడ్ కి, ఎన్ని పూజలు పునస్కారాలు చేయాలి? భజనలు చేయాలి? గుడులు కట్టాలి?

మంచి మనసు తో ఆలోచన చేయండి. ఇప్పుడు అయినా, బాధ్యత ఎరిగి పెరిగి, చెడు ఆలోచన వదలి, మానవత్వం తో, మనిషి గా మారదాం. ఎందుకంటే భవిష్యత్తు లో, రాబోయే కొత్త ముప్పులకు, ఇది ట్రైనింగ్ లేదా ట్రైలర్ మాత్రమే సుమా.

తన పని అయినాక రాముడు, కృష్ణుడు వెళ్లి పోయారు. రాక్షసులు వాళ్ళ నూ తిట్టారు, ఎదిరించారు, పతనం అయ్యారు. అలాగే, మనల్ని క్రమశిక్షణ లో పెట్టి, బుల్లి చెల్లి వెళ్ళిపోతుంది ఎలాగూ.

మనం రాక్షసులం కాదు కదా, బుల్లి చెల్లి తిట్లు మాని, మనల్ని మనం తిట్టుకుని, రాక్షస ప్రవుర్తిని వీడుదాం, మనం సాత్వికంగా మారుదాం, మన పిల్లల్ని మార్చుదాం.

ఓం నమో నారాయణాయ. బుల్లి సూక్ష్మ కరోనా కోవిడ్ ధర్మ రక్షణార్ధం, భక్త జన సంరక్షణార్ధం, భగవంతుని చూపు ఎప్పుడూ మనవైపు ఉంటుంది.

పని అయిన తర్వాత అవతారం ముగుస్తుంది, ఎందుకంటే మరలా కొత్త అవతారం కోసం, తప్పదు కదా. గీత లో చెప్పారు, ధర్మ రక్షణ కోసం, మరలా మరలా వస్తూనే ఉంటాను అని.

ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వేజనా సుఖినోభవంతు.
 

Dt : 26-Mar-2020, Upd Dt : 26-Mar-2020 , Category : General
Views : 44 ( + More Social Media views ) ( id : 443 )
Tags : corona , kovid 19 , staying at home , yoga , reading purana

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content