చెత్త తీయడము చూసారు గ్రామములో, మిగతా సమస్యలు కూడా చర్చిద్దాము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,533; 104 తత్వాలు (Tatvaalu) and views 225,918.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గ్రామములో, పక్కన ఉన్న స్థలం లో చెత్త తీయడము గురించి ముందు ఆర్టికల్ లో చూసారు. గ్రామములో, మిగతా సమస్యలు కూడా ఇక్కడ చర్చిద్దాము.

అగంత వ్యక్తులు లేదా కొత్త వారు లేదా దొంగలు లేదా తీవ్ర వాదులు, ఖాళీ గా ఉన్న ఇళ్ళ దగ్గర పార్కు చేసి, దగ్గర లోని ఇళ్ళలో, దోపిడీలు దొంగతనాలు అరాచకాలు చేస్తారు. ఎవరినీ తెలియకుండా, పార్కింగ్ కు అనుమతించరాదు. ఇది పోలీసు వారు, మన సేఫ్టీ కోసం, జాగ్రత్తలు కు చెప్పేమాటలు.

1. తమ అపార్ట్మెంట్ కింద, దగ్గర, పక్కన పార్కింగ్ వదిలి, పంచాయతీ వారి పార్కింగ్ పర్మిషన్ లెక్క చేయకుండా, పోలీసు వారి విజ్ఞప్తి ని పట్టించుకోకుండా, ఎదురు ఇళ్ల దగ్గర ఇబ్బందులు కలిగిస్తూ, లేదా మా రోడ్డు వెంట పార్క్ చేసి రోడ్డు ను సగము మూస్తూ ఇతర వాహనాలు కు ఇబ్బందులు కలిగించడము - అలాంటి బాధ్యత లేని అపర్ట్మెంట్ వారు లేదా వారి స్నేహితులు/ బంధువుల పార్కింగ్ ను అరికట్టడం

2. రోడ్డు పక్కన, ఇంటి ముందు పంచాయతీ స్ధలం లో, పర్మిషన్ లేకుండా అక్రమముగా షాపు పెట్టి, కస్టమర్లు పక్క వారి స్థలములో లేదా పకా వారి రోడ్డు మీద పార్కు చేస్తూ, గంటల తరబడి షాపులో కూర్చుని బాతాఖానీ కొడతూ, నడుచుకుంటూ వెళ్ళే ఆడపడుచులు తల దించుకు నడుస్తూ ఉంటే, నడిచే వారికి అడ్డంగా నిలుచుంటూ, తిని చెత్త అటు ఇటు విసిరి వేస్తూ, అందరికీ ఇబ్బంది కల్గించడం అరికట్టాలి

3. కాపురాలు చేసే ఇళ్ళు మధ్యలో, కాలేజీ కుర్రవాళ్ళు ను గదికి ఇద్దరు పెట్టి, వారు లేదా వారిని చూడటానికి వచ్చే వారు, ఇంటి ముందు కొట్టుతో ఖాళీ ప్రదేశము లేక, పక్కన ఇళ్ళు ముందు పార్కు చేయడం ఇతరులను ఇబ్బంది పెడుతూ. కుర్రాళ్ళు, బయట నిలబడి లేదా సందులో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, రోడ్డు న నడిచే ఆడపడుచులు కు మరియు మాకు ఇబ్బంది.

అద్దెకు ఉన్న కాలేజీ పిల్లలు చెత్త వేయడానికి బయటకు పోలేక, బద్ధకముతో, పక్కన ఇళ్ళు లోకి విసరడం అరికట్టాలి. వారు ఉంటున్న సందులోకి, వేరే వాళ్ళు వచ్చి వేస్తారా? వేస్తే రెందు వైపులా వేయరా?

అద్దెకు ఎంతో మంది మారుతూ ఉంటారు కాలేజీ పిల్లలు, వారికి బాబాయి చెప్పరు, మనము అందరికి అరచి చెప్పలేము. కాలేజీ పిల్లలు చొక్కాలు విప్పి లేదా బాడీలతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే సందులో, పక్క వారికి ఇబ్బంది కాదా? కుటుంబము అయితే, కేవలము భార్యా భర్తలు తిరుగుతారు.

4. దగ్గరలో ఉన్న కళ్యాణ మండపంలో పెళ్ళి అంటే, అందరికి చెవులు చిల్లులు పడే మోతలు. అక్క ఫోన్ లో మాటలు కూడా వినపడవు. సౌండ్ పొల్యూషన్ సమస్యలు అందరికి.

కళ్యాణ మండపం కి ఇచ్చిన, పార్కింగ్ ఎక్కడ ఉందో, ఆ దేవుని కే తెలియాలి. పెళ్లి కి వచ్చిన కార్లు, అందరి ఇళ్ళు ముందూ, వరుసగా అడ్డముగా 5 పెడితే, చుట్టూ ఉన్న ఇళ్ళు వాళ్ళ కు ఇబ్బందులు కాదా? వచ్చిన కార్ల వారు లో, ఎవరు దొరలో దొంగలో ఎవరికీ తెలీదు కదా? ఏ రాత్రి పూట కారు, అక్కడ పెడతారో తీస్తారో తెలీదు కదా? ఆడపడుచులు కు, చుట్టూ ఇళ్లు ప్రజలకు రక్షణ ఎక్కడ? ఏదైనా దొంగతనమో లేదా ఇంకోటో ఘోరము జరిగిన తర్వాత, ఎవరు బాధ్యత వహిస్తారు?

5. జనం ఉండే ఇళ్ళు వరుసలో, సొంత స్ధలం లో, రెండు అంతస్థుల వేపచెట్టు కు, పంచాయతీ పర్మిషన్ ఉంటుందా? ఉంటే గాలి వానకు, చెట్టు పడితే, పక్కన ఇళ్ళు గోడలు పడితే, నష్టం కలిగితే, ఎవరు తిరిగి కట్టి ఇస్తారు?

ఆ చెట్టు ఆకులు రాలి రోజూ, పక్కన ఇళ్ళు మీద మరియు మెట్లు మీద పడుతూ ఉంటే, మా అక్క లేదా ఇంకొకరు నడిచేటప్పుడు లేక మెట్లు ఎక్కేటప్పుడు, ఆకుల మీద కాలు జారితే మామూలు లేదా వర్షాలు అప్పుడు లేదా ఆకులు చిమ్మేటప్పుడు పడితే, ఎవరు ఆమె లేదా ఇంకో మనిషి కి నష్ట పరిహారం ఇస్తారు? చెట్టు ఇంటి ఓనరా లేక పంచాయతీ నా?

రోజూ ఎన్నో ఆకులు గాలికి రాలుతూ చిరాకు కలిగిస్తుంటే, అది చెట్టు ఇంటి ఓనరు చిమ్మాలా? లేక పంచాయతీ వారు చిమ్మాలా? పక్కన ఇళ్ళు వారు, వాళ్ళ ఖర్మ అనుకుని చిమ్ముకోవాలా? అలా చిమ్ముతూ లేదా నడుస్తూ ఆకుల మీద జారి, బండమీద పడితే, చెట్టు ఇంటి ఓనరుదా బాధ్యత లేక పంచాయతీ దా?

వీటన్నింటినీ చిన్నగా, వాళ్ళ ఓనరుల తో, మాట్లాడి సామరస్యంగా, మిత్రులు గా పరిష్కరించుకుందాము. మీకు వారు తెలిస్తే మీరు మాట్లాడండి లేదా మాతో వాట్సాప్ లో మాట్లాడమనండి.

వినకపోతే పంచాయతీ, పోలీసు వారి దగ్గరకు సాక్ష్యం తో సహా, ఫోటోలు తో వెళదాము. పత్రిక సోదరులు, అధికారులు, పోలీసులు ఎటూ మంచి వారికి, మంచి పనులు కు సహాయం చేయడానికి, ముందు ఉంటారు.

2, 3, 5 సమస్యలు మన బాబాయి వే. ఎన్ని సార్లు, మొత్తుకున్నా వాళ్ళు పట్టించుకోరు.

రెండు ఏళ్ల క్రితం, మామయ్య చే ఇబ్బంది పడిన, పంతులు గారికీ అక్క గారికి, చెట్టు కొట్టిన వ్యక్తి కి, మామయ్య తరపున మేము క్షమాపణ చెపుతున్నాము.

ఇంక ఆ పొరపాటు జరుగదు, ఇక మామయ్య అంతా చూసుకుంటారు, మా మీద దయతో, మామయ్య గారికి ధన్యవాదాలు.

పెద్ద మనసు తో, మామయ్య లేదా ఎవరైనా మంచి వారు, బాబాయి తో మాట్లాడి, పార్కింగ్ సమస్య ను, సందులో కుర్రాళ్లు చెత్త సమస్య ను, చెట్టు ఆకుల సమస్య ను పరిష్కరిస్తే, మరలా మనము ఇంకో అర్జీ తో పంచాయతీ లేదా పోలీసు శాఖకు పోవాల్సిన పని లేదు. ఫోటోలు తో సహా గత 3 ఏళ్ల సాక్ష్యం ఉన్నది.

మనందరం బంధువులము, మీ కన్నా చిన్నవాడిని , మీ మాట వినే వాడిని. పెద్దలు ఎవరు పరిష్కారం చెప్పినా సర్దుబాటు చేసుకుందాం మిత్రులు గా, చుట్టాలు గా.

మన కొబ్బరి చెట్టు తో ఎవరకన్నా సమస్యలు ఉంటే , వారు మనతో ఒక మాట వీలైతే చెప్పి, కొమ్మలు గానీ, చెట్టు గానీ కొట్టించుకోవచ్చు. అది ప్రభుత్వ స్ధలం.

చూడండి చిత్రములలో వేపచెట్టు ఆకులు, కాలేజీ పిల్లలు చెత్త. ఇంతకు ముందు ఎన్నోసార్లు మీరు చూసారు. పధకాలు పేర్లు మీకు తెలుసు.

అద్దె మాకు చెత్త మీకు - చెట్టు నీడ మాకు చెత్త పీడ మీకు

మా ఇంట్లో ఉండు, వాళ్ళ ఇంట్లో పెట్టు (బండ్లు). అలాగే మా కొట్లో కొను, వాళ్ళ స్థలంలో వేయి (చెత్త).

ఏదన్నా అడిగితే, మరలా అందరితో తగవులు. పోనీ అడక్కపోతే, ఏళ్లుగా ఇవే పాట్లు.

ఇప్పుడు చెప్పండి, షాపు తో, కాలేజీ పిల్లలు తో, ఎన్ని రోజులు సమస్యలు భరించమంటారు?  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,533; 104 తత్వాలు (Tatvaalu) and views 225,918
Dt : 21-Mar-2020, Upd Dt : 21-Mar-2020, Category : General
Views : 1036 ( + More Social Media views ), Id : 431 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gram panchayat officers , cleaning the trash , virus , other issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content