Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మా చిన్న బాబాయి ఎలా ఉన్నారు, ఆరోగ్యం గా ఉన్నారా? గతంలో ఏదో ఆశ్రమంలో వారితోనే ఉండి లేదా ఇల్లు కొనో, శేష జీవితం అక్కడే గడుపుతా అన్నారు. మరి ఆశ్రమం తిరుపతి లో నా లేక ఇంక ఎక్కడో తెలీదు. 5 ఏళ్ల కు పైగా, ఏ విషయం సమాచారం లేదు. మీకు కనపడితే, అడిగినట్టు గా చెప్పగలరు. నాతో పలకకపోయినా పర్లేదు, ఆరోగ్యం గా ఆనందంగా ఉంటే చాలు.
5 ఏళ్ల క్రితం కూడా బాబాయి కి, మీ ఆస్తి మొత్తం ఎవరికైనా ఇచ్చుకోండి ఇబ్బంది లేదు, మాకు అవసరం లేదు, కానీ మీరు మాత్రం కృష్ణుడు లాగా, మాతోనే ఉండు చాలు అన్నాను. మా ఇల్లు ఖాళీ గా ఉంది కదా పైన, మేం వచ్చే ది నెల రోజుల కు సంవత్సరం కు, అని కూడా చెప్పాను.
ఒకవేళ మాతో పైన ఉండాలి అంటే, మోహమాటం లేదా పూజా పునస్కారాలకు ఇబ్బంది అనుకుంటే, కింద ఒక పోర్షన్ లో ఉండు, ఎవరూ కదిలించరు, ఇబ్బంది లేదు అని కూడా చెప్పాను. కానీ బాబాయి అనాడు వినలేదు, తర్వాత మాటలు లేవు.
ఎక్కడ ఉన్నా, అంటే తన సొంత ఇంట్లో లేదా ఆశ్రమంలో హాయిగా ఉన్నా, చాలు కదా తను సంతోషం గా. ఇంకో బాబాయి వాళ్ళు ఎటూ, బంగారం గా చూసుకుంటారు.
ఈ బాబాయి ధనం కూడా ఆరోజున, మనం ఇచ్చిన దగ్గరే ఉంది, వడ్డీ కి ఇరుక్కుని. పాపం, వెనక్కి ఇచ్చారో లేదో, మనలాగే ముప్ప తిప్పలు పెడుతున్నారో తెలీదు.
బాబాయి క్షేమం గురించి గతంలో కూడా, పిన్ని ని లేదా అందరినీ అడుగుతూ నే ఉంటాను. వారు బాబాయి తో చెబుతున్నారో లేదో తెలీదు. వాట్సాప్ లో కూడా గతంలో చెప్పాను, మనకు చేసిన మేలు మనం మరువకూడదు అని. అలాగే బాబాయి కూడా, మనము చేసింది మరువకూడదు.
తాత నాయనమ్మ పల్లెటూరు నుంచి, అన్ని అమ్మి, ఇంకో బాబాయి ఇంటి దగ్గర, కొత్త ఇల్లు కట్టుబడి చేసి, ఆ తర్వాత అక్కడ ఉండలేక వారిని భరించలేక, అది అమ్ముకొని, తర్వాత నేరుగా మన ఇంట్లో ఉండి, అ తర్వాత మా చిన్న ఇళ్ళు లో, విడిగా ఉండాలి అంటే, అక్కడ ఉంచుకున్నాము, మేము పక్కన ఇంట్లో ఉన్నాము.
బాబాయి కూడా, ఉద్యోగ ఊరు లో ఎప్పుడు ఇంటికి వస్తానో తెలీదు రాత్రి కి, మీ దగ్గర మీ పక్కన అయితే క్షేమంగా ఉంటారు, నెలకు రెండు సార్లు వచ్చి చూసుకుంటాను, పక్కన మన వాళ్ళు ఉంటే ధైర్యం నాకు, అని చెపితే మన దగ్గరే ఉన్నారు. వాళ్ళ చివరి రోజులు, ఎత్తు బడి కూడా మన ఇంట్లో నే జరిగింది. ఆ అదృష్టం మాకే కలిగింది. తాత కు నాన్న తలకొరివి పెడితే, నానమ్మ కు చిన్న బాబాయి పెట్టారు.
కాబట్టి, తాత నాయనమ్మ లను చివరలో, చిన్న బాబాయి నమ్మి ఉంచింది, మమ్మల్ని మాత్రమే. చివర సంవత్సరాలు లో మనం అద్దె కూడా తీసుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు కదా.
కాలం ఎంత విచిత్రమైనదో చూడండి. ఏ 2వ బాబాయి ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుని, ఉండలేక, వారిని భరించలేక, ఇల్లు అమ్ముకుని, మా ఇంట్లో వచ్చి తాతా నాయనమ్మ ఉంటే, చిన్న బాబాయి కూడా మమ్మల్ని నమ్మి మా దగ్గర పెడితే, ఈ రోజున అంటే తాత నానమ్మ తదనంతరం, చిన్న బాబాయి, అదే 2వ బాబాయి తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, పైనుంచి, తాత నాయనమ్మ చూసి సంతోషిస్తారు కదా. ఇదే కదా మంచితనం, ఆదర్శం అంటే.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,689; 104 తత్వాలు (Tatvaalu) and views 221,617 Dt : 15-Mar-2020, Upd Dt : 15-Mar-2020, Category : General
Views : 947
( + More Social Media views ), Id : 411 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
babai ,
uncle ,
grand maa paa Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments