40 ఏళ్ళ ఎన్టీఆర్ తెదేపా ఆత్మాభిమానం పౌరుషము ను, పతనం చేస్తున్న 27 ఏళ్ళ చంద్రన్నకు 24 విన్నప ఆలోచనలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,600; 104 తత్వాలు (Tatvaalu) and views 226,012.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
- పచ్చ మీడియా తో ఎంత లాభమో, అంత నష్టం
- జగనన్న ఒక మాట
- తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు జైలుకు
- ధీటైన కరోనా ఆసుపత్రి
- రామన్నకు బహిరంగ క్షమాపణ
- 2 వ గట్టి నాయకుడు
- అలిపిరి సంఘటన
- ఎమ్మెల్సీ నాన్నారు
- రమేష్ చౌదరి వెంకటేష్
- 3 పంటల మాగాణీని నాశనం
- జగనన్న లేక పవనన్న ఓడడం
- 20 స్టే లు
- జునియర్ ఎంటీయార్
3 min read time.

40 ఏళ్ళు గా ఎన్టీఆర్ తెలుగుదేశం ను అభిమానిస్తున్న, కష్టపడి పార్టీ కోసం పని చేస్తున్న, రాష్ట్ర, దేశ మరియు విదేశాల తెలుగు తమ్ముళ్ళకు అభినందనలు మరియు శుభాకాంక్షలు.

నమ్మకమైన సుదీర్గ అనుచరులు అనుచరులు దేవినేని, అచ్చెన్న, యనమల, అయ్యన్న, కేశినేని, నిమ్మల, జేసీ వంటి స్థిర నాయకులుకు అభినందనలు.

మా ప్రకాశం/ గుంటూర్ జిల్లాలలో, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు, అలాగే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, అలాగే రేపల్లె అనగాని లాంటి మా స్థానిక నాయకులు కు అభినందనలు. ఇంకా కొంత మంది పేర్లు గుర్తు కు రాలేదు, మన్నించాలి.

అలాగే బుడి బుడి నడకలతో పలుకులతో, 2019 నుంచి సీరియస్ గా రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న లోకేష్ కు, నేర్పుతున్న చంద్రన్న కు అభినందనలు.

బలమైన కార్యకర్తల వ్యవస్థను, గ్రామాలలో స్థిరము చేసి వెళ్ళారు, మన అన్న స్వర్గీయ రామన్న. ఢిల్లీ నే గడగడ లాడించి, తక్కువ సమయములో, అధికారం తెచ్చుకున్నది, ప్రపంచానికి తెలుగు వారిని, ఆత్మాభిమానం ను పరిచయం చేసింది, మన ఆరాధ్యదైవం నందమూరి రాముడే.

సినిమాలలో రామన్న మోహనస్వరూపం ని పొగడాలి అంటే, నిండు చందమామను మనము ఎన్ని విధాలుగా పొగిడినా, ఇంకా తక్కువగానే ఉంటుంది. కరణం మునుసుబు వ్యవస్థలను రద్దు చేసింది, మహిళా ఆస్తి హక్కు ఇచ్చింది, ఆయనే. ఇలాంటివి ఎన్నో పేజీలకు పేజీలు రాయాలి, మన పెద్దాయన గురించి.

మనము 1995 నుంచి అంటే చంద్రన్న హస్తగతం చేసుకున్న దగ్గరనుంచి, వాస్తవాలు మాట్లాడుకుందాం, అంటే 27 ఏళ్ళ చంద్రన్న తెలుగు దేశం.

చాలామందికి జాతీయ ఉద్యమ కాంగ్రెస్స్ కి, ఇందిరమ్మ కాంగ్రెస్స్ కి తేడా తెలీదు. 2 ఒకటే అనుకుంటారు అమాయకముగా. అలాగే రామన్న తెదేపా లక్ష్యం వేరు, అది ఇప్పుడు లేదు, చంద్రన్న తెదేపా లక్ష్యం వేరు, ఇది మాత్రమే ఇప్పుడు ఉంది.

కన్నతల్లి ని అయినా మనము, సమయానికి తను అన్నము తినకపోతే, మందులు వేసుకోకపోతే, ఏ మంచి బిడ్డ కూడా, ఊరుకోడు, ఎందుకంటే అవి సరిగ్గ లేకపోతే, అమ్మ మనకు తర్వాత ఉండదు. కఠినముగా అయినా, మనము చెప్పి మార్చుకోవాలి. అంతే గానీ కన్నతల్లి అంటే గౌరవము అని, గమ్ము గా ఉండకూడదు.

అలాగే కన్నతల్లి లాంటి మన పార్టీని కూడా, మనమే బాగు చేసుకోవాలి, నిజాలు చెప్పి, కళ్ళు తెరిపించి. ఇది హేళనకు కాదు, మనసు సమ్మేళనకు మాత్రమే తమ్ముళ్ళు.

బలమైన ప్రతిపక్ష లో ఉన్నప్పుడు మనకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే, మరలా అధికారములోకి రావాలి అని, కానీ మన చంద్రన్న బాధ్యత గా ఉన్నారా? ఇప్పుడు చూద్దాము, మా రాతలో తప్పు ఉంటే, ఆ పాయింట్ ని సరిచేద్దాము చెప్పగలరు. మాకు జవాబులు పంపండి లేదా చంద్రన్న తో మాట్లాడండి, పార్టీ క్షేమం కోసం.

1. పచ్చ మీడియా తో ఎంత లాభమో, అంత నష్టం కూడా, అతి గా పొగిడి, మనల్ని మోహములో ఉంచి, వారి రాబడి పెంచుకుని, మనల్ని 23 సీట్లకు తెచ్చాయి. వాటికి సంపాదకీయం, వారి లోన బుద్ది బయటపడకుండా, రాయడం కూడా రాదు. అంత బరితెగించి, సమర్ధించి, నట్టేట ముంచాయి. ఇప్పుడు అయినా అంగీకరిస్తారా? గతము లో కూడా చెప్పాము వినలేదు మారలేదు - link

2. జగనన్న ఒక మాట అన్నారు, చంద్రన్న తో పెద్ద విషయము కాదు, మనము ఎదుర్కోవాల్సింది పచ్చ మీడియాను మాత్రమే అని. మీకు ఆ మాటకు అర్ధము తెలుసా? మన వ్యతిరేకుల మాటలు కూడా మనము వినాలి, సరి చేసుకోవాలి, 2 వైపులా వింటేనే మనకు బుద్ది ఎదుగుతుంది. కుట్రలు కుతంత్రాలు ఎల్లకాలము నిలవవు. అది తెలివి కాదు, చావు తెలివి. మీరు తగ్గిపోయి, పచ్చ మీడియాను పెంచి, మీరు ఎదిగారా, తరిగారా?

3. మన పార్టీ ని నమ్మి ఉన్న, తెలుగు తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కున్నారు, జైలుకు కూడా పోయి వచ్చారు ఈ 2 ఏళ్ళుగా, మరి వీరి సేవలు నమ్మకత్వం గుర్తు ఉంటాయా, తర్వాత రోజులలో? వాడుకోని వదిలేసారు అన్న మన నైజం మరలా బయటకు వస్తుందా? ముందు ఉండాల్సిన నాయకుడు, హైదరాబాద్ లో చాటున ఉండటం ధర్మమా?

4. మన 27 ఏళ్ళ పాలనలో, ఆంధ్రా ప్రాంతములో ఒక్క ధీటైన కరోనా ఆసుపత్రి లేక, ఎమ్మెల్యేలు ఎంపీలు, హైదరాబాద్ వెళుతుంటే, మనకు సిగ్గుగా లేదా, మన అభివ్రుద్ది గురించి? అది మన లోపము కాదా?

5. రామన్నకు మనము చేసిన ద్రోహం గురించి, ఇప్పుడు అయినా పశ్చాత్తాపముతో బహిరంగ క్షమాపణ చెప్పి, మన పాపము కొంత కడుక్కుని, ఫలితము తగ్గిద్దామా?

కధ మొత్తము వద్దు, తెలిసో తెలీకో మా మామ గారు అలాగే మీ అన్నగారైన రామన్నకు మనసు కష్టం కలిగించాను, ఈ రోజు నా హోదా పరపతి ఆయన భిక్షనే, నన్ను మనస్పూర్తిగా క్షమించండి, రామన్న శ్రేయోభిలాషులు అంటే చాలు.

ఈ పాపము, మిమ్మల్ని మీ తర్వాత వారిని మిమ్మల్ని సమర్ధించిన వారిని వదలదు. ఒక ఉదాహరణ మోహన్ బాబు ని చూస్తున్నాము. ఇప్పుడు మీ 23 సీట్లు కూడా.

6. మన సొంత నాయకులనే మనము కుతంత్రముతో బలహీనులను చేస్తే ఎలా? మనకు విజయసాయి, వైవీ, సజ్జల లాంటి గట్టి నాయకులు ఏరి, 2 వ స్థానములో? విజయసాయి ట్విట్టర్ తో పోటీ పడే, మన 2 వ నాయకుడు ఏరి?

ఎవరిని మనము నమ్ముతాము? వారు గట్టిగా ఉంటే, మనల్ని వెన్నుపోటు పొడుస్తారు, అని భయం ఎందుకు? ఉదాహరణకు, కేశినేని తో ఆరు బయట రచ్చ అవసరమా?

7. అలిపిరి సంఘటన తర్వాత చెప్పారు, ఇక నా ప్రాణాలు రాష్ట్ర ప్రజల కోసమే అంకితం అని, మరి ఎందుకు, హైదరాబాద్ లో ఉంటారు? నాయకుడు ముందు ఉండాలి, తమ్ముళ్ళు జైలుకు పోతుంటే ఇక్కడ, మీరు అక్కడ ఉండటం న్యాయమేనా?

8. మనకు నాయకత్వ లక్షణాలు ఉంటే, సొంత కొడుకు జీవితాన్ని ఎవరైనా, తప్పుడు దోవలో మోహము లో నడుపుతారా? ఎమ్మెల్సీ ఇవ్వు నాన్నారు అన్నా కూడా, తప్పు రా బిడ్డా, ముందు కష్టపడి ఎలెక్షన్ లో తిరిగి, అరచి, గెలిచి, ఎమ్మెల్యేవి కా, మన అనుకూల నియోజకవర్గం లో, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తాను అని ఎందుకు అనలేదు, ఎందుకు అలా చేయలేదు? మనము వంకరగా వచ్చాము అని, అదే పద్దతి పిల్లలకు నేర్పవచ్చునా?

9. మనకు నాయకత్వ లక్షణాలు ఉంటే, మనల్ని నీచముగా తిట్టే మంచి వక్త అయిన, కొడాలి నాని వల్లభనేని వంశి ని, తయారు చేసి ప్రోత్సహం చేసింది మనమే గదా? పాలు పోసి పామును పెంచితే ఏమి అవుతుందో ముందు రామన్నకు, ఇప్పుడు మీకు తెలిసిందా? ఇది కూడా, రామన్న శాపమే. కాని నాని మాట్లాడే పద్దతి తప్పు కావొచ్చు గానీ, నిజాలే మాట్లాడుతున్నారు అని అందరి నమ్మకం.

10. మనకు నాయకత్వ లక్షణాలు, ఆత్మాభిమానము ఉంటే, మన పార్టీ తో పెళ్ళి జరిగిన రమేష్ చౌదరి వెంకటేష్ కరణము లను, వేరే పార్టీకి కాపురానికి ఎందుకు పంపాము? మన నాయకత్వములో ఎదిగిన వాళ్ళు, నీతి నిజాయితీ సంస్కారము లేకుండా, మేము చెయ్యము అలా అనకుండా, సిగ్గు విడిచి ఎలా తలవంచుకుని వెళ్ళారు?

నారాయణ, గంటా ఏరి, ఇదేనా మీ నాయకత్వ తెలివి? ప్రవేట్ విద్యను ప్రోత్సహించి, వారిని మేపి, ప్రభుత్వ విధ్యను పాతర వేయలేదా?

మనము ప్రకాశం జిల్లాలో మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి, మంత్రి బాలినేని తో ఎలా కలసి పార్టీలో చేరారు?

ఇలాంటి పార్టీ ద్రోహులను మనము పోషించి ఇప్పుడు, ఏమీ అనకుండా తొలగించమని అనకుండా, మనము ఎందుకు నోరు మూసుకుని ఉన్నాము? రామన్న పౌరషం ఆత్మాభిమానం, మనలో చచ్చిందా?

మనము కాపు మహిళ ఎమ్మెల్సీ సునీతను మాత్రమే ఎందుకు బలవంతము గా రాజీనామా చేయించాము? మన వర్గం అని కరణం ను ఎందుకు రాజీనామా అడగలేదు?

11. మనకు నాయకత్వ లక్షణాలు ఉండి వినడము వస్తే, ప్రతిపక్షము లో ఉన్నప్పుడే పచ్చ మీడియా కాని వారి ఫోన్ ఆపుకుంటే, ఇంక మీరు నిజాలు వినేది ఎప్పుడు? అధికారములో ఉన్నవారు 3 ఏళ్ళు గా వింటుంటే, మీకు 3 నెలల ఒపికలేదా? ఇదేనా, ఎదిగే పద్దతి?

12. హైటెక్ సిటీ తో హైటెక్ సీయెం గా పేరు పొందినా, ప్రజల గుండెల్లో స్థానం, కష్టం గా ఉంది. ఎందుకో ఎప్పుడు అయినా ఆలోచన చేసారా?

13. అమరావతి కోసం, 3 పంటల మాగాణీని నాశనం చేసి, కాంక్రీట్ గా మార్చడానికి, మీకు మనసు ఎలా ఒప్పింది? మన తర్వాత తరాలకు బువ్వ లేకుండా చేస్తారా? జనానికి డబ్బు ఆశ చూపి ఇలా చేయవచ్చునా? పొలాలు వదిలి మిగతా స్థలం లో కట్టలేమా? ఇలాంటి 3 పంటల మాగాణిని, ఇంకోచోట మీరు ప్రతిస్రుష్టి చేస్తారా, సాధ్యమేనా?

14. మన 2వ బిడ్డ గా చంద్రన్న, 10 ఏళ్ళు అధికారము లో ఉండి, మీరు మీ గణాలు తిన్నది తిన్నారు కదా. ఇప్పుడు మన 3 వ బిడ్డ జగనన్న, మొదటి సారి సీయెం అయ్యి, 3 ఏళ్ళు కూడా కాకపోతే, ఎందుకు తనని చూసి కుళ్ళు కుంటారు? ప్రతి దానికి అడ్డు పడుతారు? మీరు బాగు/ నాశనం చేసిన విధముగా, వారినీ కొంత కాలం బాగు/ నాశనం చెయ్యనివ్వండి.

15. జగనన్న లోపా లతో ఓడిపోతే, మనము గెలిస్తే, అది మన గొప్ప ఎలా అవుతుంది? మనము ప్రజలకు చేసిన సేవ ఏమిటి 3 ఏళ్ళు గా? కరోనా సమయములో, ఎందుకు మనం విజయవాడ లో ఉండి, ఈ ఆంధ్రా ఆసుపత్రులకు వెళ్ళండి, మా 27 ఏళ్ళ ప్రజా సంక్షేమ అభివ్రుద్దిని అవమానించకండి, అని ధైర్యముగా ఎందుకు చెప్పలేదు.

16. ప్రతి నియోజక వర్గములో, కరోనా సమయములో, వైకాపా పాలనలో జనం పడ్డ కష్టాలు, మన స్థానిక తెదేపా నాయకులు, సోషల్ మీడియాలో, రోజూ పర్యటించి ఆదుకుంటూ వైఫల్యాలను ఎండగడుతూ పెట్టిన, రోజు వారి, ఫొటోలు వీడియోలు ఉన్నాయా? ఉంటే తెలుగు తమ్ముళ్ళు, కరోనా సమయములో కనడలేదు అన్న దానికి జవాబు?

17. ఉదాహరణకు చీరాల లో, మనం వైకాపాతో చేరిన కరణం పాలన బాగుంది అని ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోకపోతే, మన సోషల్ మీడియాలో, ఆయన పై ఆరోపణలు ఏవి? మరి మనం ఆయన బాగా సేవ చేస్తున్నారు అని ఒప్పుకుంటే, మరి జగనన్న బాగా పాలన చేస్తున్నట్లేకదా? 2 నాల్కలు ఎందుకు? మన గోడ దూకిన ఎమ్మెల్యే అనా?

18. చీరాలలో 30 వార్డులకు మెంబర్లు ఎందుకు దొరకలేదు? ఎందుకు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను భూస్థాపితం చేసి, కరణం బలగాన్ని గెలిపించారు? ఆ తర్వాత కూడా, ఎందుకు చీరాల తెదేపా అధ్యక్షుడిని మార్చలేదు? అంటే, మనము కరణము ను కోవర్ట్ గా పంపామా?

మన వర్గం వ్యక్తి కోసం, రామన్న పార్టీకి ద్రోహం చేస్తామా? ఇలా ఎన్ని అస్సెంబ్లీ స్థానాలలో ద్రోహం చేసారు?

19. గతము లో మా 4 వ బిడ్డ పవన్ కల్యాణ్ మనకు, సపోర్ట్ చేసి, మనకు అధికారం అప్పగించారు, ఏ పదవి పంచుకోలేదు. మరి ఇప్పుడు మనము క్రుతజ్ఞతలుతో, బదులు తీర్చుకోవడానికి, పదవి లేకుండా, జగనన్న వ్యతిరేక ఓట్లు చీలకుండా, పవన్ నాయకత్వానికి, సపోర్ట్ చేస్తామా? లేక వాడుకోవడము వెన్నుపోటే గాని, క్రుతజ్ఞతలు ఉండవు అందామా? మీకు జగనన్న ఓడిపోవడం కావాలా లేక పవనన్న ఓడిపోవడం ముఖ్యమా? మరలా జగనన్న గెలిస్తే, తెదేపా ఉండదు అంటున్నారు.

పవన్ సీఎం అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో మేము పోటీ. ఆయనను సీఎం అభ్యర్థిగా ఒప్పుకొని, వచ్చే వాళ్ళతో పొత్తులు వుంటాయి అన్నారు 1 వ అబ్బాయి సోమన్న.

20. జగనన్న కు 20 కేసులు ఉన్నాయి అనుకుంటే, మనకు 20 స్టే లు ఉన్నాయి. ఎందుకని, ఒక్క కేసులో అయినా, మనము క్లీన్ చిట్ తెచ్చుకోము? పలుకుబడిని స్టే ల కే ఉపయోగిస్తే, మనము ఇంకా 20 కేసులు లో సగం నీతి మంతులమేగదా?

21. 2022 లో కూడా, లోకేష్ ఎదగక పోతే, రామన్న పార్టీని నాశనం చెస్తున్నామా లేక జునియర్ ఎంటీయార్ తో అన్నా, పార్టీని బతికిద్దామా?

22. రాష్ట్రము లో న్యాయబద్దము గా సొంత గా పెట్టిన స్థానిక పార్టీలు 2 మాత్రమే ఉంది, ఒకటి వైకాపా రెండు జనసేన అంటే, మనము ఒప్పుకుంటామా?

23. రామన్న 2 రూపాయల బియ్యం, సారా నిషేధం చేస్తే, మనము వాటిని తీసేసాము. మనది రామన్న తెదేపా కాదు కదా? రామన్న కు భారత రత్న తెచ్చే ప్రయత్నం నాడు చేయలేదు కదా?

24. ప్రజా పన్నులతో నడిచే పధకాలకు, మన కుటుంబ పేర్లు పెట్టుకునే స్థితికి ఎందుగు దిగజారి పొయాము? ఆ పేర్లు మనకు 23 సీట్లు రాకుండా కాపాడాయా?

ఇంకా గుర్తుకు వస్తే ఇక్కడ కలుపుతాము, కొన్ని అయినా, చదివి మారి, మంచి భవిష్యత్ ఏర్పరచుకోవాలని మనవి. నేరుగా చెప్పే అవకాశం లేదు కాబట్టి, అందరి ద్వారా మీకు పంపుతున్నాము, అర్ధము చేసుకోగలరు, కోపము వద్దు. మన కోపమే మన శత్రువు.

కౌరవులు కూడా, విదురుని ఏమీ అనలేదు, ఉద్యోగం సంపాదన తీయలేదు. మనము వారి కన్నా, ఉన్నతము గా ఉండాలి. రామన్న శాపాలు మన నీడలా ఉన్నాయి, కొత్త పాపాలు వద్దు, మన ఆస్తులు అధికారాలు పంచుకున్న వారసులు అనుచరులు కూడా ఎదుర్కోవాలి ఫలితాలను.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,600; 104 తత్వాలు (Tatvaalu) and views 226,012
Dt : 30-Mar-2022, Upd Dt : 30-Mar-2022, Category : Politics
Views : 558 ( + More Social Media views ), Id : 1322 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : real facts. laziness , responsibility , save tdp , chandranna , janasena , pavan , jagan , take over
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content