APLatestNews.com top Banner
పంచ భూతాల నుంచి, సుఖ దుఃఖము లు. నిద్ర లో, లేవు. మరి ఉన్నాయా? ఎక్కడ? - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పంచ భూతాల నుంచి, సుఖ(ఆనందము) దుఃఖము(కష్టము) లు మనకు వస్తున్నాయి లేదా తెలుస్తున్నాయి కదా. మరి నిద్ర లో, అవి లేవు కదా? మరి నిజముగా అవి ఉన్నాయా? ఉంటే, అవి ఎక్కడ ఉన్నాయి? మనకు బయట నా, మనకు లోపల నా?

భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని లను పంచభూతాలు అని అంటారు. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి), సకల సృష్టి ఇమిడి ఉంది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించింది.

ఉదహరణతో మొదలు పెడదాము,

1. ఒకనికి పాయసము అంటే, ఇష్టము ఆనందము అనుకుందాము. పాయసములో ఆనందము ఉంది అనుకుందాము. 10 గ్లాసులు వరుసగా తాగాడు అనుకోండి, ఏమి అవుతుంది? వెగటు పుడుతుంది, ఇంక వద్దు బాబో అంటాడు, పరుగెత్తుతాడు. అదేమిటి, అంటే పాయసము లో ఆనందము లేదు. ముందు ఉంది అనుకున్నాడు, తనే తర్వాత లేదు అని అంటున్నాడు, జ్ఞానోదయం తర్వాత.

మందు తాగే అతను దానిలో సంతోషము ఉంది అనుకుంటాడు, ఆస్తులు అమ్మి రోడ్ న పడ్డాక లేదా మంచాన పడ్డాక, దానిలో సంతోషము లేదు అంటాడు తనే.

ఈ రెండూ తాగని వాళ్ళు ముందే, జ్ఞానం తో, అందులో సంతోషము లేదు అంటారు. బీపీ షుగర్ వస్తాయని వారికి వీరికి ముందే తెలుసు.

2. పెళ్ళి చేసుకునే వారిని అడగండి, పెళ్ళి లో సుఖము ఉంది అంటారు. పెళ్ళి కాలేదు అని ఏడుస్తారు. పెళ్ళి అయినాక సంవత్సరం తర్వాత చాటుగా అడగండి, ఎరక్కపోయి ఇరుక్కున్నాను అంటారు. ఏమి లేదు, మీరు ఇదే మాయలో పడొద్దు అంటారు. కొత్త వారు ఊరుకుంటారా, మేమూ అదే మాయను చూస్తాను అంటారు.

పై రెండిటిలో సంతోషము ఉంటే, అందరికీ అన్ని వేళలా ఉండాలి కదా? అంటే, పెళ్ళి లో, మందులో, పాయసములో, లేదా ఇంకో భౌతిక వస్తువులో ఆనందము, సంతోషము, సుఖము లేదు అనే గదా అన్ని వేళలా?

ఏంటండీ ఈ విచిత్రము, మరి ఎక్కడ ఉంది, అనుకునే వాని మనస్సులో మాత్రమే ఉంది, నిజము కాదా?

కోడలికి అత్తను, అత్తకు కోడలిని తిడితే ఆనందము కావొచ్చు. కొంత మంది కి తిండి తింటే, కొంత మందికి నిద్రపోతే, కొంత మందికి ఊరక కూర్చుంటే, ఆనందము. ఇంకొంత మందికి ఖర్చు పెడితే, ఇంకొంత మందికి సంపాదిస్తే, అలా వారి మనసుని బట్టి ఆనందము ఉంటుంది. మన నారదుల బుద్ది ఉన్న వారికి, పుల్లలు పెడితే ఆనందము.

అంటే, సుఖ సంతోషాలు అనుకునే మనసుకు సంభందించినవి మాత్రమే, అందరికీ కాదు. మనసు ఎక్కడ ఉంటుంది, అనుకునే మనలోనే కదా. కాబట్టి, ఇవి బయట లేవు అందరికీ లేవు, అనుకునే మన మనసులోనే ఉన్నాయి. మరి నిద్ర పోతే?

సినిమా పాట గుర్తు ఉందా, కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. అంటే, మనసు నిద్ర పోతది, గుర్తు ఉండవు కదా అప్పుడు. కాని జీవుడు(ఆత్మ) కు ఇవి సంబంధము లేదు కదా, కాబట్టి నిద్ర లో అవి కూడా మరుగున పడి పోతాయి. భ్రమలు సద్దుమణుగుతాయి.

మన మానసిక స్తితిని బట్టి, మేల్కొన్న తర్వాత మరచిపోతాము లేదా, అవే తలచుకుంటూ ఆనందము లేదా విచారము పొందుతాము. మన జీవుడి బుద్ది కూడా, తప్పు చేసేటప్పుడు, వివరముగా చెపుతుంది , తాగవద్దు తిరగవద్దు సాహసము వద్దు అని.

కానీ మన జీవుడి బుద్దిని లెక్క చేయము, దాని మాటి వినము. మనకు ఏమీ కాదు, మనలను ఎవరు ఏమీ చేయరు, మన పలుకుబడి డబ్బు కాపాడుతుంది అనుకుంటాము. కాబట్టి మన కోతి లాంటి మనసును, భ్రమల నుంచి కాపాడుకోవాలి అదుపులో పెట్టుకోవాలి. బుద్ది మాట వినాలి.

భగవద్గీతలో (అధ్యాయం 3, శ్లోకం 42) చెప్పిన అద్భుతమైన విషయాన్ని బట్టి - స్థూల శరీరం కన్నా లేదా బయటి విషయ వాసనల కన్నా ఇంద్రియములు, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 3-42 ।।

Bhagavad Gita: Chapter 3, Verse 34

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ।। 3-34 ।।

ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు/విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.
 

Dt : 21-Oct-2019, Upd Dt : 21-Oct-2019 , Category : General
Views : 650 ( + More Social Media views ) ( id : 39 )
Tags : five elements , senses , mind , intellect , soul , happy , sorrow

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు