యోగ ఆసనాలు - భౌతిక వ్యాయామం, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనకు పునాది - General - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,872; 104 తత్వాలు (Tatvaalu) and views 224,993.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతర దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది.

ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.

ఇవి పరగడుపున చేస్తే బాగుంటుంది. అంటే, లేవ గానే ఉదయము 5 లేదా 6 ఇంటికి. మిగతా సమయములలో చేసినా, కనీసము గంట ముందు దాకా ఏమీ తీసుకో కూడదు. చేసిన తర్వాత కూడా అంత సమయము ఏమి తినకూడదు అంటారు.

భౌతిక వ్యాయామము(Physical exercise) లాగా డబ్బులు కట్టి, పెట్రోలు తో ఎక్కడకి వెళ్ళనవసరము లేదు. ఇంట్లోనే చలి అయినా, ఎండ అయినా, వర్షము అయినా, ఆచరించవచ్చు. అన్ని రకాల వ్యాధులకు, అధిక బరువుకు, మానసిక బలమునకు అవసరమైన ముందు జాగ్రత్త.

ఇవి రోజూ చేయాలి. చిన్న వయసులో నేర్పితే, వారికి తేలికగా అబ్బుతుంది. అధిక బరువు లేదా పొట్ట లావు లేదా బద్దకం ఉన్నవాళ్ళకు, ఇది చెయ్యాలంటే కష్టము. శివయ్య పద్మాసనం లో ఉంటారు ఎప్పుడూ, అయ్యప్ప కూర్చునే విధానం కూడా ఆసనమే.

ఇవి రోజూ చేస్తూ ఉంటే, ముసలి తనపు చాయలు తొందరగా కనపడవు. రక్త ప్రసరణ బాగుగా జరుగుతుంది కాబట్టి, బట్టతల, లావు, రోగాలు, మొదలైనవి రావు లేదా పెరగవు.

బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇప్పుడు పాశ్చత్య దేశాలలో కూడా నేర్చుకుని చేస్తున్నారు. సూర్య నమస్కారాలు, చాలా తేలికగా ఉంటాయి. ఎక్కువ మంది చేయగలరు.

ఈ క్రింది బొమ్మలలో ఉన్న ఆసనాలలో, మీరు ఎన్ని చేయగలరో చూడండి, సంఖ్య ప్రకారం. కొత్తగా మొదలు పెట్టేట్లు గా ఉంటే, గురువు ఉంటే మంచిది, లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి.

జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా 4వ అంతార్జతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. చిత్రములో శీర్షాసనము లేదు, కనీసము గోడకు ఆనించి చేయవచ్చు. కష్టము అయినవి కొన్ని అయినా, గురువు దగ్గర సాధన చేయాలి.

0 seersha (not in pic) 3 matsya , 6 uttana paada , 9 salabha , 12 pavana mukta , 13 dharura , 15 supta vajra , 17 nouka 19 padma (not in pic) 21 sasaanka , 22 halaa , 33 paada hasta , 42 vajra , 49 sarganga , 50 arda hala aasanam  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,872; 104 తత్వాలు (Tatvaalu) and views 224,993
Dt : 21-Jun-2019, Upd Dt : 18-Oct-2019, Category : General
Views : 4813 ( + More Social Media views ), Id : 38 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : yogasan , meditation , exercise
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు