అమెరికా సూపర్ ట్యూస్ డే - ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎన్నికలు, ప్రజా భాగస్వామ్య పద్దతి వివరాలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,858; 104 తత్వాలు (Tatvaalu) and views 225,712.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈరోజు అమెరికా లో సూపర్ ట్యూస్ డే అంటారు. ఎందుకంటే, నవంబర్ 2020 లో జరిగే ఎన్నికల కు ముందు గా, ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అంటే అధ్యక్షుడు ట్రంప్ పై నిలబడే డెమొక్రటిక్ అభ్యర్థి ఎవరు అనేది తేలుతుంది. ప్రధాన పోటీ జో బిడెన్, బెర్నీ శాండర్స్ మధ్య ఉంటుంది.

నీతిగా న్యాయం గా చెప్పాలి అంటే, అధ్యక్షుడు ట్రంప్ దేశానికి, చాలా మంచి చేస్తున్నారు. అన్ని లూప్ హోల్స్ మూసేస్తున్నారు ఒకటి ఒకటి గా. అందుకే ఎక్కువ మంది, ఆయనే గెలవాలి అనుకుంటున్నారు. మన బీజేపీ మోడీ గారి టైపు, అంతా పద్ధతి గా జరగాలి.

కానీ అవసరాను గుణంగా, భారతీయులకు లేదా అన్ని వర్గాల వారికి, కావలసిన పనులు వీసాలు కావాలంటే మాత్రం, అంటే డెమొక్రటిక్ అభ్యర్థి గెలవాలి. అంటే, మన కాంగ్రెస్ తో పోల్చవచ్చు. ఏమి జరుగుతుందో, చూడాలి.

రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఉండవు. జాతీయ పార్టీలు కొన్ని ఉన్నా‌, జనం ఆదరించేవి పై రెండే. ప్రతి పార్టీ నుంచి కొంతమంది ప్రెసిడెంట్ అభ్యర్థి గా నిలబడి, ఆ పార్టీలో ఈరోజు ఎక్కువ ఓట్లు సీట్లు గెలవాలి. దీనికోసం డిబేట్లు గత 6 నెలలుగా జరిగాయి. ఏ ఒకరు కూడా ఈ పార్టీ తరుపున నేనే అధ్యక్ష పదవికి పోటీ అని ఏకపక్షంగా ఉండదు. పార్టీ సభ్యులు అందరూ ఓటు వేసి, అధ్యక్ష అభ్యర్థి ని ఎంచుకోవాలి.

ఓటింగ్ ఈ ఒక్క రోజే జరుగదు. ముందు రోజులు కూడా, జిల్లా కేంద్రంలో మరియు ముఖ్యమైన చోట్ల ఓటు వేసి రావచ్చు. కాబట్టి, ఈరోజు ఎక్కువ రద్దీ ఉండదు. ఐడీ కార్డు చూపించాలి. ఓటు లేకపోయినా, కొత్త గా రిజిస్టర్ చేసుకుంటారు అర్హతలు ఉంటే.

చాలా మంది పోస్టల్ పేపర్ బాలెట్ తెప్పించుకొని , ఓటు వేసి, పోస్ట్ లో పంపుతారు. అభ్యర్థి పేరు ఎదురు గా ఉన్న పెట్టెలో నల్లని చుక్కగా చుట్టాలి రుద్దాలి.

పార్టీ అభ్యర్థి అధ్యక్షుడు పదవి తో పాటుగా, రిప్రజెంటేటివ్ లు , స్టేట్ సెనేటర్లు, స్టేట్ అసెంబ్లీ మెంబర్, జిల్లా జడ్జి, స్కూల్ బోర్డు మెంబర్ అభ్యర్థులు కూడా ఎన్నికల లో నిలబడతారు.

అభ్యర్థులు తో పాటుగా కొన్ని రాష్ట్ర, జిల్లా, పట్టణ సమస్యలు కు జవాబు లను కూడా ప్రజలు అవును, కాదని తమ అభిప్రాయాలను తెలుపుతారు. అంటే ప్రభుత్వ నిర్ణయం లో ప్రజల పాత్ర కూడా ఉంటుంది.

ఉదాహరణకు, రాష్ట్ర ప్రశ్న. రాష్ట్రంలో స్కూల్స్ , కాలేజీలు, యూనివర్సిటీ లు , కొత్తగా లేదా ఉన్నవి బాగు చేయడం కోసం, నిధుల సేకరణకు, రాష్ట్రం తరపున బాండ్లు ప్రవేశ పెట్టడానికి అంగీకరిస్తున్నారా? అవును, కాదు ఎంచుకోవాలి.

జిల్లా ప్రశ్న. జిల్లాలో పిల్లల ఆరోగ్యం మరియు చదువు అభివృద్ధి కోసం , అరశాతం టాక్స్ పెంచడానికి అంగీకారమేనా? అవును, కాదు ఎంచుకోవాలి.

పట్టణ ప్రశ్న, పట్టణంలో సేఫ్టీకి సంబంధించిన పోలీసు నిధులు కేటాయింపు ముగుస్తుంది. దానిని పొడిగింపు కు అంగీకారమేనా? అవును కాదు అని ఎంచుకోవాలి.

ఇలా సమస్యలు పరిష్కారం గురించి, పౌరుల తోనే జవాబులను సేకరిస్తారు భాగస్వామ్యం చేసి , అదే ప్రజాస్వామ్యం కి పునాది.

మన దేశంలో కూడా, ఈ విధంగా ప్రజల కు అభ్యర్థులు ను నిలిపే స్వేచ్ఛ ఇచ్చి, దేశ మరియు ప్రజా క్షేమమే ఉద్దేశ్యం గా, నిజాయితీగా ఎన్నికలు జరిగితే, ఓటర్లు నిజాయితీగా పాల్గొంటే, మన దేశానికి తిరుగు ఉండదు అభివృద్ధి లో.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,858; 104 తత్వాలు (Tatvaalu) and views 225,712
Dt : 03-Mar-2020, Upd Dt : 03-Mar-2020, Category : America
Views : 909 ( + More Social Media views ), Id : 379 , Country : USA
Tags : American presidential primary , Super Tuesday

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content