గౌరవనీయులు పంచాయతీ సెక్రటరీ గారికి, మా వీధిలో, ఒక అనాధ స్ధలం లో చెత్త పేరుకుపోయి - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,862,935; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఏవండీ మా బజారు లో లేదా వేరే వారి స్ధలం లో, చెత్తా చెదారంతో, చెండాలంగా ఉంది. మేము మా పిల్లలు, చెత్త లో దిగం కదా, మాకు వచ్చిన ఇబ్బంది ఏమి?

గురువు గారు తప్పు మాట అది, దైవ దూషణ అది. మనందరం దైవ పుత్రులమే. ముప్పు నిప్పు ప్రమాదం అశాంతి అనారోగ్యం, ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలీదు. అందుకే చుట్టూ పక్కల శుభ్రంగా ఉండాలి. బజారు లో ఒకరి కి రోగం వచ్చిన, ఇంకొకరి అంటుకోవడం తేలిక, మన దగ్గర, ఎందుకంటే ఏదో పని మీద అందరం కలుస్తూ ఉంటాము. అపార్ట్మెంట్ 20 వ అంతస్తులోకి ఈగలు దోమలు రావా?

ఉదాహరణకు చూడండి, మనం నేరుగా చెత్త లో దిగం. కానీ కుక్క, పిల్లి, కోడి, పక్షులు, దోమలు, ఈగలు కు కులమతం ఇల్లు చోటు ఉండదు కదా.

కుక్క పిల్లి అక్కడ తిరిగి వస్తే ఇంకో కుక్క పిల్లిని తాకితే, మనం కూడా మన వాటిని తాకుతూ ఉంటాము. ఈగలు, దోమలు, కీటకాలను ఎటూ ఆపలేము కదా.

ఓ పాలు లేదా ఐస్ లేదా కూరలు అమ్మే ఆయన, ఆ చెత్త లో నడుస్తూ వచ్చారు, మనకు తెలీదు కదా. అంటకుండా ఉంటుందా?

పిల్లలు బంతి కోసం వెళితే? పక్షి వచ్చి మన పూల, కూర చెట్టు న నిలబడదా? వర్షాకాలంలో ఇంకా రోగాలు ఎక్కువ, నీళ్ళు నిలచి, ఆ చెత్త లో.

అందుకే, ప్రతి ఒకరు బాధ్యత తీసుకుని, గ్రామ వాలంటీర్, సర్పంచ్, వార్డు కౌన్సిలర్, పంచాయతీ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ వాళ్ళ కు, వీరందరికీ, వేరు వేరు అర్జీలు పెట్టి, మరలా మరలా, అడుగుతూ ఉండాలి, దయచేసి శుభ్రం చేయమని.

గౌరవనీయులు బాధ్యత గలిగిన పంచాయతీ సెక్రటరీ లేదా ఫలానా గారికి,

అయ్యా, మా వీధిలో, ఫలానా అపార్ట్మెంట్ ఎదురు లేదా ఫలానా ఇంటి పక్కన, ఎవరూ పట్టించుకోని ఒక అనాధ స్ధలం లో చెత్త పేరుకుపోయి ఉంది ఎన్నో ఏళ్ళుగా/ నెలలుగా. ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు. మా చుట్టూ పక్కల అందరికీ, రోడ్డు న నడిచే లేదా ప్రయాణం చేసే వారికి, ఇబ్బంది అవుతుంది. ఈగలు, దోమలు ఈగలు కీటకాల వలన, రోగాలకు మూలం అవుతుంది. పాములు, తేళ్ళు, పందికొక్కులు, ఎలుకులకు నిలయము అవుతుంది. దయచేసి వీలైనంత త్వరగా శుభ్రం చేయించి, మరలా చెత్త వేయకుండా, అక్కడ బోర్డు పెట్ట ప్రార్ధన.

ఇట్లు
మీ విధేయ బాధ్యత గల ఓటరు,
ఫలానా గ్రామ వీధి నివాసి, అడ్రసు, ఫోన్ నంబర్.

ఫలానా లేదా గ్రామవాసి అంటే, సరియైన వారి పేరు హోదా, మీ పేరు అడ్రసు రాయాలి, వారు గుర్తు పట్టాలి కదా. ఇలా రాసిన పలు కాగితంలు లేదా అర్జీలు, పైన చెప్పిన, అందరికీ ఇచ్చి, అడుగు తూ ఉండాలి.

మీకు స్ధలం ఓనరు తెలిస్తే, అతని తోనూ మాట్లాడుతూ లేదా పెద్దల ద్వారా, మన వ్యధ తెలుపవచ్చును. మనిషి అయితే అర్ధము చేసుకుంటారు.

ఇది చాలా తేలిక పద్ధతి, రోగం వచ్చిన తర్వాత ఆసుపత్రి, రోగం , ధనం, అశాంతి కన్నా. ఆరోగ్యం జాగ్రత్తలు మిత్రులారా.

ఇవి మీకు మాకు చెత్త గురించి అవసరం లేకపోవచ్చు. కానీ బంధువులు స్నేహితులు తల్లి దండ్రులు చుట్టాలు, పల్లెటూరు లేదా పట్టణంలో లేదా అలాంటి వీధిలో ఉండవచ్చు. వారికీ జాగ్రత్తలు చెపడానికి ఇది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,862,935; 104 తత్వాలు (Tatvaalu) and views 224,622
Dt : 03-Mar-2020, Upd Dt : 03-Mar-2020, Category : Request
Views : 1459 ( + More Social Media views ), Id : 378 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : street garbage , Corona virus , COVID-19
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content