మీ బిడ్డల తిండి త్యాగము, నా బిడ్డలు కడుపులు నింపండి, ఊరి జనాల వైనా దోచుకుంటాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,629; 104 తత్వాలు (Tatvaalu) and views 225,695.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మా సత్య నిష్ట వడ్డీ బాబాయి కి, 2016 లోనే చెప్పాను, ఒకేసారి అన్ని వెనక్కి ఇవ్వాలంటే, మీకూ మాకూ కష్టం అని. అలాగే ప్రతి సంవత్సరం ఇస్తా, మాట తిప్పను మడం తిప్పను అన్నారు. అందరికీ అన్ని తిప్పేశారు.

చివరి రోజుల్లో ప్రశాంతంగా ఆరోగ్య రక్షణ చేసుకుంటూ, మనశ్శాంతి గా, సొంత పిల్లల తో పబ్లిక్ గా ఆడుకోకుండా, ఊరి జనాల సొమ్ము తో ఆటలు పాటలా? ముదుసలి తల్లి, పల్లెటూరి తమ్మి, ఊళ్ళో చెల్లి ధనం ఊసు ఎటుపోయింది.

ఉన్నప్పుడు ఉలకని పలకని ఇంటివారు, ఆయన పోయాక పలుకుతారా పట్టించుకుంటారా?

మొన్న మీ ఎదురు గా, రెండేళ్ల కు రెండు ఇవ్వమంటే, జనానికి కలుగులో దాంకున్నట్లు, మన మంచి మాటలకు వాట్సాప్ లో దాంకున్నారు, లెక్క చెప్పకుండా. మిత్రులు, బంధువులు ఎంతో మంది, కష్టం లో అవసరం లో అడిగారు, సహాయము చేయలేక్ ఉన్నాము.

రాష్ట్రంలో జనాన్ని, బంధువులు ను, అందరూ గుమస్తాలు ను, చదవకుండా ఆపలేరు కదా? అందుకే వెనకటి సామెత ఒకటి, సిగ్గు విడిసేసిన వారు వీధికి పెద్ద, జన ధనం మేసిన వారు ఊరుకు పెద్ద అని.

అప్పుడు నుండి బాబాయి, జగనన్న చంద్రన్న పధకాలు ఉన్నప్పుడు, నేనెందుకు పెట్టకూడదు అని కొన్ని సొంత పధకాలు పెట్టారు, తనకు సహాయము చేసిన జనాలను ఇబ్బంది పెట్టి నవ్వించాలని. అవి

* మీ బిడ్డలు నోట్లో మట్టి, మా బిడ్డల ఇంట్లో ఆస్తి. మీ బిడ్డలు కంట్లో నీరు, మా బిడ్డల నోట్లో నవ్వు

* మీ కడుపు లు కొడతా, మా కడుపు లు నింపుతా. మీ బిడ్డల తిండి త్యాగము చెయ్యండి, నా బిడ్డలు కడుపులు నింపండి.

* ఊరి జనాల వైనా దోచుకుంటాం, బంధు వర్గాల దైనా దాచుకుంటాం

* పసి పిల్లల ధనమైనా వదలం, ముదుసలి వారి మూటైనా బెదరం

* మాకు ఎగకొట్టే వారి దగ్గరకు రౌడీలు, మేము ఎగకొట్టే వారి దగ్గరకు పిచ్చి మాటలు

* మాకు ఎగకొడితే జనం ఆస్తులు లాక్కుంటాం , మీకు ఎగకొడితే మామీ ఆస్తులు వదల్కోండి

* వ్యాపారం లో భాగస్వామి లా నష్టం భరించాలి, లాభం మాత్రం మరవాలి

* మీ ఆస్తులు అమ్మి మీ పిల్లల బాగు చూడండి, అలాగే, మీ సంపద వాడి మా పిల్లల బాగు చేస్తాము

* నేను వడ్డీ ఇవ్వను, ఇంకోరి దగ్గర వడ్డీ తెచ్చుకోనివ్వను. నేనివ్వ, మీకు దొరకనివ్వ.

* మీ అసలు కు, వడ్డీ రద్దు - దొరల దొంగ దోపిడీ సంపద పెంపు పధకం కింద

* అసలు మీకు ఇవ్వను, కొసరు కోసం తిరుగు

* మీ ధనం లేక మీ బిడ్డ లెట్టా పోయినా, మీ ధనం తో మా బిడ్డ కు కేబులెడతా

* బంధువుల ఆడబిడ్డలు మా ఇళ్ళు షాపు చుట్టూ తిరిగినా, జాలి లేని ధన పొరల తెరల వెనకే మేము

మా బంధువులు, ఊళ్ళో జనం అందరి తరపున నమస్కరించి విన్నపము. నిజంగా లేకపోతే, అందరి కాళ్ళు పట్టుకుని, వేడుకోవాలి కరుణించమని. కానీ అన్ని ఆస్తులు ఎదురుగా చూస్తూ జనం నమ్మరే.

ఉంటే, ఇచ్చేసి వదిలించుకో వెంటనే, ఆ కన్నీళ్ళు శాపాలు తిరుగళ్ళు.

వడ్డీ తో సహా, తర తరాలు అవి తిరిగి చెల్లింపు కు, ఊడిగం చేయాలి, తలవంచి, అందరి కాళ్ల దగ్గర పడి ఉండాలి దీనంగా. పరాయి సొమ్ము పాము వంటిది.

చూసారు కదా మా బంధువులు బాధ. ధనం అందరికీ తెలిసి ఇస్తేనే, దిక్కు ఉండటం లేదు. దొంగ చాటుగా ఇచ్చి, మోస పోవద్దు. ఈ రోజుల లో రోగాలు, తగువులు, కేసులతో ఎవరికి ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితి.

ఒక వ్యక్తికి ధనం ఇస్తే, ఆ ఇంట్లో ఇల్లాలు లేదా భర్త కు, పిల్లలు కు, స్నేహితులు కు, అన్నదమ్ములు కు అందరికీ ముందు లేదా తర్వాత అయినా చెప్పి, తర్వాత అప్పుడు అప్పుడు గుర్తు చేస్తూ ఉంటే, పాపం అని కనీసం కన్నీళ్ళు అయినా తుడుస్తారు.

రేయ్ బుజ్జీ, మీ నాన్న కు లేదా తాతకు, రెండు ఇచ్చిన, కాస్త గుర్తు చేయర బాబోయ్ అని దండం పెట్టుకోవాలి తప్పదు. ఓ మండోదరి తల్లి, మీ రావణుడు, మా ధనం కాజేసి దాచేశారని, ఇప్పించమని వేడుకోలు తప్పదు.

లేదంటే మాకు తెలీదు అంటారు రేపు. వారి తో పాటే అప్పులు గుటుక్కు , ఆస్తులు ఫటక్కు అనగలరు. జాగ్రత్తలు సుమీ.

అని తన గోడు రాము సోముతో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,629; 104 తత్వాలు (Tatvaalu) and views 225,695
Dt : 28-Feb-2020, Upd Dt : 28-Feb-2020, Category : General
Views : 799 ( + More Social Media views ), Id : 370 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : babai , uncle , interest , principle
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content