APLatestNews.com top Banner
         
ప్రవాస తెలుగు వారు (భారతీయులు) - ఎందెందు వెతికినా అందందే గలదు, మన సమాచారము - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
March 4th Update : ఓట్ల గల్లంతు వ్యవహారం, మలుపులు తిరుగుతోంది. డేటా చోరీ అంటూ, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందటంతో, వారు ఏపీకి చెందిన పలు ఐటీ కంపెనీలపై టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ కు ఎమి పని? ఎవరో దానయ్య ఫిర్యాదు చేస్తే, డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా? అని బాబు గారు అంటున్నారు.

ఏది ఏమైనా, మన ఎన్నారై ల సమచారం లాగనే , తెలుగు ప్రజల సమాచారం కూడా అన్ని పార్టీలకు అందుబాటులో ఉన్నట్లుగా ఉంది.
- - -

మనము చాలా సమాచారము, ప్రవాస ప్రభుత్వ లేదా(APNRT, AP Janma Bhoomi, . . . ) వేరే వెబ్సైట్(తానా, ఆటా , . . . ) ల లో ఇస్తుంటాము, వేరే పని కోసము. కాని అది వేరే పనికి కూడా ఉపయోగపడుతుంది, అని తెలుసుకో లేము. ఉచితముగా ఏదీ రాదు, వెనక పరమార్దము తెలుసుకోవాలి అంటే, బ్రహ్మా కైనా కష్టమేనేమో. ఆయన కూడా, బిగ్ డాటా లేదా డేటా వేర్ హౌసింగ్ లాంటి కంపూటర్ విద్య నేర్వాలి ఏమో, మన తెలుగు రాష్ట్రాలలో.

ఈ సంభాషణ చూడండి, ఒక 5 నెలల లోపు, మీరే అర్దము చేసుకోండి, అందులో పరమార్ధాన్ని, ఇంకా ఎన్నికలు జరగాలి. ఇందులో తప్పేమి లేదు, ఏ పార్టీ అధికారము లో ఉన్నా లేక ఏ పార్టీ కి నెట్వర్క్ ఉన్నా, ఇది మాములే.

ఒక ఫోన్ వచ్చింది, సంభాషణ సంక్షిప్తము గా :

1. ప్రశ్న - సార్, మీరు ఫలానా, మన అభిమానులే గదా.
జవాబు - అవును, చంద్రన్న 1(బాబు), చంద్రన్న 2(కెసియార్), జగనన్న, పవనన్న , అందరికీ అభిమానినే.

2. ఇంతకీ మీరు ఎవరు, మీకు ఇక్కడి ఫొన్ నంబర్ ఎలా తెలిసింది.
సార్, అవి అన్నీ చెప్పకూడదు, కొన్ని వివరాలు చెప్పి, మాకు పై వాళ్ళు, పేర్లు ఫోన్ నంబర్ లిస్ట్ ఇచ్చారు. నేను తెలుగు రాష్ట్ర రాజధాని నుంచే. భయపడాల్సిన పని, ఇబ్బంది ఏమి లేదు.

3. సరే చెప్పండి, ఎలా ఉంది, మన రాష్ట్రము, పరిస్తితులు? ఇంతకి పని ఏమిటి?
నవ్వుతూ కొన్ని మాటలు చెప్పి, ఏమి లేదు అండి, ముందు జాగ్రత్త గా, మన మన ప్రవాసులకు ఓటు హక్కు వస్తుంది త్వరలో/వచ్చింది, రిజిస్టర్ చేయించుకోమని పద్దతులు చెపుదామని. మనము గెలవడానికి ఉన్న, ఏ ఒక్క దోవను వదల కూడదు గదా. అన్ని వివరాలు చెప్పారు.

4. ధన్యవాదాలు, అలాగే చేద్దాము, మన వాళ్ళకి చెపుదాము అని మన వాళ్ళ జవాబు.

రేపు అమెరికా పబ్లిక్ ఎలక్షన్ కి కూడా ,ఇలానే ఫోన్ చేస్తారేమో. తెలుగు సంఘాల ఎన్నికలకు ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రేడి డబ్బు కట్టో లేదా ఇంకో దోవలోనో, మనమే మన, సమాచారము ఇచ్చి ఉంటాము. ఏ వెబ్సైట్ నుంచి ఎవరి అనుబంధ శాఖలకు చేరుతుందో. ష్, ష్, చిన్నగా, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక .

కొంతమంది చిన్న అక్షరాలలో రాస్తారు, మీ(మా) సౌకర్యార్దం, మీ సమాచారము, మా అనుబంధ సంస్థలతో, పంచుకొనబడుతుంది అని. ఫ్రీ గా వస్తే చాలులే అని మనము.

ఇందుగలదు అందు లేదు అను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు, మన సమాచారము ఈ ప్రపంచము లో , రామయ్యా , క్రిష్ణయ్యా !

Dt : 13-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 372 ( id : 37 )
Tags : Identity Theft , Personal Information , Telugu Election campaign , Telugu Association
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content