పది రోజులు గా, స్ధలం చెత్త రోగాల గురించి, తన మామయ్య కు చూపించే కృతజ్ఞతలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,812; 104 తత్వాలు (Tatvaalu) and views 225,173.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పక్క స్ధలం మామయ్య గారి పాద పద్మములకు నమస్కారములు. ఒకనాడు నాన్న, మీరూ, మామా అల్లుళ్ళు అని, మన ఊరు సెంటర్లో తిరుగుతూ ఉంటే, జనం, ఎమ్ ఆర్ వో లు, అందరూ అబ్బుర పడ్డారు, ఆశ్చర్యపోయారు.

కానీ పచ్చి అవకాశవాది అవసరవాది క్రుతగ్నుడు అని, ఎవరూ ఊహించలేకపోయారు, మీ తల్లి గారితో సహ అని. ధన మోహం లో అన్ని మరచారు నాన్న ఉన్నప్పుడే అని వినికిడి.

రెండు వర్గాలు అయినా, ఎంత బాగా కలసిపోయారు అని, అసూయ పడ్డారు అందరూ. మంచితనం, మానవత్వం కు వర్గం, ఎప్పుడూ అడ్డంగా రాదు, మీ ఇద్దరూ దానికి ఉదాహరణ అన్నారు.

ఇంటి కొచ్చినప్పడు అమ్మతో లేదా ఎందరితోనో మీరే అన్నారు - అక్కా , మామయ్య లేకపోతే, ఎక్కడ ఉండే వాడినో అని, ఒక ముద్ద తింటున్నా అంటే, మామ చలవే అని.

ఈ రోజున, ఆ ముదుసలి అక్క, బిడ్డలు కాదంటే, ఎక్కడో ఒంటరిగా బిక్కు బిక్కు న ఉంటే - అక్కా ఎలా ఉన్నావు, అన్ని బాగా జరుగుతుందా, లేకపోతే చెప్పు, అనే చిన్నపాటి మర్యాద నోటి మాట కూడా రాలేదు, గత ఐదు ఏళ్లుగా.

రేపు ఆ ముదుసలి తనం, మనకు రాదా? మనల్ని చూసే వారు దొరకవద్దా? అందుకే అన్నారు పెద్దలు, గతం మరచిన లేదా మరచే వారికి, పుట్టగతులు ఉండవు అని.

ఆ స్ధలం ఆ విధంగా, అందరూ ఉండీ, ధనం ఉండీ, 20 ఏళ్లుగా, అనాధ లాగా పడి ఉండి, చెత్త చెదారంతో దోములు ఈగలతో, ఆ రోడ్డు న నడిచే లేదా ప్రయాణించే, జనానికి, రోగ కారణం కారాదు.

ఆ పాపం, నాది కాదు, నా అల్లుళ్ళది అంటావేమో తప్పుకోవడానికి. వాళ్ళు మనవారే కదా, పిల్లల బాగు మీరే కోరాలి కదా.

జనం రోగాలు ఇబ్బందులు, మనకు శాపాలు కారాదు. దయచేసి శుభ్రం చేయించగలరు. ఇతరుల ఆరోగ్యం మరియు గోడలు కాపాడగలరు. చేతులు జోడించి అడుగుతున్నా, ఆ పాపం మీ చివర రోజుల లో, వెంట పడకూడదు కదా.

చుట్టూ పక్కల జనానికి కూడా క్షమాపణ చెప్పగలరు. అంతా మనవారే చుట్టూ, మన రెడ్డి గారు, చౌదరి గారు, నాయుడు గారే. మీరు అరచిన పంతులు గారికి, వారి సతీమణి అంటే మా అక్క కు, క్షమాపణ చెప్పగలరు.

ఇంకో అక్కకు, రెండేళ్ల క్రితం ఎగవేసిన 600 రూకలు ఇవ్వగలరు. రేపు మనకు లేదా ఇంకొకరికి రోగం వస్తే, 6 లక్షలు మనకే వదులుతాయి. పాపం వారు ఎలుకలు, పాములు, దోమలు, పందికొక్కులు, చీమలు, చెట్లు పుట్టలు చూసి భయపడుతుంది.

అది శుభ్రం చేయించి, గోడ కట్టించగలరు, అల్లుళ్ళ ను కాపాడగలరు. ఇంకా పీనాసితనం వదలలేదు అని, జనం అనుకోరాదు. మా మామయ్య మారారు, అని చెప్పుకునే అవకాశం ఇవ్వు గలరు, దయచేసి.

ఎటూ రెండు వైపులా మరియు మూడో వైపు కొంచెం, వేరే వాళ్ళు పుణ్యం కట్టుకుని గోడ కట్టారు, గత 20 ఏళ్ల లో. అల్లుళ్ళ పుణ్యం కోసం, ఆ కొంచెం అయినా, మిగిలిన గోడ కట్టుకోగలరు. అక్క పూజలు, మిమ్మల్ని ఎందుకు మార్చలేక పోతున్నాయో, ఎవరికీ తెలియడం లేదు.

మా వీధి జనాన్ని, రోగాల నుంచి కాపాడు. ఊరు పెద్దలు కూడా, మీ మామయ్య వినే పరిస్థితి లో లేరు, అనేట్టుగా చేయవద్దు. నా తప్పు ఉంటే, పెద్దల ఎదురు క్షమాపణ చెపుతాను.

కానీ రోడ్డు జనాన్ని కాపాడు. పిల్లలం మేము తప్పు చేస్తే, అరవాల్సిన పెద్దలు మీరు, మరువద్దు.

ఇట్లు మీ కన్నా, బుద్ధి సంస్కారం నీతి కృతజ్ఞత, తక్కువగా ఉన్న, జ్ఞానం లేని అల్లుడు, క్షమాపణ ల తో.

గత పది రోజులు గా, పక్కన స్ధలం చెత్త రోగాల గురించి, మామయ్య తన మామయ్య కు చూపించే కృతజ్ఞతలు గురించి, 20 ఏళ్ల గత చరిత్ర, మన ఇద్దరు కూ తెలిసిన పెద్దలు, చుట్టాలు, తెలిసిన వారు, తెలియని వారు, మామయ్య ఔదార్యం, జనం ఎడల, సొంత బిడ్డలు మీద ఉన్న, ప్రేమ అనురాగాలను తెలుసుకుంటూ, తన్మయత్వంలో నోట మాట రాక నిశ్చేష్టులై ఉన్నారు, అని అజ్ఞాని అయిన అల్లుడు, ప్రజల గోడు ను, మీకు విన్నవించారు. దయతో కరణ చూపాలని, మనవి అని, తెలియజేయగలరు. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,812; 104 తత్వాలు (Tatvaalu) and views 225,173
Dt : 25-Feb-2020, Upd Dt : 25-Feb-2020, Category : General
Views : 839 ( + More Social Media views ), Id : 364 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : empty place , cleaning , deceases , people health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content