APLatestNews.com top Banner
స్వేచ్చా భారతం - Jan 26, Aug 15 - ఇంటి పై మువ్వన్నె జాతీయ జండా(Host a National flag) - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
Both Jan 26 and Aug 15 are the festival days for true patriotic Indian folks. Can we try to host a small national flag on our home for Independence day Aug 15th?

Every village in America will have an American national flag on most of the homes. Public will celebrate that day as a festival. Particularly for independence day(July 4th), they will try to keep the American national flag on their houses.

Each village/city also may have fireworks to celebrate the Independence day. We are following many western cultures. Can we follow this simple tradition to keep our Indian national flag on our house in India on Aug 15th? We can buy and keep a small national flag for 20 rupees. Please share with your friends and encourage them.

ఎంతో మంది అమర వీరుల మరణంతో, మనము ఈరొజున స్వేచ్చా వాయువులు పీలుస్తున్నాము. బయట దేశాలతో పోలిస్తే, మనకున్న స్వేచ్చ, ఎక్కడా లేదు. భరత మాత ముద్దు బిడ్డలుగా, మనము గర్వించాలి. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) మరియు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినం, భారతీయులకు ప్రత్యేకమైన రోజులు. ఆగస్ట్ 15 ని చాక్లెట్ల పండుగ అంటారు , చిన్న పిల్లలు ముద్దుగా.

1950 జనవరి 26 న, భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం, అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు 15 న, భారతదేశం, వందల ఏళ్ళ ఆంగ్లేయుల బానిసత్వ సంకెళ్ళ నుండి విముక్తి పొందింది.

అమెరికాలో ప్రతి గ్రామంలో, అత్యధిక గృహాల మీద, అమెరికా జాతీయ జెండా ఉంటుంది. ప్రజలు, అమెరికా స్వాతంత్ర దినం రోజు, ఒక ఉత్సవం లేదా పండగ లాగ జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా స్వాతంత్ర దినం రోజు(జూలై 4), వారు ఇంటిపై జాతీయ జెండా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ప్రతి గ్రామంలో/నగరంలో స్వాతంత్ర దినం రోజు బాణాసంచా కాలుస్తారు.

మనము అనేక పాశ్చాత్య సంస్కృతులు, పద్దతులు అనుసరిస్తున్నాము కదా. మనము భారతదేశం లో, మన ఇంటిపై, మన భారత జాతీయ జెండా ఉంచేందుకు, ప్రయత్నిద్దామా , కనీసము ఆగస్ట్ 15 న? మనము 20 రూపాయలకు, చిన్న జాతీయ జెండా కొని, పెట్టలేమా అలోచించండి. స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకొండి, వారిని ప్రోత్సహించండి.

రిపబ్లిక్ డే రోజు, ముందు చూపుతో ఆరు నెలల ముందు గుర్తు చేసుకుందాము. పోయిన సారి కొంత మంది అన్నారు, నిన్న చెప్పిన, కొని పెట్టేవాడిని అని , పండగ సగం అయినది ఈరోజు ఆదివారం అని. మరి ఇప్పుడే 4 జండా లు కొని ఇంట్లో ఉంచండి. నాలుగు వైపులా ఉంచవచ్చు లేదా నలుగురు కి పంచవచ్చు.

మన జాతీయ జెండా త్రివర్ణ పతాక రూపశిల్పి, పింగళి వెంకయ్య గారు , 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించారు.

ఒక్క సారి మధ్య ధరా సముద్ర దేశాలు , ఆఫ్రికా దేశాలు , ముస్లిం దేశాలలో సామాన్య జనం బతుకులు, స్వేచ్ఛ ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. మనం ఎంత స్వేచ్ఛ గా బతుకుతున్నామో. ఆఖరికి పాశ్చాత్య దేశాల లో కూడా మన కున్న స్వేచ్ఛ లేదు.
 
Dt : 13-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 428 ( id : 36 )
Tags : indian national flag , independence day , keep a flag at home , pingali venkayya

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content