APLatestNews.com top Banner
డాక్టర్ గారు, మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు. ఆ వాసనలు వెంట నడుస్తాయి, ఏ లోకం లో అయినా - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మన వీధి లో డాక్టర్ గారు, షుమారు 76 వయస్సు, గుర్తు ఉన్నారా? ఆయన 18 వ తేదీ రాత్రి, శివైక్యం చెందారు. వారి అబ్బాయి కూడా డాక్టర్, మన ఊరు తెచ్చే ముందు, చెప్పారు, ఈ విషయం ఇలా జరిగింది అని.

ఆయన చాలా మంచి వారు, ఈ పెద్ద వయసు లో కూడా, అందరి దగ్గరకు నడచి వచ్చి, ఇంటికి వచ్చి చూసేవారు. మన ఇంటి దగ్గరకు కూడా వచ్చి, అక్కకు వైద్యం చూస్తూ, అప్పుడు అప్పుడు నాతో మాట్లాడేవారు. ఎప్పుడూ నవ్వుతూ ఓపిక గా జవాబు చెపుతారు. అమ్మ కు కూడా, ఒకసారి ఉదయం 5 కు వచ్చి చూసారు.

ఎప్పుడూ అనేవారు, చాలా మంచి పని చేస్తున్నావు, అమ్మకు ఉత్తమ విదేశీ వైద్యం అందిస్తూ అని. అలాగే మన కాకర అల్లం వెల్లుల్లి ఆకు రసాలు కూడా, ఆయన భేష్ అన్నారు. ఆయుర్వేదం అంటే ఆయనకు ఇష్టం.

సాధారణంగా వ్యాపార మనసు గల డాక్టర్లు, మన ఇంటి వైద్యం అంటే, అబ్బే ఉపయోగం ఉండదు, ఇంగ్లీషు టాబ్లెట్ మా షాపు లోవే వాడు అంటారు. మన సొంత వైద్యం ను అసలు వద్దు అంటారు. కానీ వీరు, స్పష్టంగా మంచిది అలాగే చెయ్యి, అని భరోసా ఇచ్చారు అక్క కు.

మొదటిసారిగా, అక్క నడక పరుగు గురించి చెప్పింది, ఈ డాక్టర్ గారే, మిగతా వారి కన్నా ముందు. ఏదో మునిగి పోయినట్లు, ఏం పరుగులు స్పీడు, ఏం నడక, మీ 60 ఏళ్ల అక్క, ఎదురుగా వస్తున్నా కూడా గమనించకుండా అని.

అబ్బాయి, నేను ఇన్ని రోజులు చెపితే ఆమె వినలేదు. నయానో భయానో మాయో, నీ మాట మాత్రం విని పాటిస్తూ, గుడి దాకా రోజూ 2 పూటలా, పావు మైలు, ఎంత వడి వడిగా నడుస్తోంది. ఆమె, మోకాళ్ళ నొప్పులు కూడా మరచి అన్నారు.

మనం చేసిన మంచి ఎక్కడ కూ పోదు. అలాగే చెడు కూడా. ఆ వాసనలు మన వెంట నడుస్తాయి, ఈ లోకం లో అయినా, పై లోకం లో అయినా, మరు జన్మ లో అయినా. డాక్టర్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ.

డాక్టర్ గారిది పెదకర్మ, మార్చ్ 7 న. గతంలో మనం విశ్వం గారి దా కూడా రాసి, వారి మంచి తనం ను, పదిమందికి తెలియచేసాము. నాలాంటి బయట వారు పొగడాలి, వారి తదనంతరము కూడా.

వాళ్ళ ఇంటికి వెళ్లి మనం తినలేదు, మన ఇంటికి వచ్చి వారు తినలేదు. కానీ ఏమిటి బంధం? కేవలం మంచి తనం. ఎక్కడ కనపడినా, నవ్వుతూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అని అడగడం. బయట వారికి కనీసం నాలుగు మంచి పనులు లేదా మాటలు చెప్పాలని తాపత్రయం. అదే మన వెంట నడిచేది, అదే ఆత్మ కు శాంతి.
 

Dt : 19-Feb-2020, Upd Dt : 19-Feb-2020 , Category : General
Views : 82 ( + More Social Media views ) ( id : 353 )
Tags : Good Doctor

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content