APLatestNews.com top Banner
జంతువుల్ని జీవాలను వధించేటప్పుడు, మనసు తో ఆ మూగ జీవాల రోదన వినండి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
అబ్బాయి, ఎందుకు ఇవి అన్ని చెపుతున్నావు ఇప్పుడు అంటారా? గతంలో సార్స్, ఎబోలా, ఇప్పుడు కరోనా, ఇంకా భవిష్యత్ లో ఎన్నో వస్తూనే ఉంటాయి, మనకు బుద్ది చెపడానికి.

మన గురువులు అంతా, క్షేమంగా ఉండాలి పిల్లా పాపలతో అని. ఏ ఒక్కరూ, ఎదో ఒక చిన్న బలహీనతతో, దాని కోరల్లో చిక్కుకోకూడదు అని ముందు జాగ్రత్త.

మనం దేవుని సినిమాలు సీరియల్, చూస్తూ ఉంటే గమనించారా? ఒక్క దేవత లేదా దేవుని చేతిలో అయినా, నీసు లేదా శాఖాహారము కానిది చూసామా? కృష్ణుడు రాముడు సీతమ్మ లక్ష్మీ . . . ఎవరైనా.

ఆఖరుకు బాబా కూడా, భిక్షతో రోటీ సబ్జీ తిన్నారే కానీ, పక్కన అందరికీ పంచి పెట్టి, మరి మనము అది పాటించమా?

కానీ అదే దానవజాతి లో ఉన్న కుంభ కర్ణుడు, మిగతా రాక్షస గణాలు, చేతిలో ఎన్నో చూస్తాము, గుర్తు వచ్చింది కదా?

కాబట్టి, మనం ఎవరి అంశ? దేవతా అంశా లేక రాక్షస అంశా? మీరే నిర్ణయించుకోండి. నేను అనలేదు ఎవరినీ, అనను. పాపం శమించుగాక.

కోడి నీ మేక ను పొట్టేలు ను లేదా ఇంకో జీవిని, కోసేటప్పుడు లేదా బలి ఇచ్చే టప్పుడు, జాగ్రత్త గా గమనించండి, చూడండి, మనసు తో ఆ మూగ జీవాల రోదన భాష వినండి.

ఒరే మనవడా, నేను మీ నాయనమ్మ ను తాతను రా, నాన్న ను రా. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తి నేను ఇచ్చిందేను రా. ఇదేనంటరా క్రుతజ్ఞత, సంస్కారము, మర్యాదా, దైవ లక్షణాలు? నేను నీ స్నేహితుని రా, బంధువుని రా, నీకు ఎంతో మంచి చేసాను. తప్పు, అలా చేయకుండా ఉండాలి రా.

తెలీక తప్పనిసరి అయి, పాపం చేసి, మేము ఇలా జన్మిస్తే, మీరూ అంత కన్నా ఎక్కువ ఘోర పాపం చేస్తున్నారు. అని మన మంచి కోరి, కన్నీటి ధారలుగా ఏడ్చి ఏడ్చి , విధిలేని పరిస్థితి లో దేహము విడిచే, మన పూర్వీకులేమో, ఆలోచన చెయ్యండి.

మనము కధలలో చదివాము కదా, ఒక తండ్రి బాగా సంపాదించి, ధనము మీద వ్యామోహముతో, తర్వాత జన్మలో కుక్కగా లేదా పాముగా పుట్టి, ఇంటికి కాపలా కాశారు అని.

ఇవి మన మాటలు కావు, మనము పుట్టించిన మాటలు కావు. తప్పు చేసిన మానవుడు, జంతు పక్షి కీటకాదులలో జన్మించి, తనను తాను బాగు పరచుకొని, మరలా గొప్పదైన మానవ జన్మ ఎత్తి, దేవుని కోసము ప్రయత్నము చేస్తారు అని చదవలేదా మన శాస్త్రాలు పురాణాలు లో.

గరుడ పురాణం, ఒకసారి చదవండి. మనలో జంతు హింస మానండి, అధికారము బలం ఉంటే, మీ దగ్గర జరగకుండా ఆపండి.

మీ పాదాలకు, నమస్కరించి వేడుకుంటున్నా. మన పాపం తగ్గించుకుందాం, ఉత్తమ జన్మ ఇచ్చినందుకు, మన పూర్వీకులకు మంచి పేరు తెచ్చి, దైవత్వమును పొదుదాము.
 

Dt : 19-Feb-2020, Upd Dt : 19-Feb-2020 , Category : General
Views : 85 ( + More Social Media views ) ( id : 350 )
Tags : parents , vegetarian , Corona virus , COVID-19

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content