APLatestNews.com top Banner
అంతర్జాతీయ జంతు పక్షి కీటక సర్ప సమాఖ్య ఆనందోత్సాహాలతో పండుగ - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

ప్రపంచ దేశాలు లో ఉన్న, అన్ని పక్షులు, జంతువులు, కీటకాలు, సర్పాలు అన్నింటికీ భగవంతుడు రక్షణ కల్పించారు. భగవంతుడు, కరోనా(COVID-19) వైరస్ అనే అవతారం ఎత్తి, అని కొంతమంది భావిస్తున్నారు. అది ఎవరు స్రుష్టించినా ఎందుకు స్రుష్టించినా కూడా, భగవంతుని దయలేనిదే బయటకు రాలేదు, విభ్రజించలేదు ఈ రకముగా.

ఎందుకంటే జనం, ఈరోజు ఆ కీటకాల కు భయపడి, పక్షులు జంతువుల జోలికి పోవడం లేదు. భయంతో బిక్కు బిక్కు మని ఇళ్లు లో దాంకుంటూ, ముక్కల కు గుడ్డలు అడ్డుతో తిరుగుతూ ఉన్నారు, అంటువ్యాధులు రాకుండా. దేశాలు వదిలి కూడా, ఇంటి దారి పడుతున్నారు.

లేకపోతే ఏమిటి అండి, వెనకటి బకాసురునికి మనిషిని తినే అలవాటు ఉంది అని, అప్పుడు మనం అంటే ఆ నగర వాసులు భయపడ్డారు. ఇప్పుడు కోడి, కొంగ, పిల్లి, ఎలుక, పంది, మేక, ఆవు, దున్న దేనినీ, మన జనాలు వదలడం లేదు, నాలుక రుచి కి బానిసై, మనసు అదుపులో లేక.

మిగతా దేశాలలో, మన దగ్గర కొన్ని ప్రాంతాలలో కూడా, పాములు, బొద్దింకలు, కప్పలు, కీటకాలను కూడా, దోరగా వేపి మసాలాతో, లేదంటే బతికి ఉన్న వాటినే పులుసు లో వేసుకుని, లొట్టలు వేస్తూ ఆ రకముగా ఆరగిస్తూ ఉంటే, మంచి మాటలతో ఆపనప్పుడు ఏమి చెయ్యాలి, దేవుడు కూడా ఏదో మార్గము చూపి జంతు సమ్రక్షణ కూడా చెయ్యాలి కదా.

అంతర్జాతీయ జంతు పక్షి కీటక సర్ప సమాఖ్య తరపున, కరోనా వచ్చినందుకు, జంతువులకు రక్షణ దొరికినదుకు, వారు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని, మమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ సమాఖ్య సభ్యులు అని భోగట్టా (వెటకారం).

తోటి ప్రాణులను కరుణిద్దాం. మన పూర్వ జన్మ సిద్ధాంతం ప్రకారం, మన ఇంట్లో వారో బంధువులో, స్నేహితులో, పాప కర్మ ననుసరించి, జంతువులు పక్షులు గా పుడితే, వాటిని మనమే తింటే, మన పరిస్థితి రేపటి బతుకు ఏమిటి? అందుకే శాఖాహారం ఉత్తమం. బాబులూ, దయచేసి కల్తీ నీసు తిని రోగము తెచ్చుకోకండి.

ఇంతకుముందు ఇలాంటి వైరస్ లు వచ్చాయి, అయినా జనము మారలేదు, ఇంకా వస్తూనే ఉంటాయి, జాగ్రత్త గా ఉండాలి మరి.

మాంసం తినే వారిపై, దేవుడు ధరించిన కోపావతారమే కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ అని, అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. కరోనా.. వైరస్‌ కాదు. అది మూగజీవాలను కాపాడే అవతారం. అవి మనకు మృత్యు సందేశాన్ని ఇవ్వడానికి, మూగ జీవాలను తినేవారికి శిక్ష వేయడానికి వచ్చాయి అని ఆయన వ్యాఖ్యానించారు.
 
అంతర్జాతీయ జంతు పక్షి కీటక సర్ప సమాఖ్య ఆనందోత్సాహాలతో పండుగ - Pic 2
చిత్రము 2


Dt : 18-Feb-2020, Upd Dt : 18-Feb-2020 , Category : General
Views : 91 ( + More Social Media views ) ( id : 348 )
Tags : parents , vegetarian , Corona virus , COVID-19

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content