Love at first sight means real love or blind? Valentines/ Lovers day - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,953; 104 తత్వాలు (Tatvaalu) and views 225,630.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే, తొలి చూపు ప్రేమ, గుడ్డి ది అంటారు? వాలెంటైన్స్/ ప్రేమికుల దినం

Love at first sight is real love or blind? To learn the qualities/ Guna / characteristics of a person, is one minute enough?

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే, తొలి చూపు ప్రేమ, గుడ్డి ది అంటారు. ఒక వ్యక్తి గుణాలు / లక్షణాలు తెలుసుకోవడానికి, ఒక్క నిమిషం చాలా?

That is why people should teach children about Ramayana, Mahabharata and Bhagavatam. But we don't have leisure time to teach because of self pit, the elders reply.

అందుకే పిల్లలకు, రామాయణ, మహాభారతాలు, భాగవతాలు చెప్పమంది. కానీ మాకు తీరిక లేదు స్వయం గొయ్యి తో, మేము చెప్పము అని పెద్దలు అంటున్నారు.

If we keep quite, the children are attracted to Western civilization and are taking their pit, along with the pit of their elders. It is definitely the bad culture of elders, negligence and laziness.

మనము గమ్ముగా ఉంటే, పిల్లలు పాశ్చాత్య అనాగరికతకు ఆకర్షితులై, తమ గొయ్యి తాము తీసుకుంటున్నారు, తమ పెద్దల గొయ్యి తో పాటుగా. ఇది ఖచ్చితముగా పెద్దల కుసంస్కారమే, నిర్లక్ష్యం, బద్దకం.

Shakuni, Mandhara, Surpanaka, Dusshasana and Karna were with them and their leaders could not understand that for years, they were digging a pit for themselves. Puthana came with poison under the guise of giving milk to the baby and gave it.

శకుని, మంధర, శూర్పణక, దుశ్శాసన, కర్ణుడు, తమతో ఉండి, తమకే గొయ్యి తీస్తున్నారు అని, వారి నాయకులకు ఏళ్ళు పట్టినా అర్ధం కాలేదు. పూతన పసిపిల్లాడికి పాలు ఇస్తాను అని కపటం గా విషం తో వచ్చింది, ఇచ్చింది.

And how do we understand personality traits in 1 second, hour, day, week, month, year? No, ours is Love at First Night if you say, it's up to you.

మరి మనం 1 సెకండ్, గంట, రోజు, వారం, నెల, ఏడాది లో, ఎలా వ్యక్తి గుణాలను అర్ధం చేసుకుంటాము? అది కాదు, మాది లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటే అది మీ ఇష్టం.

90 percent true, love at first sight is blind. Behind love, if there is good quality, responsibility then only, that is true love, such people do not rush for anything. They do not leave their (older) parents and in-laws. They will be with their cultured children in their old age.

90 శాతం నిజం, తొలి చూపు ప్రేమ గుడ్డి ది. ప్రేమ వెనుక, మంచి గుణం, బాధ్యత ఉంటే మాత్రము, అది కరెక్టే నిజమైన ప్రేమ, అలాంటి వారు తొందరపడరు దేనికీ. తమ (ముదుసలి) తల్లి తండ్రి అత్త మామలను వదలరు. తమ సంస్కార పిల్లల దగ్గర, ముదుసలి తనములో ఉంటారు.

Whether we are in friendship, bond or association, we say it clearly. If ethics and honesty fail, there will be no further word. If you make a mistake, you must admit it and correct it. Hypocrisy, Drama, 2 words, Opportunism are not valid with us.

మనము స్నేహమైనా, బంధమైనా, అనుబంధమైనా స్పష్టముగా చెపుతాము. నీతి నిజాయితీ తప్పితే, తర్వాత మాట కూడా ఉండదు. తప్పు చేస్తే, తప్పకుండా ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. కపటం, నాటకం, 2 నాల్కలు, అవసర అవకాశవాదం మన దగ్గర చెల్లదు.

After forming an opinion first, observing all the qualities for a few months, being good and responsible at home, telling trusted elders or brother/ sister/ uncle, and only then moving forward, publicly in front of everyone.

ముందు ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత, కొన్ని నెలలుగా అన్ని గుణాలు గమనించి, ఇంట్లో మంచి తనం మరియు బాధ్యత గల, విశ్వసనీయత గల పెద్దలు లేదా అన్నలు అక్కలు మావలు తో చెప్పి, ఆ తర్వాత మాత్రమే ముందుకు కదులుతారు, పబ్లిక్ గా అందరి ఎదురుగా.

But in the guise of love, infatuation, lust, and need, without telling anyone, they step into the muddy pit like a thief, in the first greed and foolishness.

కానీ ప్రేమ ముసుగులో, మోహం, వ్యామోహం, కామం, అవసరం ఉన్న వారు, ఎవరికీ చెప్పకుండా, దొంగ చాటుగా, ముందు ఆత్రం అవివేకం లో, బురద గుంటలో కాలుపెడతారు.

First, everyone is lectured that mud is good for health, and then they try to wash it in the street, in the court, on TV, with a headache. Or with that fear and infatuation for the rest of their lives, as captives and slaves, they continue to live, if there is no other way to escape.

ముందు బురద ఆరోగ్యం అని అందరికి ఉపన్యాసాలు ఇచ్చి, అ తర్వాత తలనొప్పి తో కోర్టు లో టీవీలో బజారులో, కడుగుకునే ప్రయత్నం చేస్తారు. లేదా జీవితాంతం ఆ భయము తో వ్యామోహం తో, బంధీలుగా బానిసలు గా, జీవితం కొనసాగిస్తారు, తప్పు కోవడానికి ఇంకో దోవ లేక.

What's more strange is that till the age of 40, those who have sacrificed their blood for love, say to their children, life is important, not love. Because they got own real experience.

ఇంకా విచిత్రం ఏమిటి అంటే, వయస్సు 40 దాకా, ప్రేమ కోసం రక్త తర్పణం చేసిన వారే, మరలా తమ పిల్లలకు మాత్రం, ప్రేమ వద్దు జీవితము ముఖ్యము అంటారు. ఎందుకంటే, వారికి నిజమైన స్వయం అనుభవం వచ్చింది.

However, there are 10 successful people out of every hundred. Because they know responsibility, it's not lust.

అయితే, నూటికి ఓ 10 మంది సక్సెస్ అయిన వారూ ఉంటారు కదా ఎందులో అయినా. ఎందుకంటే వారికి బాధ్యత తెలుసు, అది మోహం కాదు కాబట్టి.

And the marriage made by the elders will also fail, won't it? That is also true because depending on the qualities of the child's elders, are the days of marriage now? Looking at history? No, isn't it?

మరి పెద్దలు చేసిన పెళ్లి కూడా విఫలం అవుతుంది కదా? అంటారా. అది కూడా నిజం ఎందుకంటే, పిల్లల పెద్దల గుణ గణాలను బట్టి, పెళ్లి చేసే రోజులు ఇప్పుడు ఉన్నాయా? చరిత్ర చూస్తున్నారా? లేదు కదా.

If there is family slavery enjoy, if not then debates on TV, half of the property will come, there is a go fund, they say let's catch someone. And the results depend on it.

ఉంటే సేవకుల కాపురం, లేకపోతే టీవీలో డిబేట్లు, సగం ఆస్తి వస్తుంది, గో ఫండ్ ఉంది, ఎవరినో ఒకరిని పట్టేద్దాము అంటున్నారు. మరి ఫలితాలు దాన్ని బట్టే.

Be it millionaires, Bangalore or Delhi or foreign jobs, beauty, assets, reputation, positions, visas, needs are the yardsticks for everyone today. Visa means not just one visa, many like green card, citizenship etc.

కోటీశ్వరులా, బెంగుళూరు లేదా ఢిల్లీ లేదా విదేశీ ఉద్యోగము, అందము, ఆస్తులు, పలుకుబడి, పదవులు, వీసాలు, అవసరాలు మాత్రమే ఈనాడు అందరికి కొలబద్దలు. వీసా అంటే ఒక్క వీసా అనేకాదు, పచ్చ కార్డు, పౌరసత్వము లాంటివి అన్ని.

No one cares about children's minds, natures, values, whether they will be together for ten days, and they do not think it is necessary.

పిల్లల మనసులు, స్వభావాలు, విలువలు, కలసి పది రోజులు ఉంటారా, అన్న విషయం ఎవరికీ పట్టడం లేదు, అవసరము ఉన్నట్టుగా భావించడము లేదు.

That's why everywhere there is no space for love or arranged marriages by elders. Today it is a big business industry. Also for divorce, the courts are not free. Lawyers, police and mediators have their hands full.

అందుకే ఎక్కడ చూసినా ప్రేమ లేక పెద్దల వివాహాలకు, కళ్యాణ మండపాలు ఖాళీ లేవు. నేడు అది ఒక పెద్ద వ్యాపార పరిశ్రమ. అలాగే విడాకులకు, కోర్టులు కూడా ఖాళీగా లేవు. లాయర్లకు, పోలీసులకు, మధ్యవర్తులకు చేతి నిండా పని.

But at the time of separation, only in an elder marriage, at least two family members are present. In a divorce of the same love marriage, they are also absent. No one will come along, because we have not counted anyone.

అయితే విడిపోయేటప్పుడు, పెద్దల వివాహం లో మాత్రము, కనీసం ఇద్దరు కుటుంబ సభ్యులు అయినా తోడుగా ఉంటారు. అదే ప్రేమ వివాహం కు చెందిన విడాకుల లో, అవీ కూడా ఉండవు. ఎవరు కూడా తోడు రారు, ఎందుకంటే మనము ఎవరినీ లెక్క చేయలేదు కాబట్టి.

It is not necessary to think that the responsibility of love and faith, which is not on the parents who have been raised for 25 years, is on the spouse who came in the middle of these days, that is, about those who believe wholeheartedly. Time will clear all illusions and judge accordingly.

25 ఏళ్లుగా పెంచిన తల్లి దండ్రుల మీద లేని ప్రేమ విశ్వాసము బాధ్యత, ఈ రోజు మధ్యలో వచ్చిన జీవిత భాగస్వామి మీద ఉంది అంటే, మనస్పూర్తిగా నమ్మేవారి గురించి, అనుకోవడం అనవసరం. కాలమే అందరి భ్రమలు తొలగించి, తగిన తీర్పు చెపుతుంది.

They say we die for love. And do they die for parents, who gave birth and life support? They say that if they don't buy the phone and laptop, they will kill them also.

ప్రేమ కోసం చస్తాము అంటారు. మరి కని, పోషించిన, అమ్మ నాన్న కోసం, చావరా అంటే? ఫోన్ లాపాటాప్ కొనివ్వకపోతే, వారినే చంపుతాము అంటున్నారు.

Are there any couples who are proud to say that our life partner is virtuous? Because by keeping old parents, in-laws at home, there is no service of a living Guru. Even by their own children, do they get worship with respect at the old age, it is not - they can't say.

మా జీవిత భాగస్వామి గుణవంతులు అని గర్వముగా చెప్పుకునే జంట, ఉన్నారా? ఎందుకంటే ముదుసలి తల్లి దండ్రులు, అత్త మామలు ను ఇంట్లో పెట్టుకుని, సజీవ గురువు సేవ ఉండదు. పోనీ, తమ సొంత పిల్లల దగ్గరైనా, ముదుసలి తనములో గౌరవముగా పూజింపబడతారా చెప్పండీ అంటే, అదీ లేదు.

Today's young men and women, if we ask do you know the meaning of Guna, they say that it means going to the cinema, tour, hotel, recharging the phone, dance, dinner and fun. And do they know about Rama's qualities, they say even our parents don't know that, we know only Vadapappu panakam (prasadam).

నేటి యువతీ యువకులను, గుణం అంటే తెలుసా అంటే, సినిమాకు షికారు హోటల్ కు వెళ్ళడం, ఫోన్ రీచార్జ్, విందు చిందు పొందు నే కదా అంటున్నారు. మరి రాముని గుణాల గురించి తెలుసా అంటే, అవి మా అమ్మ నాన్నలకే తెలీదు, వడపప్పు పానకం మాత్రమే తెలుసు అంటున్నారు.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,953; 104 తత్వాలు (Tatvaalu) and views 225,630
Dt : 14-Feb-2020, Upd Dt : 14-Feb-2020, Category : General
Views : 1092 ( + More Social Media views ), Id : 338 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : love , marriage , arranged , first , sight , relation , sex
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content