కుదురుగా కూర్చోలేక, తల ఊగుతు, నుదురు గడ్డం ఆనించలేక, ఫోటో తొందరగా తీయడం లేదు, కళ్ల లో నీళ్ళు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,633; 104 తత్వాలు (Tatvaalu) and views 224,699.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆ తల్లి దండ్రుల కు డబ్బులు ఇచ్చాం, చాలు లే వాళ్ళే చూసుకుంటారు, అని పెద్దలు ను వదిలేస్తాం. అదే పిల్లలు ఐతే పక్కన ఉండి మరీ, అన్ని చూస్తాం మాకు ప్రేమ అని నటిస్తూ. నిజమైన ప్రేమ అయితే, పెద్దలు చిన్నలూ ఇద్దరు మీదా ఉంటుంది కదా. అది మోహం వ్యామోహం మాత్రమే, కేవలం ఇష్టం లేదా అవసరమైన వారి మీదే ఉంటుంది భ్రమలతో. కానీ ఆ నీటి తెర లాంటి భ్రమ తొలుగుతుంది, ఏనాటికైనా.

మనకు షుగరు వచ్చినప్పుడు, ప్రతి సంవత్సరం కొన్ని పరీక్షలు చేయించాలి, అవసరం లేకపోయినా, ముందు జాగ్రత్తగా.

మొన్న పాదాల పరీక్ష కు వెళితే, కొబ్బరి నూనె రాయమని చెప్పారు కదా. అలాగే పాదం చివర, అంటే గిలక కింద లోపల వైపు, అరుగుదలతో పాదం నిలబడదు. తూలు వస్తుంది. కాబట్టి గట్టి మంచి బూట్లు వేస్తే పట్టు ఇచ్చి, పడకుండా కాపాడుతుంది, బయట నడకలో. చర్మము తెగితే మానదు కాబట్టి, పాద రక్షణకు కూడా ఆ జాగ్రత్తలు ముందే తీసుకున్నావు శభాష్ అన్నారు.

ఇంట్లో కూడా, పడకుండా ఏదో ఒకటి కాళ్ళ కు ఉండాలి, అన్నారు. నడిపించినంత కాలం, ఇబ్బంది లేదు, శరీర రక్త ప్రసరణతో. కానీ ఇక నడవలేను అంటే మాత్రము, మొదలు అవుతాయి, పక్షవాత పరిస్థితులు. బయటవారు లేదా బాధ్యత లేని పిల్లలు ఇవి వింటారా, చూస్తారా, పట్టించుకుంటారా?

నిన్న కళ్ళు డాక్టరు దగ్గరకు కూడా వెళ్ళాము. షుగరు వలన, కళ్ళు లో కూడా చాలా మార్పులు వస్తాయి. కళ్ళు కూడా కనపడకుండా పోతాయి, చివరలో ముదిరితే, ఆపరేషన్ కూడా చేయలేరు.

ఆ కళ్ళు పరికరము మెషిన్ లో తలపెట్టి, కన్ను ఫోటో తీయడానికి, ఓపిక గా అరగంట పైన పట్టింది. పాపం ఆయన ఏమీ అనలేక, చాలా సార్లు ప్రయత్నం చేసారు. కుదురుగా కూర్చోలేక పోతుంది, తల ఊగుతుంది, నుదురు గడ్డం దానిపై ఆనించలేక. ఏం చేయమంటావురా తల నిలబడందే, ఆయనేమో తొందరగా తీయడం లేదు, అని చిన్న పిల్లలా అంటూ ఉంటే, కళ్ల లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి.

చిన్నప్పుడు డాక్టర్ సూది గట్టిగా పొడిచాడు, అని మనం అంటే, అమ్మ సముదాయించినట్టు. నేనున్నా గదమ్మా అని, చుట్టూ వెనక పట్టుకుని శరీరం కదలకుండా, చేతులు తో తల పట్టుకుని ఊగకూండా, ఎలా గోలా అరకొర ఫోటో పూర్తి చేసాము.

ఆ అస్పష్టంగా ఉన్న ఫోటో నుంచే, ఆమె కు శుక్లాలు ఉన్నాయి, అన్నారు ఇంతక ముందు డాక్టర్ కూడా. తొందరలేదు కానీ, షుగర్ ముదిరితే లేదా మనిషి బలహీన పడితే, తర్వాత తొలగించడం కష్టం అన్నారు. అమ్మ ఏమో, నాకు బాగానే ఉంది, ఇలాగే అంటారు లే అంటుంది.

మరి మిగతా తల్లి తండ్రులు గురించి ఆలోచిస్తే, పాపం, ప్రేమతో పట్టించుకునే వారు ఎందరు మనలో? వారు కూడా మనలను చిన్నప్పుడు, ఇలాగే వదిలేస్తే ఎక్కడ ఉండేవాళ్ళం? వాళ్ళ బాధ మొర ఆలకించే వారెవరు ఇప్పుడు?

ఎన్ని రకాలుగా మనము తిట్టినా, ఆ కసాయి పిల్లల రాతి గుండెల్లో కన్నీరు ఉబుకుతుందా? గతం గుర్తు కు వస్తుందా?

రేపు వారు అనుభవించద్దా భాగస్వామి, పిల్లలు వదిలేస్తే? తిరిగే కాల చక్రం ఇది, గిర్రున తిరిగి ఏదోనాటికి, మన దగ్గరకు కూడా వస్తుంది సుమా, ఎవరం తప్పించుకోలేము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,633; 104 తత్వాలు (Tatvaalu) and views 224,699
Dt : 13-Feb-2020, Upd Dt : 13-Feb-2020, Category : General
Views : 1059 ( + More Social Media views ), Id : 335 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old mother doctor exam , bp , diabetics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content