APLatestNews.com top Banner
మాతృ భాష, రుణం, దేశం అనేవి చెప్పుకోడానికి మాత్రమే. పోతే పూజిస్తాం, ఉంటే వదిలేస్తాం - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
స్వదేశం లోని పెద్ద నగరాల్లో లేదా విదేశాల్లో (ఊళ్ళో అయినా అంతే), స్ధిరంగా ఉండే (పాము) పిల్లలు ను అడగండి. మీ కన్న తల్లి దండ్రులు కు, మీకున్న సౌకర్యాలు వైద్యం ప్రేమ తిండి భద్రత వద్దా అని.

బయటకు ఎన్ని అబద్ధాలు చెప్పినా నాటకాలు ఆడినా, ఆత్మ లోన మాత్రం అందరిదీ కమ్మనైన జవాబు ఒకటే -

1. మాలాంటి విశ్వాసం లేని రాక్షసులు దౌర్భాగ్యులను ను, కన్న వారికి, అలాంటి సౌకర్యాలు, ఏనాటికీ మాది లేదా వారి ప్రాణం పోయినా దక్కనీయము. వారి తప్పు కు శిక్షలు ఉండాలి కదా.

2. ధనం సంపాదనలో 60 ఏళ్ల దాకా, వారిని మా అవసరాలకు వాడుకున్నాం, మా దగ్గర ఉంచి పని తో. శక్తి లేనిదేదీ మా కవసరం లేదు కదా ఏ వస్తువు అయినా. ముదుసలి కుక్క లేదా గేదె ను కూడా ఉంచము. మరి మాకు నేర్పినది అంతే.

3. ముదుసలి వారి కోసం, మా పడుచు ఆనందాలు సంతోషం వదులుకోమంటారా. జాలితో ధనం విదిలిస్తే చాలదా, అది కూడా ముష్టి వేయని వారెందరు?

కనీసం పక్షం రోజులు కూడా సంవత్సరం కు, మా పిల్లలు ను, ఆ ముసలి వాసన దగ్గర వదలమే. వాళ్ళ కు పుట్టామని మాకే గుర్తు లేదు, మా పిల్లల కు అవసరమా.

4. ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే నేర్పిందే వాళ్ళు కాదా, మేమూ కొనసాగిస్తాం, తర్వాత తర్వాత తరాలకు.

5. కష్టపడి జావా లేదా టెస్టింగ్ లేదా ఏ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకుంటాం పొట్ట కూటి కోసం. కానీ మాతృభాష టైపు మాత్రం, మాకు ప్రాణం పోయినంత కష్టం.

సత్య ప్రమాణకంగా, సాఫ్ట్వేర్ మీద బతికే, ప్రతి విశ్వసనీయత లేని, నక్క కుక్కల జవాబు కూడా, ఇదే కదా ఎక్కడ చూసినా.

6. మాతృ భాష, మాతృ రుణం, మాతృ దేశం అనేవి గొప్పగా చెప్పుకోడానికి మాత్రమే. అవి పోతే పూజిస్తాం, ఉంటే వాటిని వదిలేస్తాం. డబ్బు తో దేవుణ్ణి కొనే మేము, ఇంత కన్నా ఏమీ చేయలేము, మా నుంచి ఆశించవద్దు.

తెగులు బిడ్డలం భరత మాత మొద్దు బిడ్డలం, ప్రపంచంలో నే ఉత్తమ కృతఘ్నులం. ఓ సునామీ, ఓ కరోనా, ఓ భూకంపం కి మాత్రమే బద్దులం.

అందుకే ఈ సామెత, గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే ఎవరో భుజాలు తడుముకుంటారు అంటా.

మేమూ ఉన్నాము అందులో, ఎన్ని సార్లు, ఎంతమంది చెప్పినా తలకు ఎక్కని వారము కదా మనందరమూ.
 

Dt : 12-Feb-2020, Upd Dt : 12-Feb-2020 , Category : General
Views : 28 ( + More Social Media views ) ( id : 334 )
Tags : old mother at elders home

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content