APLatestNews.com top Banner
మంచి కోరే మనసు లు, దూరంగా ఎక్కడ ఉన్నా, మన సుఖ సంతోషాలను కోరతాయి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మనసు మంచిది అయితే ఊరంతా మన వాళ్ళే. కలసి పోయే మనసు మనకు ఉంటే, అందరూ మన కులపోళ్ళే మన గడపోళ్ళే. అన్నం పెట్టేది మానవత్వం, మంచి తనమే కానీ వర్గము కాదు.

మా అమ్మకు ఉన్న, ఇద్దరు టాబ్లెట్ లో స్కైప్ నేర్పిన మనవరాళ్ళు లో, రెండో మనవరాలి పెళ్లి ఈ రోజు, మా ఊరు కళ్యాణ మండపంలో. స్కైప్ లో, ఏ సమస్య వచ్చినా వెంటనే నవ్వుతూ వచ్చి, అమ్మకు అండగా ఉన్నారు, ఆ అక్కా చెల్లెళ్ళు, ఆనాడు ఆరేడేళ్ళ క్రితం.

మా వీధిలో, చిన్నప్పటి నుంచి తెలిసిన, మా రెడ్డి గారి ఇంట్లో, మేళ తాళాల, విందు వినోదాల, సందడే సందడి ఈరోజు.

పది రోజుల ముందే పెళ్లి కార్డు వాట్సప్ లో పంపితే, అన్ని అడిగి తెలుసుకుని సంతోష పడింది అమ్మ, ధన్యవాదాలు తెలిపాము.

నిన్న మరలా ఏ టైం, ఏమిటి అని మరలా వాకబు వాళ్ళ మీద ప్రేమ తో. వయసు మళ్ళితే మనమూ అంతే నే మో అనిపించింది.

వెళ్ళలేము కదమ్మా, ఎప్పుడు అయితే ఏమిటి అంటే, కాదు మరలా చెప్పు, అని అన్నీ అడిగి, అక్క ది కూడా రాత్రి పెళ్ళే అనుకుని, గతం గుర్తు కు తెచ్చుకుంది, పిచ్చి తల్లి. వాళ్ళ మీద ఎంత అభిమానమో, గతము గుర్తు పెట్టుకుని.

నూతన దంపతులకు అమ్మ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖం గా ఉండాలి, దేవుని చల్లని చూపు తో అని మా ఆకాంక్ష.

మంచి కోరే మనసు లు, దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా, మన సుఖ సంతోషాలను కోరతాయి. అవే దైవ బలాన్ని అందిస్తాయి. మీరంతా బాగుంటే, మేమంతా బాగుంటాము.

-

ఆ రోజుల్లో వాట్సప్ లేదు, స్కెప్ మాత్రమే, అసలు ఇవి అంటే తెలియని వారికి, కొండ గుర్తు లు ఏమిటో తెలుసా.

ఫోన్ తెరమీద అటు ఇటూ లాగాను. బులుగు ఎస్ కనపడింది. దానిని నొక్కాను. మొదటి తెల్ల డబ్బా లో పేరు, రెండో తెల్ల డబ్బా లో పాస్వర్డ్, తర్వాత బులుగు డబ్బా నొక్కాను. గిర గిరా తిరుగుతూ నే ఉంది లేదా తిరిగి తిరిగి నీ పేరు వచ్చింది. వీడియో బొమ్మ నొకాను, నువ్వు కనపడటము లేదు, లేదా కనపడుతున్నావు. కనెక్షన్ లేదు అని కొన్ని సార్లు, ఇంట్లో వైఫై సరిగ్గ రాకపోతే.

ఇవి ఆనాటి స్కైప్ లాగిన్ పాట్లు. అందుకే వాట్సాప్ హిట్ అయింది. ఇలాంటి పాట్లు లేవు. ఒక్క సారి ఫోన్ లో సెట్ చేస్తే మనమూ, మన ఇంట్లో వాళ్ళు అందరూ చూసేయవచ్చు, మన సమాచారం అంతా. కానీ ఇదే తేలికగా ఉంటుంది, కొంపలో నిప్పులు కు కూడా, జాగ్రత్త మరి.
 

Dt : 12-Feb-2020, Upd Dt : 12-Feb-2020 , Category : General
Views : 16 ( + More Social Media views ) ( id : 332 )
Tags : marriage , reception , known kids

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content