APLatestNews.com top Banner
ఏవండి వడ్డీ వ్యాపారం లో నష్టం, జనం కు అంట గడితే తప్పు ఏముంది? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ప్రతి నీతి ధర్మం గల వ్యాపారానికి మూలధనం, వివిధ రకాలుగా వస్తుంది. అందులో భాగస్వాములు, బయట జనం స్నేహితులు తో కలపి, బంధువులు ఉంటారు.

1. భాగస్వామ్యం, ముగ్గురు కలసి కోటి రూపాయల తో వ్యాపారము మొదలు పెడితే, 20 లక్షలు లాభం వస్తే, వీరు ముగ్గురు పంచుకుంటారు. ఈ పెట్టబడి రియల్ ఎస్టేట్ లో పెట్టి, లాభాలు గడిస్తారు. లాభాలు వారే పంచుకుంటారు.

అలాగే నష్టం వస్తే కూడా ఆ ముగ్గురు మాత్రమే పంచుకుంటారు. ఇతర జనాలకు లాభ నష్టాలతో, సంబంధం లేదు. నష్టం పంచితే, వారికి లాభం కూడా పంచాలి.

2. స్నేహితులు లేదా బయట జనం. వీరి దగ్గర నుంచి కూడా సేకరిస్తారు వడ్డీ కి. లాభ నష్టం తో సంబంధం లేకుండా, వారికి వడ్డీ కడతారు, నమ్మక ద్రోహం చేయకుండా.

3. బంధువులు చుట్టాలు, వీరంతా ఆ ముగ్గురు లో ఎవరో ఒకరి పై నమ్మకం తో, బంధుత్వం తో, ధనం వడ్డీ కి ఇస్తారు. ఇక్కడ 2 వ కాటగిరీ కన్నా, ఎక్కువ బంధం బాధ్యత ఉంటుంది.

అవును బంధువులు ల తో జాగ్రత్తగా ఉండాలి ధన వడ్డీ విషయంలో. మన పుట్టు పూర్వోత్తరాలు, మోసాలు, ఆస్తులు, బినామీ లు, గత చరిత్ర అంతా వారికి తెలుసు. అందుకే బంధువులు ధనం సాధారణంగా ఎగ కొట్టే ప్రయత్నం చేయరూ. మరీ చిల్లర ఏరుకునే వారు తప్ప.

మరి వ్యాపారములో, నిజంగా నష్టం ఉంటుందా? మరీ ఉదారముతో అప్పులు ఇస్తే ఏమీ తాకట్టు పెట్టుకోకుండా, నష్టము ఉండవచ్చు , జాగ్రత్తలో ఉంటే నష్టము ఉండక పోవచ్చు.

ఎందుకంటే, ఎక్కువగా వ్యక్తి గత ఆస్తులు పెంచుకొని దాచుకొని మరియు ఇతర వ్యాపారాలలో ధనము పెట్టుబడి పెట్టి, ఈ వ్యాపారం దెబ్బతిందని అబద్ధాలు కూడా చెపుతారు చెప్పవచ్చు.

బయట వారికి ధనం ఇచ్చే ముందు, షూరిటీలు గా స్ధలం ఇళ్ళు బంగారము లేనిదే ఇవ్వరు. వారు తిరిగి డబ్బు కట్టకపోతే, తనఖా పెట్టిన వీటిని రౌడీలు గుండాలు గుమస్తాలతో, బలవంతంగా స్వాధీనం చేసుకుంటారు. దీనినే కాల్మనీ అని, ప్రభుత్వం కొంతమంది ని జైలు లో కూడా పెట్టింది.

ఇది ఒక పెద్ద సాలె గూడు. ఒకసారి ఆ వ్యామోహం లో చిక్కుకున్న తర్వాత, ఇక మరి బయటకు రాలేరు. బాగా ఎదగనూ వచ్చు లేదా అందులోనే పతనం కావచ్చు, మోసము చేసిన, జనం కన్నీళ్ళు శాప నార్ధాలతో.

చీటీ పాటలు కూడా అంతే. ఆ ప్రతినెలా కట్టే 20 మంది లో ఎవరికి శని, రాహు, కేతువు పట్టినా, యజమాని అంటే పాట పెట్టిన వారికీ పట్టింది అన్నట్టే. ఏమి జరిగినా, బాధ్యత యజమానిదే, ఎవరు ఎగకొట్టినా కూడా. అతని మీద నమ్మకముతోనే అందరూ కడుతున్నారు కాబట్టి. ఇవి రెండూ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండానే, ఎక్కువ మంది దొంగచాటుగా నడుపుతున్నారు. వారు బిచాణా ఎత్తివేసినా కూడా, జనము ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి.

నీతి నియమాలు తప్పి, జనం ను ఇబ్బందులు పెట్టిన వారు, ముందు బాగు పడినా, ఆ జనం కన్నీళ్ళు చెమట రక్తం కూడు, పాపాలు శాపాలు, తర తరాలు వదలవు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఆ పాపంలో పడకుండా.
 

Dt : 09-Feb-2020, Upd Dt : 09-Feb-2020 , Category : General
Views : 14 ( + More Social Media views ) ( id : 328 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content