సాత్విక్, తామస్ మాటలు - నోట్ల రద్దు - నల్ల ధనానికి, చీకటి వ్యాపారానికి, మోసపు బతుకులకు పోటు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,821; 104 తత్వాలు (Tatvaalu) and views 224,919.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Discussion of Satvik and Tamas - Demonetization - Problem for black money, dark business, fraudulent lives, vote for note

*సాత్విక్, తామస్ మాటలు - నోట్ల రద్దు - నల్ల ధనానికి, చీకటి వ్యాపారానికి, మోసపు బతుకులకు, ఓటుకు నోటుకు పోటు*

* * * 2019 జనవరి కధనం * * *
సాత్విక్, తామస్ మాట్లాడుకుంటున్నారు 2000 రూపాయల నోటు గురించి, ఉంచుతారా , తీసేస్తారా అని. సాత్విక్ అంటే సాత్వికులు, స్తిర నీతి నిజాయితీ గలవారు. తామస్ అంటే తామసులు/ రజోగుణులు - అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు - 2 నాల్కలు, కపటం, చంచలం.

** సాత్విక్ - నాకు నష్టం లేదు, నా డబ్బులు బాంక్ లో ఉన్నాయి. అన్నిటికీ ఏటియం కార్డులు, పేటీఎమ్ ఫోన్ పే ఇతర ఆన్లైన సేవలు వాడుతుంటా, నీతిగా టాక్స్ కడతా. ఓ లక్ష దాకా కాష్ ఉన్నా మార్చుకోవడం కష్టం కాదు. మామూలు మధ్య తరగతి వాడికి ఇది ఇబ్బంది కాదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ నెట్ ఉంది, టెక్నాలజీ తో. ఆఖరికి పని అమ్మాయి, ఇస్తిరీ బండి, కూరల షాప్ దగ్గర కూడా ఫోన్ పేమెంట్ ఉంది. అంగన్ వాడీలలో కూడా వాడుతున్నారు. అంతా వాట్సాప్ లో నే నడుస్తోంది, అని అన్నాడు. మోడీ, బాబూ కూడా ఇదే చెప్పారు, అన్నాడు.

దొంగ నోట్లు గుర్తు పట్ట లేము. నోట్లు లేక పొతే ఇంటి దొంగలుకు, పాక్ లాంటి బయట దొంగలకు ఉద్యోగాలు పొతాయి, దొంగ నోట్లు పని లేక. అవినీతి, ఓటు కొనడం/ అమ్మటము, బినామీల పని తక్కువ, భుములు కొనడం/ అమ్మటము తగ్గుతుందేమొ, చెడుపనులకు సుపారీ ఇవ్వడము తగ్గుతుంది, మన బతుకులు బాగు పడుతాయెమో మంచి నాయకులు వచ్చి, అన్నాడు.

** తామస్ - మాకు వడ్డీ, భూఅమ్మకాలు భూ దందాలు, చీటీ లేదా ఫైనాన్స్/ కాష్ తో నడిచే వ్యాపారం ఉంది. మా స్నేహితులు కు కూడా వేరు వేరు వ్యాపారాలు ఉన్నాయి. టాక్స్ కట్టం లేదా తక్కువ కడతాం, చాటు చీకటి వ్యాపారాలు/ వ్యవహారాలు ఎక్కువ , అన్నీ కాష్ తో నే అయిపోతాయి, లాభం కానీ రిస్క్ అని.

మరి ముందే జాగ్రత్తగా ఉండాలి, మొన్న నోటు రద్దు చూసాక కూడా మారరా అని అడిగాడు సాత్విక్ నవ్వుతూ. మొన్నే కదా మీ అమెరికా చుట్టం కూడా చెప్పారు, చేతులో చిల్లర కూడా ఉండదు అంతా గీకుడే అని.

అమెరికా లో నోటు రద్దు అంటే ఎవరూ పట్టించుకోరు పెద్ద దొంగలు తప్ప. మరి అమెరికా లాగా మనం ఎదగాలని అంటారు, మరి చాటు మాటు వ్యవహారాలు, అవినీతి తగ్గకుండా, అభివృద్ధి అంటే ఎలా.

పెళ్లికి డబ్బులు తెస్తూ ఉంటే పోయింది బాంక్ దగ్గర, పెళ్లి ఆగింది. బస్సు దోపిడీ, రైలు, ఇల్లు దోపిడీ లు, హత్యలు, మోసాలు, హవాలా తగ్గవా, డబ్బు చేతిలో మరియు ఇంట్లో ఉండకపోతే. వాట్సాప్ వాడటం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది ఏమిటి సమచారం లేదా టెక్నాలజీ పెరిగాక? మనకు తెలీకపోతే మన పిల్లలు బంధువులు స్నేహితులు సహాయం చెయ్యరా నేర్పరా ఎలా వాడాలో, అన్నాడు సాత్విక్.

తామస్, మరి దానికి టాక్స్, ఏదో కంపెనీ కి లాభం అంటా అన్నాడు. విదేశాల్లో ఎప్పుడు నుంచో ఉంది, మనకు తప్ప. మనకు గీకుడు వల్ల 50 లాభాలు, రక్షణ, నీతి. నష్టాలు 10 ఉండవచ్చు, కానీ లాభాలు ఎక్కువ.

ఇకనైనా మారదాం, అన్ని పనులు, కొనడం, అమ్మడం, వ్యాపారం, ప్రభుత్వం కి తెలిసేటట్టు చేద్దాం, మోస పోవడం లేదా మోసం చెయ్యడం తగ్గిద్దాం. టాక్స్ కడదాం, మనకు రావాల్సిన అభివృద్ధి ని గట్టిగా అడిగే హక్కు, ఆవుకు ఓటు వేసి సంపాదిద్దాం. చెడ్డ విషయాలలో పాశ్చాత్య దేశాల ను అనుసరించే మనం, మంచి విషయం లో ఎందుకు పాటించము మిత్రమా అన్నాడు.

పేపర్ చూస్తే నీకు కొత్త విషయాలు తెలుస్తాయి, మనము ఎంత ఎదిగామో. డెబిట్/ క్రెడిట్/ ఏటీయెం కార్డు లే డూప్లికేట్ చేస్తున్నారు, సమచారం లాగేస్తున్నారు, జాగ్రత్త గా వాడాలి. ఇంకా డబ్బులు లెక్కెట్టాలి, చినిగే నోట్లు అంటావు అని అన్నాడు సాత్విక్ నవ్వుతూ. అంతే కాదు, ఓటుకు నోటు కు చూసాక, అంతా ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ లే.

ఇంకోటి మనకు ప్రతి శనివారం పంపే సజీవ గురువు సేవ కుని, వాట్సాప్ స్టేటస్ కూడా, రోజూ చూద్దాము, ఎన్నో కొత్త విషయాలు బోధనలు ప్రాపంచిక మరియు ఆధ్యాత్మికముగా ఆచరిస్తూ, సుమా. ఉత్తుత్తి పై మాటలు చెప్పేవారు 80 శాతం మంది, కాని చేతలలో చేసే వారు ఎంత మంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,821; 104 తత్వాలు (Tatvaalu) and views 224,919
Dt : 03-Jan-2019, Upd Dt : 19-May-2023, Category : General
Views : 1383 ( + More Social Media views ), Id : 32 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : demonetisation , problem , people , Arishadvarg , control , devotees , parents , service , Sanskara , children , 2000 , note , RBI
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content