APLatestNews.com top Banner
శీనయ్య తో , శివయ్య తో , శనయ్య తో మాటలు నిజమేనా, అబద్దమా? - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

శీనయ్య తో , శివయ్య తో , శనయ్య తో మాటలు అంటారు. నిజమేనా, అబద్దమా?

ఇందులో అబద్దము అవసరము ఏముంది. మన మనసులో మలినాలు ఉంటే, మనల్ని దేవునికి దూరంగా ఉంచుతాయి. లేదంటే ఇంట్లో అయినా గుడిలో అయినా, దేవుడు మనల్ని పలకరిస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా భావించుకోవడములో తప్పేమి ఉంది చెప్పండి.

మనము పూజ చేసే విధానము ఒక్కసారి చూడండి, ఉదాహరణకు వినాయక లేదా బాబా వ్రత కల్పం. అందులో ఆవాహయామి, స్థాపయామి, పూజ యామి అంటారు, అర్ధము తెలుసా. దేవుని ఆహ్వానించి, కూర్చోబెట్టి, పూజ చేస్తున్నట్టుగా భావన. ఇంకోసారి పుస్తకము చదివి చూడండి. అబద్దము అనగలమా?

అలాగే చర్చిలో కూడా, రొట్టె, ద్రాక్ష రసము ఇచ్చి, ప్రభువు శరీరము మరియు రక్తము గా భావించి తీసుకోమంటారు. అబద్దము అనగలమా?

మనకు నిశ్చలమైన మనసు ఉండి, సమతా స్థితి ఉంటే, మోహం లేకుంటే, మాయ కు దూరం గా ఉంటే , అది పెద్ద కష్టము కాదు. గీత లోనే చెప్పారు, అది అంత తేలిక కూడా కాదు, బ్రహ్మ ముహుర్తం , ఎన్నో రొజుల శ్రమ, మానసిక పూజ, యోగం, ధ్యానం , సాత్విక గుణం, నష్టము లాభము ఒకటే అనుకునే ధైర్యం ఉండాలి.

అవమానము పొగడ్తా ఒకటే. తల్లి దండ్రుల దీవెన ఉండాలి, భగవద్ గీత సారాంశము అర్ధమై ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, అరిషడ్వర్గాలను జయించాలి. మీరు ప్రయత్నం చేయండి.

ఉదాహరణకు, మా ఇంటి ముందు, చదువుకున్న ఒకాయన స్కూటర్ పెట్టి, ఎదురు ఇంటికి లేదా పక్క కొట్టుకి వెళ్ళాడు. నేను కెమేరాలో చూస్తూ నవ్వు కుంటాను. ఎందుకంటే, మా ఇంటి గోడకి, ఎర్రటి అక్షరాలతో తెలుగు ఆంగ్లం లో , నో పార్కింగ్ బోర్డ్, కెమేరాలు ఉన్నాయి జాగ్రత్త బోర్డ్, సి సి టీవి లు వైర్లు అన్ని ఉన్నాయి.

అతను సరిగ్గా మనసు పెట్టి, బుద్ది పెట్టి చూస్తే కనపడతాయి. కాని చూస్తాడా? తెలివి లేదా? చదువు రాదా? అన్ని ఉన్నాయి, మనసు లేదు, అంతేనా? ఎవరూ చూడటము లేదు అనుకుంటాడు, నేను చూస్తున్నా కూడా. అక్కడ ఉన్న వాళ్ళు తప్పు అని చెపుతారా, లేదు వారు మోహం లోనే ఉన్నారు.అదే మాయ, మోహం, అజ్ఞానం. అంతే.

భగవంతుడు అంతే, మనలను చూసి నవ్వుకుంటాడు మన అజ్ఞానానికి. ఎదురుగా ఉన్నా నన్ను చూడరే, పట్టించుకోరే అని. మన నైవేద్యాలు ఆడంబరాలు కాదు ఆయనకి కావలసింది, మన నిర్మలమైన నిశ్చలమైన అదుపులో ఉన్న మనస్సు.

అంత సులభుడు ఆయన. కోతి లాంటి మన మనసును, అదుపులో పెట్టడము ఎంత కష్టము అంటే, నిజాయితీగా 50 లక్షలు సంపాదించాలి అంటే ఎంత కష్టమో అంత. అందుకే డబ్బు లేదా విషయవాసనలు వ్యామోహము లో ఉన్న వారికి, దూరము గా ఉంటాడు.

కోటీశ్వరుడు ఈ జన్మలోనే, వచ్చే జన్మ కి ఏమీ తీసుకెళ్ళడు పాప ఫలితం తప్ప, మరలా రూపాయతో మొదలు, అదే పరుగు. అదే ఆధ్యాత్మికం , నిన్ను ఇక్కడే, ఇప్పుడే, కష్టాలు నష్టాలు పెట్టి, రుణ విముక్తిడిని చేసి, తర్వాత జన్మ లేకుండా లేదా, మంచి ఆధ్యాత్మిక వారి ఇంట పుట్టించి, మిగతా కర్మ ఫలాన్ని పూర్తి చేయిస్తుంది.

మా ఊరిలో, నా వేషధారణా , చెప్పులు , తెలుగు చూసి, ఆటో వాడు(ఎవరూ) కూడా, నన్ను నమ్మడము లేదు, నేను ఎక్కడ ఉంటానో చెపితే. అంతెందుకు ఇక్కడ కూడా, నమ్మడము లేదు 20 ఏళ్ళు గా ఉన్నా అంటే. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా, మనం మారకూడదు, చుట్టు మారుతున్న మాయా ప్రపంచాన్ని గమనించి నవ్వుతూ జాగ్రత్త పడాలి. సాత్విక గుణం కోసం రోజూ సాధన చెయ్యాలి, లేకపోతే, రోజూ కడగని నోరు లా కంపు కొడుతుంది రాజస/తమో గుణాలతో.
 
Dt : 02-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : Devotional, Views : 255 ( id : 30 )
Tags : sani , sivayya , seenayya

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =