3 రాజధానుల సిద్దాంతము, జిల్లాల విభజన లో అమలు? కలెక్టర్ ఆఫీసు శాఖలు ఆసుపత్రి కోర్ట్ వేరు ప్రాంతాలలో? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,518; 104 తత్వాలు (Tatvaalu) and views 226,003.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

3 రాజధానుల సిద్దాంతము, జిల్లాల విభజన లో అమలు చేస్తారా? కలెక్టర్ ఆఫీసు శాఖలు ఆసుపత్రి కోర్ట్ వేరు వేరు ప్రాంతాలలో ఉంటాయా?

జగనన్న రాష్ట్రములో అభివ్రుద్ది పేరుతో, 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నాము, అన్ని ప్రాంతాలు సమముగా అభివ్రుద్ది చెందాలి, అని చెప్పి ముందుకు సాగుతున్నారు.

మరి రాష్ట్రములో ఉన్న అన్ని జిల్లా ల విభజన విషయములో, అదే అభివ్రుద్ది సూత్రము పాటిస్తున్నామా? పాటిస్తే, మంచిది, అని మన వైసీపీ కార్యకర్తల మరియు అస్సెంబ్లీ నియోజకవర్గ ప్రజల అభిప్రాయము.

కర్నూల్, అమరావతి, వైజాగ్ లాగా? అందరికీ అభివ్రుద్ది ఫలాలు అందుతాయి అని ప్రజల నమ్మకము. అన్ని జిల్లాలకు వర్తిస్తుంది.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకచోట, జ్యుడీషియల్ క్యాపిటల్ మరో చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ మరో చోట ఏర్పాటు చేశారు కదా, అలాగే జిల్లాలలో ఉంటే బాగుంటుంది అని అందరి భావన.

జిల్లా కేంద్రములో అన్ని ఒకేచోట ఉంటే, మిగతా ప్రాంతాలు అభివ్రుద్ది చెందవు. కోర్ట్ ఒక చోట, ఆసుపత్రి ఒకచోట, కలెక్టరేట్ ఒక చోట, మిగతా శాఖలు ఇంకో చోట ఉండాలి. మన జగనన్న ఆలోచన మనందరము పాటించాలి కదా.

ఉదాహరణకు బాపట్ల పార్లమెంట్ పరిధి తీసుకుందాము, మాప్ చూడండి. మీరు బాపట్ల లేదా చీరాల జిల్లా గా చేసినా, అందులో సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, బాపట్ల, పర్చూరు, రెపల్లే, వేమూరు ఉన్నాయి కదా. అందరికీ తలా ఒక శాఖ పెడితే, సరిపోతుంది ఏమో కదా? అంటున్నారు.

దయచేసి, జిల్లా కలెక్టర్ ల కు మరియు అధికారులకు, ఈ విషయము వెంటనే తెలియచేయండి. వారు జగనన్నకు ప్రభుత్వము తరపున ఇదే మనవి చేసి ఉంటారు, బహుశా ఇదే దోవలో చేస్తూ ఉంటారు, అని కొందరు ఆశపడుతున్నారు.

మరి రెవెన్యూ విద్యా పంచాయతీ లాంటి జిల్లా శాఖలు, కలెక్టర్ ఆఫీసు, జిల్లా ఆసుపత్రి, జిల్లా కోర్ట్ లు వివిధ ప్రాంతాలలో పెడితే, అందరికి అభివ్రుద్ది సాధ్యమని, పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరి మీ నాయకులు అధికారుల తో మాట్లాడండి, జగనన్న ఆశయము గుర్తు చేయండి, అభివృద్ధి అందుకోండి.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,518; 104 తత్వాలు (Tatvaalu) and views 226,003
Dt : 07-Nov-2020, Upd Dt : 07-Nov-2020, Category : Politics
Views : 815 ( + More Social Media views ), Id : 799 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 3 capital theory , implement , division- , districts , collector office , dept , court , separate areas , bapatla , chirala , assembly
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content