పంచ భూతాల ముందు నల్లులం, గోడ మీద పిల్లులం - తల్లి దండ్రులను వదిలేసిన వారిపై ఆక్రోశం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,522; 104 తత్వాలు (Tatvaalu) and views 224,971.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అమ్మకు ఆది వారము రాత్రి 7 నుంచి, వర్టికో జబ్బు మరలా వచ్చింది. అంటే తల తిరుగుతూ, కూల బడి పోతారు అన్న మాట. మంచం మీద లెగిచి కూర్చోలేరు, అంటే నడవలేరు కదా.

రాత్రి అంతా మంచం మీదే, లెగవ లేరు. తల్లి చీర మార్చుకుంటుంది అంటే నే, అటువైపు వెళ్ళం. మరి అన్ని మంచం మీదే ఒకటి రెండు పట్టి తీయాలి అంటే, మగ పిల్లవాడు? దేవుని పరీక్షలు కు అంతు చివర ఉండదేమో, ఏమి చేయదల్చుకున్నారో చూద్దాం.

రెండేళ్ల లో నాలుగవ సారి అనుకుంటా. మొదటి సారి, కంగారు గా ఎమర్జెన్సీ కి వెళ్ళాము. కానీ తర్వాత, ప్రాణాపాయం కాదు, బిళ్ళలు వాడమంటే వాడుతున్నాము.

రెండు రోజులు అలా జీవచ్చవం లా మంచం మీద ఉండాలి, లేదా రెండు రెక్కలు పట్టుకుని మోస్తూ తీసుకుని వెళ్ళాలి. నేను తోడుగా ఉండి, బాధ్యత కృతజ్ఞత మానవత్వం ఉంది కాబట్టి సరిపోతుంది. బయట వారు అలా చూడగలరా చేయగలరా, 6 ఏళ్ళు విదేశములో?

డబ్బు విదిల్చి, తల్లి దండ్రిని వదిలేసి, హయిగా బతుకు తున్న వారిని అడగండి, ఈ పరిస్థితి రాదా మనకు అని? వారు మాకు డబ్బు ఉంది, మా పిల్లలు చూడకపోయినా బతుకు తాము, ఇన్సూరెన్స్, బలగం ఉంది అని కోతలు కోస్తారు, ఆ సమయం వచ్చిందాకా. వచ్చిన తర్వాత, వినే వాడు ఉండరు, సరిచేసుకునే దోవ ఉండదు.

ఇంతకుముందే అనుకున్నాము, 6 ఏళ్ల పిల్లకి 60 ఏళ్ల తల్లి(తండ్రి) కి కావలసింది, ధైర్యాన్ని ఇచ్చి ప్రేమ తో నిమిరే చెయ్యి, ధనం బలగం కాదు. 60 లలో లేదా జబ్బులలో ఉన్న, ఇలా వదిలేసిన అందరి తల్లి దండ్రుల పరిస్తితి, ఎలా ఉంటుందో కదా దేవా.

కర్మ ఫలితాలు విడువవు, జాగ్రత్తలు సుమా.


74 ఏళ్ల బీపీ షుగర్ ఉన్న అమ్మ, వర్టికో బిళ్ల ల దెబ్బకి, రెండేళ్ల పసిపాపలా ముడుచుకొని, గురక పెట్టి నిద్ర పోతుంటే, ఆ దేవుని కైనా జాలి కన్నీళ్లు వస్తాయేమో, మన లాంటి మ్రుగాలు కరుగవు కదా. ఎంత నష్టపోయినా తల్లి ని వదలను, దేవుడే ఆదుకుంటాడో రోడ్డు న వేస్తాడో చూద్దాం.

కానీ ఆస్తుల కోసం, అంటే మాంసం ముక్క కోసం బజారు కుక్కలు లా రోడ్డు మీద పడి లేదా చాటుగా యాగీ చేసే పిల్లలు ద్రోహులు నీచులు మానవత్వం కృతజ్ఞతలు మరచిన మృగాలు, మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.

అందులోనే మనమూ ఉన్నాము. పాపం ఎక్కడో పెరుగుతుంది అంటాము ప్రతీసారి, మన నట్టింట్లో పెట్టుకుని.

ఆస్తి భాగం తీసుకున్న ప్రతి జాతి వర్గము కుక్క కి, తల్లి పాలు తాగి మరచిన బురద పందులకు, బొడ్డు కోసిన క్షణమే మరచే గుణం ఉన్న దున్న పోతులకు, తమ తల్లి దండ్రుల ను ముసలి తనం లో, ఇంట్లో ఉంచి చూడాలి అన్న ఆలోచన ఇంగిత జ్ఞానం ఉండదా?

నారాయణా, పాపం శమించుగాక


అలాంటి కృతజ్ఞతలు లేని, బురద పందుల వలన లేదా వారి సంతానం వలన, కన్న తల్లి దండ్రులు కు, దేశానికి, ఊరుకు, లోకానికి, దేవుని కి ఉపయోగం ఏముంది? అలాంటి వారి పూజ, పునస్కారాలు, దానం వలన ఉపయోగం ఏముంది? కలియుగ పాప భారం రెట్టింపు పెంచడం తప్ప.

అందుకే గదా ఈ ఎబోలా కొరొనా వైరస్ లు, భూకంపాలు, సునామీ లు, యాక్సిడెంట్లు. మనుషులు మారనప్పుడు పంచ భూతాలే ఫలితాలు చూపిస్తాయి, మానవ సమాజము మొత్తాన్ని మారుస్తాయి.


పుట్టగానే పడుచు తల్లి దండ్రులు ఉండాలి మన సేవ కోసం. మద మెక్కాక, పడుచు జీవిత భాగస్వామి ఉండాలి, మన సేవ, సేద, మన లాంటి ద్రోహులను పునరుత్పత్తి కోసం.

మరి వారికి జబ్బు చేస్తే ముసలి తనం వస్తే, వయసు లో ఉన్న పిల్లల కోసం తపన ఆరాటము అని అబద్ధాలు చెపుతాం నిక్రుష్ట దౌర్భాగ్యులు లా.

మరి ఇంతకాలం సేవ చేసిన అన్ని పోగొట్టుకుని, మన లాంటి త్రాష్టులను కన్న, తల్లి దండ్రులు పరిస్థితి ఏమిటి? విష పాములు లాంటి పాపాత్ములు ను కని పెంచి పోషించిన, మనము పెంచిన వారి నే కదా, మోసం ద్రోహం చేసి కాటు వేసేది.

మన ఇళ్ళలో ఇలాగే మనం కొనసాగుతున్న, కృతఘ్నత తో గతం మరచి, భూదేవే ఒక్క సారి నేలన తిరిగేసి మడతేసి, దున్ని నట్లు సేద్యము చేసినట్లు, సముద్ర జలౌము ను ఇక్కడ కు తెచ్చి, సముద్రం కింద ఉన్న పవిత్ర మైన నేలను బయటకు తెస్తుంది.

అప్పుడప్పుడు అడవుల్లో మంటలు, మొన్న కాలిఫోర్నియా లేదా ఆస్ట్రేలియా లో వచ్చి ఇళ్ళను పశు సంపదను తగలబెడుతున్నా కూడా, సజ్ఞలు ఇస్తున్నా కూడా, మనము మన బుద్దులు మారము, ఎందుకంటే మనమూ ఆహుతై కొత్త జాతి రావాలి కాబట్టి.

లేదా సూర్యుడే తనలోని ఒకే ఒక చిన్న ముక్క ను, మనకు దానం గా బహుమతిగా కానుక వేస్తాడు, క్షణములో మసి అయి కూర్చుంటాము.

ఆకాశం ఆగ్రహిస్తే పాలపుంతలో ఎక్కడో ఉన్న, రాళ్ళు పలకలు అంటే ఆస్టరాయిడ్ లు వచ్చి, ముద్దాడితే చాలు, నీచ నిక్రుష్ట తల్లి లేదా భూమి ద్రోహులు ఎవరూ మిగలరు.

పంచ భూతాల ముందు నల్లులము, జనం ముందు గోడ మీద పిల్లుల ము, మనదీ ఒక బతుకే, మనకూ ఒక స్టేటస్ హోదా మర్యాద, అవ్వ.

తుమ్మితే పోయే ప్రాణం, రేపు లెగుస్తామో లేదో గారంటీ లేదు, తూ మనవీ ఒక దరిద్రపు బతుకులే.

బాధ ఆవేదన ఆక్రోశం, ఇతర తల్లులను లేదా తండ్రులను దుస్థితిని తలచుకుంటే, మన లాంటి గోపీ ల చేతుల్లో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,522; 104 తత్వాలు (Tatvaalu) and views 224,971
Dt : 27-Jan-2020, Upd Dt : 27-Jan-2020, Category : General
Views : 1048 ( + More Social Media views ), Id : 295 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old parents , old patients , care our parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content