APLatestNews.com top Banner
         
విగ్రహారాధన సరియైన విధానం అవునా, కాదా? అందులో మర్మము ఏమిటి? - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
విగ్రహారాధన గురించి చాలామందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఒక్క మాటలో
జవాబు, అవును మరియు కాదు. ఎందుకో వివరముగ తెలుసుకుందాము. తర్వాత, మీరే నిర్ణయించుకొనవచ్చు.

వేదాలలో, అత్యున్నత మార్గమైన భగవంతుని ధ్యానాన్ని చెప్పారు, ఆత్మ జ్ణానం కోసం. అంటే, మనసులో నిరంతరము భగవంతుని తలచడము. అతను ఒక్కడే, నిరాకారుడు, నిరంజనుడు, ప్రపంచము అంతా వ్యాపించినవాడు.

శివుని చిత్రపటం చూసారా, ఎప్పుడూ ధ్యానం లో ఉంటారు. విష్ణువు ని గమనించారా, ఎప్పుడూ యోగ నిద్ర లో ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ కు కూడా ధ్యానమే. ఆంజనేయ స్వామి కూర్చున్న చిత్రపటం చూడండి, ఎప్పుడూ రామ ధ్యానం లో ఉంటారు. షిర్డి సాయిబాబా కూడా ధ్యానంలో ఉంటారు, గురు క్రుప కోసం ధ్యానం చేసారు.

మునులు అందరూ, తపస్సు లో ఉంటారు. ఇది చదువుకున్న వారికి, పండితులకు, గ్రంధాలు చదివే వారికి అర్ధము అవుతుంది. కాని వారికి కూడా, ఆచరణలో ధ్యానం కష్టము అవుతుంది.

మరి అలాంటిది, చదువు రాని వారికి, దేవుడు ఉన్నాడు ధ్యానం చేయమని చెపితే, ఏమంటారు వెంటనే? ఎక్కడ ఉన్నారు? ఎలా ఉంటారు? అని అడుగుతారు. పిల్లలు కూడా అదే ప్రశ్న వేస్తారు. చిలుక బాగా పాడుతుంది అంటే, చిలుక ఏదీ చూపించు అంటారు.

కాబట్టి, మొదట గా దేవుని వైపు మనసు మరల్చటానికి గుడి, విగ్రహాలు, దీపారాధన , పూజ, పునస్కారాలు చెప్పబడినవి. మనసు నిగ్రహం, ఏకాగ్రత రావాలి అంటే, సాధన చేయాలి, అంటే తప్పనిసరిగా విగ్రహం కావలి. ముందు, ఇంటి దీపారాధన పూజలతో మొదలు పెట్టి, క్రమముగా మనసును భగవంతుని పై స్తిరీకరించి, నెమ్మదిగా జపము, ధ్యానం లోకి మరలాలి, భగవంతుని మనలోనే వెతకాలి.

గీత లో కూడా చెప్పింది అదే, బ్రూమధ్యమున ఏకాగ్రత తో ధ్యానించిన పరమాత్మను పొందగలము. కోటి మంది ప్రయత్నిస్తే, ఒక్కరు మాత్రమే నన్ను తెలుసుకోగలరు, అన్నారు. దానికి చాలా సాధన కావాలి, కొంతమందికి జన్మ జన్మలు పడుతుంది.

కాబట్టి, ఇంటి పూజలతో మొదలు పెట్టి, ధ్యానం వైపు రావాలి క్రమము గా. మరి మనము ఏమి చేస్తున్నాము? పూజలతోనే, ఉత్సవాలు, ఊరేగింపులు , భౌతిక నైవేద్యాల తోనే, జీవితం ముగిస్తున్నాము చివరి దాకా.

చిన్న పిల్లాడికి నడవమని బండి ఇస్తాము చిన్నప్పుడు, నడక వచ్చాక దానిని వదిలి, సొంతము గా నడవాలి. అలా కాకుండా ఎప్పుడు దానిని పట్టుకుని నడిస్తే సమర్ధిస్తామా? ఆనంద పడతామా? తప్పు అని చెప్పమా?

అలాగే మన పిల్ల వాడు, 10 వ తరగతి లో నే జీవితాంతము ఉంటే, ఇంకా పై చదువులు ఎప్పుడు? అది తప్పు అని చెప్పమా? మీరే చెప్పండి, ఎంత కాలము విగ్రహారాధన చేయాలి? ఎప్పుడు మనము ధ్యానానికి వస్తాము?

ఒక ధనికుడు కోటి రుపాయలతో యాగము చేయించి, లక్ష మందికి అన్నము పెట్టించి, పూజ చేయటానికి అయినా సిద్దపడతాడు అనుకుందాం. కానీ అతనే, అరగంట తనలో తాను చూసుకుంటూ, ధ్యానం చేయమంటే మాత్రం, అల్లాడి పోతాడు తన వల్ల కాదు.

ఎందుకంటే, కళ్ళు మూసుకుంటే ఆ చీకటిలో, తన తప్పులు మోసాలు ద్రోహాలు అన్నీ, తన కళ్ళ ముందు చిత్రాలుగా తిరుగుతాయి. తను కూర్చో లేడు ధ్యానం చేయలేడు. మరి ప్రయోజనము ఏమిటి? కోతి లాంటి మనసును నియంత్రించలేక పోతే.

పోనీ వాటినుంచి తప్పించుకుంటాడా, అదీ లేదు. రోగముతో మంచమెక్కినపుడు లేదా చివరలో, ఇంట్లో వాళ్ళ దెప్పుడు మాటలతో నరకయాతన పడుతూ, మదిలో గతాన్ని మొత్తము సినిమా చూస్తాడు. ఇన్నాళ్ళు భగవంతుని చేరలేక పోయాను, కాలం వ్రుధా చేసాను అవకాశం ఉండి అని విలపిస్తాడు. చివర నిమిషములో, అదే మనో వ్యధతో మరణించి, పాప ఫలితం కోసం దరిద్రమైన జీవితం పొందుతాడు అని అంటారు.

కొత్తగా పిల్లవాడు పుడితే, ఆ (నాటి)తల్లి ప్రతి క్షణం, ఆ బిడ్డకు ఏమి కావాలని నిరంతరము, తపనపడుతూ ఆలోచన చేస్తుందో, అదీ ఒక రకంగా ధ్యానమే. ఎన్ని పనులు చేస్తున్నా, మనసు పిల్లాడి వైపు ఉంటుంది. మరి భగవంతుని కోసం, అలా మనము తపన తపనపడాలి.

నేటి తల్లి దయతో 50 శాతం పిల్లాడి మీద, మిగతా 50 శాతం స్నేహితులు, సోషల్ మీడియా , టీవీ కి మరియు ఫోన్ కి. సమ న్యాయం చేస్తున్నది అత్త అమ్మల సహకారంతో, తప్పనిసరి పరిస్తితిలో, మాత్రు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ. అది వేరే విషయం.

మన పెద్ద స్వాములే / దేవుళ్ళే ధ్యానం చేస్తుంటే, మరి మనము ఎన్ని జన్మలకు భౌతిక పూజలు వదలి, అక్కడ దాకా వచ్చేది? వారి భక్తులు గా, మరి ఈ విషయము లో వారిని అనుసరించమా? చిన్నప్పటి నుంచి లేని అలవాటు, 50 ఏళ్ళ తర్వాత, కీళ్ళు కదలని పరిస్తితి లో చేయగలమా? ఆలోచన చెయ్యండి. 50 ఏళ్ళు, బండ బారిన మనసు మాట వింటుందా?

అట్లాగని పని మానేసి, ధ్యానం చేయమని కాదు. ప్రతి పని లోను దైవాన్ని చూడు, వీలైనప్పుడు ప్రతి క్షణం, దైవ నామస్మరణ చేయాలి. ఖాళీ ఉన్నప్పుడు ధ్యానం చేయాలి.

జప తప ధ్యానముతో శివయ్య ను పొంది కూడా, రాక్షశ రాజు రావణుడు, నిత్య పూజ తో, సాధన చేస్తూనే ఉన్నాడు చివరిదాక. ఎందుకంటే మనసు చంచలము, దానికి సారధిగా మాధవుడు ఉంటే, బాగుపడుతుంది.

ఇంట్లో నిత్య పూజ ఉండాలి సాధన కోసం, దానితో మొదలు పెట్టి, క్రమము గా జపం చేస్తూ, ధ్యానం మరియు తపము లోకి, కొంత వరకు అన్న వచ్చే ప్రయత్నం చేయాలి. వేమన గారి పద్యం చూడండి :

అడవి దిరుగ జిక్క దాకసమునలేదు అవని తీర్ధయాత్రలందు లేదు
ఒడలు శుధ్ధిచేసి ఒడయని చూడరా విశ్వదాభిరామ వినుర వేమ
భావం - అడవిలో తిరిగినా, ఆకాశంలో చూచినా, తీర్ధయాత్రలు చెసినా శివుడు దొరకడు. శరీరాన్ని మనస్సును శుద్ధిచేసి అందులోనే పరమాత్మను చూడాలి.

విగ్రహారాధన సరియైన విధానం అవునా, కాదా? అందులో మర్మము ఏమిటి? - Pic 2

విగ్రహారాధన సరియైన విధానం అవునా, కాదా? అందులో మర్మము ఏమిటి? - Pic 3

Dt : 16-Jul-2019, Upd Dt : 09-Aug-2019 , Category : Devotional, Views : 178 ( id : 29 )
Tags : vigraharadhana , dhyanam , traditional puja , idol worship
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content