APLatestNews.com top Banner
మకర సంక్రమణం - భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు - ఆరోగ్య పూజ కబుర్లు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అమెరికా కాలీఫోర్నియా ఆలయం వారి పంచాగము ప్రకారం, 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. తూర్పున వాషింగ్టన్ డీసీ కూడా, 3 గంటలు వెనుకే కాబట్టి, ఇదే లెక్క.

మంగళవారం అర్థ రాత్రి తర్వాత షుమారు ఉదయం 2.30 తెల్లవారు ఝామున మకర సంక్రమణం, తెల్లవారితే బుధ వారము కాబట్టి భారతం లో బుధే సంక్రాంతి.

అదే అమెరికా టైం లో, మంగళ మధ్యాహ్నం వస్తుంది. కాబట్టి మంగళే సంక్రాంతి. ఇక నుంచి సూర్య శక్తి పెరిగి, పగలు పెరుగుతుంది. ఉత్తరాయణం పుణ్య కాలము మొదలు.

నువ్వు ల నూనె తో తలకు మరియు శరీరమునకు మర్ధన చేసి కనీసము గంట ఆగి స్నానము చేయాలి. నువ్వులు చలికాలము శరీరములో ఉష్ణము పెంచి ఆరోగ్యము గా ఉంచుతుంది.

సున్నిపిండి లేదా బియ్యం పిండి తో రుద్దడం, బక్కెట్ స్నానం తో చెంబు తో ముంచి తలమీద పోసుకుని, వెన్నుని ధనస్సు లా వంచడం మరువద్దు. చెరువు నది ఉంటే మంచిది, లేని వారికి చెంబు మంచిది. ఇంటి ముందు ముగ్గు చిన్నది అయినా మరువద్దు.

బెల్లం నువ్వు ల తో అరిసెలు తింటారు. ఉదయము 4 కే లెగిచి దైవ పూజ చేస్తే సూర్యోదయం లోపు, పుణ్యం, ఆయువు, ఆరోగ్యం. అంతే కాదు ఆఫీసు కు అనుకూలం.

ఈ సాంప్రదాయం, మన కోసం మన పిల్లల కోసము, మన ఆరోగ్యం కోసం , మన భవిష్యత్తు కోసం.

సంక్రాంతి కి పెద్దలు కూడా పూజ చేసి నైవేద్యం పెట్టి తలచుకోవడం చేస్తారు. వారి తెలివి తేటలు ఆస్తి అనుభవిస్తూ, వారిని గుర్తు చేసుకోవడం, ఉత్తముల లక్షణం. ఎటూ పూజ తర్వాత అవి తినేది మనమే కదా.

ఆ ఇవన్నీ చాదస్తం అనుకున్న పెద్దలు, ఒంటరిగా ఇంట్లో బాధ లో ఉన్నారు, పిల్లల తో నరకం పడుతూ. ఇంకొందరు అనాధ లేదా వృద్ధాశ్రమంలో అనుభవిస్తూ ఉన్నారు. తమ తల్లి దండ్రులు కు తాము ఇవ్వని మర్యాద గౌరవం, తమకు తమ పిల్లలు ఇవ్వరు కదా.

సాంప్రదాయం పాటించినవారు మోహం, మాయ, భ్రమలలో చిక్కరు. చూసారా మన పండుగ ల లో ఇన్ని అర్ధాలు.
 

Dt : 14-Jan-2020, Upd Dt : 14-Jan-2020 , Category : General
Views : 77 ( + More Social Media views ) ( id : 279 )
Tags : sankranti , bhogi , kanuma

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content