APLatestNews.com top Banner
శయన నియమాలు - పడుకోవాలంటే పాటించే కొన్ని సూత్రాలు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఇంటర్నెట్ లో తిరుగుతున్నాయి ఈ సూత్రలు మన కోసము, చూడటానికి కొంచెము బాగానే ఉన్నాయి, కొన్ని మనకు తెలిసినవే.

1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా ఒంటరిగా పడుకోకూడదు.(మనుస్మృతి)

2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( విష్ణుస్మృతి)

3. విద్యార్థి, నౌకరు మరియు ద్వారపాలకుడు - వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.(చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం, బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.(దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. (పద్మ పురాణము)

5. తడి పాదము లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.(అత్రి స్మృతి). విరిగిన పడక పై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.(మహాభారతం)

6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.(గౌతమ ధర్మ సూత్రం)

7. తూర్పు వైపు తల పెట్టి నిద్రించిన - విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన - ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన - హాని, మృత్యువు, ఇంకా దక్షిణ వైపు తల పెట్టి నిద్రించిన చో - ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.(ఆచార మయూఖ్)

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో 1 ముహూర్తం(48 నిమిషాలు) నిద్రిస్తారు. (పగటిపూట నిద్ర రోగహేతువు, మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది).

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాత నే పడుకోవాలి.

11.ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.

12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహము ల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా
అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము(దూలం) కింద, కాలు పై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద త్రాగడం - తినడం చేయకూడదు.

15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది)

ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారు.
 

Dt : 09-Jan-2020, Upd Dt : 09-Jan-2020 , Category : General
Views : 85 ( + More Social Media views ) ( id : 277 )
Tags : good sleeping habits

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content