APLatestNews.com top Banner
ఇవన్నీ చెపుతున్నారు, మీరు మంచి వారు అనుకోవాలా? త్రిగుణాలు, ప్రతి క్షణం మారతాయి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఏవండీ ఇవన్నీ చెపుతున్నారు అంటే, మీరు మంచి వారు అని మేము అనుకోవాలా?

లేదు గురువు గారు, ఎన్నోసార్లు అనుకున్నాము జవాబు, మరలా గుర్తు చేస్తున్నాను. కొంపముంచి, మంచి వారు అనుకుని, ఏమి ఆస్తులు రాయలేదు కదా, అలా రాయవద్దు. హ హ హ.

మీకన్నా ఎక్కువ పాపాలు చేసిన తప్పుడు మనుషులమే, మారాలి అని ప్రయత్నం చేస్తున్నాము, మనకు తెలిసిన దోవలో. సత్వ రజో తమో అనే త్రిగుణాలు, ప్రతి క్షణం మారతాయి మనసు బలహీనతను బట్టి. కాబట్టి సాధన ఉండాలి రోజూ, సత్వగుణము నిలబెట్టుకోవాలన్నా కూడా.

మంచి వారు పరోపకారులైన మీరు, మా భావనలో సాత్వికులు అయిన మీరు, మా దోవలో తప్పు సరిచేస్తారు అని ఆశ. మీకు తెలిసిన మరియు మీరు ఆచరిస్తున్న ఇంకా మంచి కఠినమైన దోవలు, మాలాంటి బుల్లి శిష్యులకు చెప్పి, మార్గనిర్దేశం చేస్తారు అని ఇంకో ఆశ. దురాశ కాదు కదా, శాస్త్ర సమ్మతమే గదా, అడిగి తెలుసుకోవడం, తప్పు దోవ సరిచేసుకోవడం, దేవుని వైపు మరలడం.

హైందవ ధర్మ ప్రచారం, తల్లి దండ్రుల సేవ విలువ గౌరవము, తెలుగు భాష మీద కృతజ్ఞత, పురాణాలు దైవం మీద నమ్మకం మీకుందని, ఇప్పుడు కాక పోయినా తర్వాత అయినా ఆ దోవలో కి వస్తారు అని మమ్మల్ని తెస్తారు అని, ఓ చిన్న ఆశ. తప్పు కాదు కదా. మీరూ ఆదోవలోనే ఉన్నారు కదూ.

లేదు రోజులు అవసరాలు మారాయి, నేను మారాను, అరిషడ్వర్గాలలో చిక్కుకుని మునిగిపోయి ఉన్నా అంటారా, మారిన సంగతి వివరముగా చెపితే, ఇంక మానేద్దాము. దీని వలన మనకు వచ్చిన లాభము, మీకు వచ్చిన నష్టమూ ఏమీ లేదు కదా గురువు గారు.
 

Dt : 07-Jan-2020, Upd Dt : 07-Jan-2020 , Category : General
Views : 66 ( + More Social Media views ) ( id : 276 )
Tags : good words

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content