APLatestNews.com top Banner
ముక్కోటి ఉపవాసం ఉపయోగాలు, శాస్త్రాల ముందు చూపు, మన దయార్ద్ర హృదయం - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ముక్కోటి సోమవారం రాత్రి కూడా ఉపవాసం, మూడు ఫలాలు పాలుతో. ఇప్పుడు కొంచెం అలవాటు గా ఉన్నట్టు ఉంది. నిద్ర మత్తు తగ్గుతాయి, మెలకువగా యోగ నిద్ర అనుకోవాలి ఏమో.

దైవ పరంగా ఆ ఉపవాసం రెండు రకాలుగా ప్రయోజనం - ఒకటి ముక్కోటి, రెండవది శని దశ నడిచే ఆరు రాశుల వారికి కూడా. శని భగవానుడు సంతోష పడతారు, అమ్మయ్య బుద్ది గా ఉన్నారు అని. అవి కాదు అన్నా, ఆరోగ్యం ఎటూ అదుపులో ఉంటుంది.

ఎప్పుడు అయితే, తిండి తగ్గుతుందో, బుద్ధి శరీరం చురుకుతనం పెరుగుతుంది. అందుకే మన పూర్వీకులు ఉపవాసం, చాలా ముందు చూపుతో, ప్రతి పండుగ కు లేదా శనివారం, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి రోజున పెట్టారు.

మొన్న ఒక అమెరికా పేపర్లో కూడా చదివాను, అప్పుడప్పుడు 14 గంటలు ఏమీ తినకపోతే, వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని శాస్త్రవేత్తల పరిశోధన అని. మన వాళ్లు, వేల ఏళ్ల క్రితమే చెప్పారు, వేదాలలో దానిని.

మరి మనం మరియు పిల్లలు ఉపవాసం చేస్తే, రోగాలకు ఆసుపత్రికి దూరంగా, హయిగా ఉంటాము. సమయ ధన లాభం, మానసిక శారీరక శాంతి కూడా.

కానీ దయార్ద్ర హృదయం గల మనము అది చేయకుండా, పరోపకారంతో ఇష్టం వచ్చినది తింటూ కొలస్ట్రాల్ కొవ్వు బిళ్ళలు మింగుతూ, పనిమనిషుల సాయంతో లావు బరువు కు జిమ్ లు యోగా చేస్తూ, రోగాలు లేదా బరువు కీళ్ళ నొప్పులు తో, ఆనందం గా బిళ్ళలు వాడుతూ, ఆసుపత్రికి విహార యాత్ర చేస్తూ, దాతలు లాగా కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాము.

కలియుగంలో తెలిసే, అహంకారం తో తప్పు చేస్తున్నాము, ఫలితాలు అనుభవిస్తున్నాము చివరలో. ఆరోగ్యం మనశ్శాంతి కోట్లు పోసినా కొనలేము, జాగ్రత్తలు గురువు గారు.
 

Dt : 07-Jan-2020, Upd Dt : 07-Jan-2020 , Category : General
Views : 69 ( + More Social Media views ) ( id : 275 )
Tags : mukkoti ekadasi

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content