APLatestNews.com top Banner
పదవ తరగతి ఉత్తీర్ణత కారణము తల్లి దండ్రులా, గురువులా, మిత్రులా, దైవమా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మనం ఎంత మూర్ఖంగా ఉన్నాము అంటే, మన సంతానాన్ని కూడా అంతే మూర్ఖంగా పెంచుతున్నాము, మన పిచ్చి నమ్మకాలను వారి మీద రుద్ది. ఈ ఉదాహరణ చూడండి.

గతములో ఒక పదవ తరగతి పిల్లాడు పరీక్ష రాశాడు. తను కనపడితే, ఏరా అబ్బాయి, చదువు ఎలా ఉంది ఫలితాలు వచ్చాయా అని అడిగాను. బాబా దయ వలన ఉత్తీర్ణుడిని అయ్యాను, మొదటి తరగతి వచ్చింది అన్నాడు.

వెరీ గుడ్ కంగ్రాట్స్, మరి బాబా అంటే ఎవరు? అది మీ నాన్న గారి పేరా లేక నీకు చదువు చెప్పిన మంచి పంతులు గారి పేరా? అని అడిగాను. కాదండీ, గుడి లో ఉన్న సాయి బాబా దేవుడు అని అన్నాడు. అదెలా, మరి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు

పదవ తరగతి దాకా, నీ అన్ని ఖర్చులు భరించి, నిన్ను మంచి స్కూల్లో చదివించినది ఎవరు? మా అమ్మా నాన్న అండి

మంచి భోజనము ఇల్లు బట్టలు ఇచ్చినది ఎవరు? మా అమ్మా నాన్న అండి

నడవడం, మాట్లాడడం, లోకం లో మంచిగా బతకడం నేర్పింది ఎవరు? మా అమ్మా నాన్న అండి

నీకు దెబ్బ తగిలితే లేదా రక్తం కారితే, హస్పటలలో చేర్చి, పడి కాపులు కాసింది ఎవరు? మా అమ్మా నాన్న అండి

నువ్వు పుట్టావని ఆనందముతో, పుట్టెంటుకలు తీయించి, ఏ కొండకు వెళ్లి వచ్చారు? తిరుపతి తిరుమల వెంకన్న దగ్గరకు అండి

బడి లో, నీకు ఉత్తమ విద్య నేర్పి, పోటీ పరీక్షలు కు సిద్ధం చేసింది ఎవరు? ఇంట్లో, బడి లో చెప్పిన దానిని చదివించినది ఎవరు? మా బడి గురువు లు, మా అమ్మా నాన్న అండి

నువ్వు భవిష్యత్తు లో, ఏమి చెయ్యాలో అని మార్గ నిర్దేశము చేసినది చెప్పినది ఎవరు? మా గురువు లు , మా అమ్మా నాన్న అండి

మీరు కొత్త గా కట్టిన ఇంట్లో చేరేటప్పుడు, ఎవరి పూజ చేశారు? నారాయణ, గణపతి, సత్యనారాయణ స్వామి పూజి అండి

మరి ఒక్క జవాబు లో కూడా, ఎక్కడా బాబా అని చెప్పలేదు కదా. మరి పాస్ అయింది, బాబా వలన అని ఎలా చెప్పావు?

ఏమోనండీ, మా అమ్మా నాన్నా ప్రతిసారి ఆ పదాలు వాడుతుంటే, అదే నిజమనుకొని నేనూ మిగతా పిల్లల తో మరియు మీతో అదే చెప్పాను. ఇప్పుడు అర్ధము అయ్యింది.

ఇప్పుడు చెప్పు, నువ్వు పాస్ అవడానికి అసలు కారణం ఎవరు? మొదట నా తల్లి దండ్రులు, తర్వాత బాగా చదువు చెప్పిన గురువు లు, ఆ తర్వాత నన్ను ప్రోత్సాహం చేసిన తోటి మిత్రులు బంధువులు. కాబట్టి ముందు వీరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ఆ తర్వాత వీరందరి లో ఉండి, వీరందరినీ వీటన్నింటిని, నీకు సమకూర్చిన ఆ దయామయుడు భగవంతుడు కూడా. ఆయనకు మనసులో ఎప్పుడూ, ధన్యవాదాలు క్రుతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత పై చదువు, ఉద్యోగము లో కూడా ఇదే వరస.

అదేమిటి అండి, మరలా మీరు భగవంతుడు కూడా అంటారు? మరి నీ క్లాస్ లో ఉన్న మిగతా వారు అంతా, నీకున్న సౌకర్యాలు ఆస్తి కలిగి ఉన్నారా? లేదు కదా?

ఆ భాగ్యం ఇచ్చింది ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు. నువ్వు ఎలా అయినా పిలువు, శివుడు అనుకో, ఆదిశక్తి అనుకో, నారాయణుడు అనుకో. ఏదైనా అనుకో, మన హిందూ వేదాలు మరియు పురాణములను బట్టి.

మరి బాబా లేరా? ఉన్నారు. ఆయన గురువు, దైవం వైపు మాత్రమే దోవ చూపుతారు, కోరికలు తీర్చరు. ఇప్పుడు ఆయన లేరు. అలా గురువునే నమ్మాలి అనుకుంటే, మనకు తెలుగు గురువులు బ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు కదా?

కానీ నువ్వు ప్రహ్లాదుడు లా, ద్రువుడి లా, మార్కండేయుడు లా, నేరుగా దైవాన్నే పట్టుకో. పరమాత్మ సర్వేశ్వరుడు కు మరణము లేదు, వారు అమర జీవులు, ఎప్పుడూ ఉంటారు.

తల్లి దండ్రులు ఇలా వాస్తవం చెప్పడం లేదు కాబట్టే, పిల్లలు అసలు దేవుళ్ళు తమ తల్లి దండ్రులు అని మరచి, చివరకు ఆశ్రమం లో లేదా వంటరిగా వదులుతుంది.
 

Dt : 20-Dec-2019, Upd Dt : 20-Dec-2019 , Category : General
Views : 110 ( + More Social Media views ) ( id : 261 )
Tags : 10th class , reason for pass

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content