పామర లేదా సామాన్య భాషలో గురువు మరియు దైవమునకు తేడాలు, వివరణ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,385; 104 తత్వాలు (Tatvaalu) and views 225,145.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పామర లేదా సామాన్య భాషలో గురువు మరియు దైవమునకు తేడాలు, వివరణ

ఇంకో గురువు గారి ప్రశ్నకు పామర(సామాన్య) భాషలో గురువు దైవము నకు తేడాలు, వివరణ.

1) ఉదాహరణకు ముఖ్యమంత్రి జగన్ లేదా చంద్రబాబు లేదా ప్రధాన మంత్రి మోడీ, వీరిలో ఎవరో ఒకరు, కాసేపు కేంద్రము లెవల్లో మోడీ గారు అనుకుందాం, అప్పారావు అనే అతనును మా ఇంటికి పంపి, నాకు లక్ష రూపాయలు ధనం ఇచ్చి, మార్గ నిర్దేశం చేసి, జ్ఞానం బోధ చేసి, కొన్ని రోజులు మాతో ఉండి రమ్మని, పంపారు అనుకుందాం.

ఇప్పుడు నాకు దైవం లాంటి మనిషి ఎవరు? గురువు లాంటి మనిషి ఎవరు? మోడీ నా లేక అప్పారావు గారా? అప్పారావు గారు డబ్బు, జ్ఞానం ఎవరు ఇచ్చి పంపితే వచ్చాను అని చెప్పాలి?

ఇక్కడ డబ్బు, జ్ఞానం మోడీ గారిది. మన అప్పారావు గారు కేవలం మధ్యవర్తి, ప్రవక్త, లేదా మెస్సెంజర్. వారికీ మహిమ శక్తి ఉండవచ్చు ఏమో. ఇప్పుడు అప్పారావు గారిని గురువు లా గౌరవిస్తాము, భోజనం పెడతాము, ఇంకా చాలా గౌరవం మర్యాద చేస్తాము. కానీ అంతవరకే కదా.

కానీ ఆయన వచ్చింది మోడీ పంపితేనే కదా, మా ఇంటికి మా ప్రాంతానికి వచ్చింది. అప్పారావు గారు, తనంతట తాను రాలేదు, తన డబ్బు కాదూ.

కర్త కర్మ క్రియ మూలం మోడీ నే ఈ ఉదాహరణలో, కాబట్టి నేను కొలవాలసింది మూలాన్ని కాని, మధ్య వర్తిని కాదు. మధ్యవర్తికి ధన్యవాదాలు క్రుతజ్ఞతలు చెప్పవచ్చు.

అలాగే దైవం మూలం, ప్రవక్తలు దైవదూత గురువు లు కేవలము మధ్య వర్తులు, దైవం వైపు దోవచూపుటకు మాత్రమే. అంతే కదా.

ఇప్పుడు చెప్పండి ఎన్ని మతాలలో ఎంతమంది మోహం లో ఉన్నారో మూలమును వదిలి?

2) మన గ్రామ పోస్ట్ మాన్ గారు, మనియార్డర్ తెచ్చి ఇస్తే, అబ్బో ఆయన మనకు డబ్బు తెచ్చి ఇచ్చారు అని (లేదా ఊళ్ళో అన్ని అడ్రెస్స్ లు లేదా ఊళ్ళో ఎవరు ఉన్నారు ఎవరు లేరో చెప్పారు కాబట్టి అందరి కన్న జ్ఞానులు అని), ఆయన పాదాలకు దండం పెట్టి, గుడి కట్టి హరతి ఇచ్చి, మహిమలు ఉన్నాయి అని, భారీ ఎత్తున ప్రచారం చేస్తే, చేసే వారిని దానిని నమ్మేవారి, మూర్ఖత్వం అనవచ్చునా? అలాంటి వారు, కౌరవులు లాగ వారు ఎవరిమాట వినరు.

మనము ఎంత గుడ్డిగా పూజ చేసినా, పోస్ట్ మాన్, తన సొంతంగా ఆయన సొంత డబ్బులు, మనకు, ఇంకో మని యార్డర్ రూపంలో ఇవ్వగలరా, ఇస్తారా?

చెడ్డ పోస్ట్ మాన్ అయితే అసలు నిజాన్ని దాచి, ఆ మోహపు పూజలు, మోహములో అందుకుంటారు. కానీ మనకు ఫలితాలు ఏమి ఉండవు కదా, అంతా వ్యర్థం.

కానీ మంచి పోస్ట్ మాన్ ఏమి చేస్తారు, ఓ తల్లీ నాకేమీ తెలీదు. ఎవరో డబ్బులు పంపితే, ఎవరో ఉద్యోగం ఇస్తే, నా పని నేను చేస్తున్నా, నన్ను వదలండి బాబో, నాకేమీ తెలీదు, ఆ డబ్బు నాది కాదు, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా నాది కాదు, ఈ రొచ్చు లోకి నన్ను లాగొద్దు, అని అంటారు వేడుకుంటారు. లేదా వారి మూర్ఖత్వం కు నవ్వుతూ, దూరంగా పారి పోతారు.

డబ్బు పంపిన వారు, దైవ రూపం లో సహాయం చేసే వ్యక్తి, ఆయన దానికి మూలం. పోస్టల్ వ్యవస్ధే ఈ ప్రకృతి లేదా ప్రపంచం లోని ఒక సాధారణ వ్యవస్థ. ఆయన కేవలం ఉద్యోగి, పోస్ట్ మాన్, దూత అంతే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,385; 104 తత్వాలు (Tatvaalu) and views 225,145
Dt : 19-Dec-2019, Upd Dt : 19-Dec-2019, Category : General
Views : 915 ( + More Social Media views ), Id : 260 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guruvu daivamu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content