APLatestNews.com top Banner
థాంక్స్ గివింగ్ డే పండుగ మరియు బ్లాక్ ఫ్రైడే అమ్మకాల సందడి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

థాంక్స్ గివింగ్ డే, Thanksgiving Day, ప్రధానంగా అమెరికా మరియు కెనడా(2 వ సోమ అక్టోబర్) లో, ఉత్తర అమెరికాలో, సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అమెరికాలో థాంక్స్ గివింగ్, నవంబర్ నాల్గవ గురువారం వస్తుంది, సెలవు దినము.

చాలామంది అమెరికన్లు, క్రిస్మస్ లేదా హాలోవీన్ కంటే, మరింత ఎక్కువగా థాంక్స్ గివింగ్ పండుగ ను చేసుకుంటారు. ఉద్యోగ అవసరార్ధము దూరముగా ఉండే అందరు కుటుంబ సభ్యులు, తప్పని సరిగా ఒక చోటకు చేరి, కుటుంబ పండుగ గా జరుపుకుంటారు.

తమ భోజనములో టర్కీ కోడిని తప్పని సరిగా భుజిస్తారు. ఇది వరకు చేసిన పనులకు ధన్యవాదములు తెలుపుతూ, వారి వారి కృతజ్ఞతలను సాంప్రదాయకముగా తెలుపుకునే రోజు. థాంక్స్ గివింగ్ డే అనేది పంటకోత పండుగ కూడా.

విమాన ప్రయాణానికి టికెట్లు కూడా దొరకవు, నెలల ముందుగా తీసుకోకపోతే. అన్ని విమానాశ్రయాలు కిటకిట లాడుతూ ఉంటాయి. వేలాదిమంది, కారు ప్రయాణాలతో రోడ్ల మీద ఉంటారు. మన సంక్రాతికి ఎలా అందరు, తమ ఊళ్ళకు వెళతారో అలాగన్న మాట.

థాంక్స్ గివింగ్ డే మొదటి వేడుక అధికారికంగా 1621 లో జరిగింది అని చెపుతారు. సెయింట్ ఆగుస్తిన్, ఫ్లోరిడాలో 1565 సెప్టెంబరు 8 నుంచి ఈ వేడుకలు జరుపుతున్నారు.

ప్రతీ సంవత్సరము జరిగిన విధముగా, ఈ ఏడు కూడా అధ్యక్షుడు ట్రంప్, రెండు నార్త్ కరోలినా టర్కీలను(చిత్రము 4) క్షమించారు ( President Trump pardoned two North Carolina turkeys ). అంటే వాటిని ఎవరి థాంక్స్ గివింగ్ భోజనంగా మారకుండా కాపాడారు.

ఈ పండుగ గురువారము నుంచి మొదలై, ఆది వారము దాకా జరుగుతుంది. కొంత మందికి శుక్రవారము శెలవు ఉంటుంది, ఇంకొంతమంది శెలవు పెడతారు.

ఆ తర్వాత రోజే నల్ల శుక్రవారము, బ్లాక్ ఫ్రైడే Black Friday, అంటారు. ఈ రోజు, ముందు వచ్చిన వారికి, అన్ని వస్తువులు అత్యంత తక్కువ ధరకు లభిస్తాయి. అందరూ షాప్ లకు పొద్దున్నే వెళ్ళి, తమకు కావలసిన వస్తువులు దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

గతములో రాత్రి 10 నుంచే పెద్ద లైన్లు ఉండేవి తెల్ల వారు షాప్ తెరిచిందాక. కోట్లలో వ్యాపారము జరుగుతుంది, ఇదే పెద్ద అమ్మకాల రోజు సంవత్సరములో. వాల్ మార్ట్, బెస్ట్ బయ్, టార్గెట్, ఇంకా అనేక షాప్ లు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి కొనుగోలు దారులను ఆకర్షించటానికి.

బ్లాక్ ఫ్రైడే అమ్మకాల సందడి, ఇండియాలో కూడా మొదలైంది అనుకుంటా. ఇ కామర్స్ లేదా ఆన్లైన్ కంపెనీలు, బడా వ్యాపారులు బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు.

కింద వీడియోలో 2008 లో, నల్ల శుక్రవారము, జనము చలిలో ఎలా లైన్లో ఉన్నారో చూడండి.
 
థాంక్స్ గివింగ్ డే పండుగ మరియు బ్లాక్ ఫ్రైడే అమ్మకాల సందడి  - Pic 2
చిత్రము 2

థాంక్స్ గివింగ్ డే పండుగ మరియు బ్లాక్ ఫ్రైడే అమ్మకాల సందడి  - Pic 3
చిత్రము 3

థాంక్స్ గివింగ్ డే పండుగ మరియు బ్లాక్ ఫ్రైడే అమ్మకాల సందడి  - Pic 4
చిత్రము 4



Dt : 27-Nov-2019, Upd Dt : 27-Nov-2019 , Category : General
Views : 105 ( + More Social Media views ) ( id : 231 )
Tags : Thanksgiving Day , Black Friday

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content