APLatestNews.com top Banner
కార్తీక మాసంలో అందరూ కలసి వన భోజనాలు చేస్తారు, అసలు దాని పరమార్థం తెలుసా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
వన భోజనాలు అని కార్తీక మాసంలో, అందరూ కలసి దగ్గర లో ఉన్న వనానికో, అడవుల్లో కో వెళ్లి భోజనాలు చేస్తారు. అసలు దాని పరమార్థం తెలుసా?

ఆ రోజు న ఆ కార్యక్రమాన్ని,మన అవసరాలకు అనుగుణంగా, కుల లేదా రాజకీయ లేదా అవసరాల లేదా పెత్తనము భోజనాలు గా చేసేసాము. పోనీ కులములో, మతములో అన్నా బజారులో ఉన్న అందరినీ పిలుస్తారా? అదీ లేదు, తమకు కావలసిన అవసరమున్న హోదా ఉన్న వారిని మాత్రమే పిలుస్తారు.

హోటల్ లేదా లేదా వంటవాళ్ళతో లేదా అన్ని ఇళ్ళలో చేసిన తిండి కట్టి తెచ్చి, వనంలో ఆరగించి, బ్రేవ్ మని పిల్లికూత పెట్టి, నాలుగు అర్థం పర్ధం లేని పోసుకోలు మాటలతో, సమయం వృధా చేస్తున్నాము. వనములో, కొన్ని చోట్ల మగవారే వంట చేస్తున్నారు.

బొమ్మలో చూసారా? పరమాత్ముడు శ్రీ క్రిష్ణుడు, తోటి గొల్ల బాలురతో కలసి ఎలా భోజనము ఆరగిస్తున్నారో హోదాలతో పని లేకుండా. మనము, క్రిష్ణ భక్తులమే, కానీ అలా చేయము అహంకారము అంగీకరించదు.

వనాలలో లేదా అడవుల్లో 108 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. ఉదాహరణకు తుమ్మ, జాజి, మునగ, తమలపాకు, ఉసిరి, ఇంకా అనేక రకాలైన ఆకులు లభిస్తాయి. మనిషికి మేలు చేసే చెట్లతో మనకు బంధము ఏర్పరచుకోవడము.

అమెరికాలో అయితే, వీలైనప్పుడల్లా జాతీయ రాష్ట్ర లేదా దగ్గరలో ఉన్న పార్క్ ల లో ఒక రోజు గడిపి, చెట్లు చుట్టూ తిరిగి వస్తుంటారు. ప్రతి పార్క్ లోనూ, చాలా చెట్లు ఉంటాయి, చిన్న వనము లేదా బుడ్డ అడవి లాగా. నాలుగు ఐదు కుటుంబాలు పార్క్ లోనే వంట చేసుకుని ఆనందముగా గా గడిపి వస్తారు, ప్రక్రుతిని ఆస్వాదించి. వారికి మన వన భోజనాలు తెలియకపోయినా, సహజముగా ప్రక్రుతిలో గడిపి వస్తారు. మనము ఏది చేసినా, విక్రుతమే, మార్చేస్తాము మన అవసరాలకు.

వయస్సు లో పెద్దలు అనుభవజ్ఞులు, వాటి గురించి చిన్న వాళ్ళ కు వివరిస్తూ, వాటి విలువ ను తెలియజేస్తారు.విలువైన విజ్ఞానాన్ని భావి తరాలకు అందజేస్తారు. అలా మొదలు పెడతారు వన విహారం ను, మన భవిష్యత్తు తరాల కోసం.

ఇంకోవైపు ఆడవారు తెచ్చిన వస్తువులు, నీళ్ల తో ఎంత పొదుపు గా రుచికరముగా వంట చేయవచ్చు, అనే అనేక పద్దతులు ఆడపిల్లల కు నేర్పుతారు. నోరూరించే వంటల ఘుమ ఘుమల వాసనలతో, ఆ చుట్టుపక్కల అందరి మనసు ఉల్లాసముగా ఉంటుంది.

అందరిలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది అందరికీ తెలుస్తోంది. ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన, నేల మీద కూర్చుని, భోజనాలు చేస్తారు.

అందరూ కలవడం, కలసి పని చేస్తూ మాట్లాడుతూ ఉండటం వలన బంధాలు బాంధవ్యాలు నిలబడతాయి. కుల మతాల బేధాలు ఉండవు. దైవ సంభంధమైన విషయ పరిజ్ఞానము పంచుకుంటారు.

ఒక బజారు లో ఉన్న, పల్లెల్లో ఉన్న లేదా ఒక చోట పనిచేసే వారంతా, కులమత వర్గ హోదా బేధాలు మరచి, ఒకే కుటుంబంలో మనుషులు గా కలిసి మెలసి తిరిగి, ఆనందంగా గడిపేది ఈ వనభోజనాలు పండుగ. సమాజ శ్రేయస్సుకు ఉపయోగము, అందరు కలసి మెలసి ఉండడము.
 

Dt : 22-Nov-2019, Upd Dt : 22-Nov-2019 , Category : General
Views : 115 ( + More Social Media views ) ( id : 226 )
Tags : vana bhojanamu , eating in the park

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content