సోషల్ మీడియాలో మాతృభాష తెలుగు రాద్దాం - భాషను కాపాడుకుందాం, ఏరు దాటాక తెప్ప తగలేయ వద్దు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,285; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గూగుల్ ఇండిక్ కీబోర్డ్ (Google Indic Keyboard) అని భారత భాషలు రాసే యాప్ ఉంటుంది. తెలిస్తే మనమే ఇన్స్టాల్ చేయవచ్చు. వీడియోలు చూడండి.

లేదంటే ఓ పాతిక తీసుకుని, మొబైల్ షాప్ వారు ఇన్స్టాల్ చేస్తారు, మన మొబైల్ ఫోన్ లో అంటే చరవాణి లో.

మొదట టైపు నేర్చుకున్న విధంగా ఒక్కొక్కటిగా నొక్కాలి అక్షరాలు, కొంచెము లేటు పడుతుంది.

అలా ఓ పది రోజులు ప్రయత్నించి అలవాటు పడిన, ఇలాగే తెలుగు వాక్యాలు తో, సరదాగా ఎదుటి వారి తలలు తినవచ్చు లేదా మన తెలుగు తల్లి ని గుర్తు చేయవచ్చు.

కంప్యూటర్ ఉన్న వారు లేఖిని.కామ్(lekhini) వెబ్సైట్ లో తెలుగు టైపు చేసి, వాట్సాప్ వెబ్ లో నుంచి కాపీ చేయవచ్చు, ఆ తర్వాత తెలిసిన వారికి పంపవచ్చు.

గూగుల్ ట్రాన్స్లేట్ కూడా వాడవచ్చు, ఇంగ్లీష్ నుంచి తెలుగు మాటలకు, లింక్ చూడండి. Google Translate.

మన మాత్రుభాష తెలుగు బతికి ఉండాలి, అలాగే దేవుని మంత్రాలు, పద్యాలు శ్లోకాలు స్పష్టం గా ఉచ్చరించి, చదవ గలగాలి. అవి దేవుని కోసం కాదు, అవి మన ఆరోగ్య రహస్యం. నాభి నుంచి తెలుగు సంస్క్రుత అక్షరాలు పలుకుతాయి.

దేశ భాష లందు తెలుగు లెస్స అని విన్నాము కదా, 56 అక్షరాలు, కొన్ని మింగేశాము ఎప్పుడో. మిగిలిన వాటిని అన్నా బతికిద్దాము.

విదేశాల్లో ఉన్నవారు ఎటూ కష్టం, మాట్లాడగలిగినా, రాయలేరు. తమ మాత్రుమూర్తి ని, తమ జన్మ భూమిని, తమ మాత్రు భాషను అవమానిస్తూ క్రుతఘ్నులుగా ఉన్నారు, అని వారు తెలుసుకోలేని మూర్ఖ పరిస్తితి లో ఉన్నారు.

అదేమంటే, తెలుగు వస్తే తల్లి దండ్రులు మనతో ఉంటేనే, మాకు అవన్ని ఉన్నట్లా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు, అజ్ఞాన మోహముతో. ఏరు దాటాక తెప్ప తగలేశారు అంటే, ఒప్పుకోరు. అంత మాత్రాన వాస్తవం కాకుండా పోతుందా?

తెలుగు రాయడం రాకపోతే లేదా పైవి ఏమీ చేయకపోతే, విదేశీ తెలుగు సంఘం అధ్యక్షుడి గా లేదా సభ్యుడు గా పదవి మాత్రం, ఖాయం. కావాలంటే వారినే అడగండి. అన్ని చేసేవారికి, పదవి ఇవ్వరు, తెలుగును బతికిస్తారు అని.

జీతం కోసం కంప్యూటర్ లో ఎన్నో భాషలు నేర్చుకుంటారు సర్టిఫికేట్ లు తెచ్చుకుంటారు కానీ, మాత్రు భాష రాయలేరు, స్వార్ధం సిగ్గు చేటు కదూ?

స్వదేశం లో ఉన్న వారు కి కూడా తెలుగు నచ్చడం లేదు పలకడం లేదు, బద్దకముతో సగం లేదా పూర్తిగా ఆంగ్లంలో నే ఉంటుంది. లేకపోతే నామోషి. మన నిర్లక్ష్యమే, మనకు కరోనాలను ఉచితముగా ఇస్తుంది, కదూ?

విదేశాలకు వచ్చి ఐదేళ్లు దాటినవారు లేదా స్వదేశములోనే పెద్ద నగరాలలో ని వారు, తెలుగు వారికి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ సందేశము తెలుగు లో రాస్తున్నారా? తెలుగు రాసే ప్రయత్నం చేశామా, చేపిస్తున్నామా?

మన పిల్లల కు, తెలుగు నోట్లో వచ్చే మో కానీ, రాయడం రాదు. మనము తీరికతో నేర్పుతామా? వారు నేర్చుకుంటారా?

ఒకవేళ రాయడం, మాటలూ వచ్చినా కూడా, ఏదో అద్దె కొత్త భాష మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుందే గాని, చలోక్తులతో సరసమైన సరళ భాష వారికి కష్టము, మన బట్లర్ ఆంగ్లము లాగా ఉంటుంది.

ఏరు దాటాక తెప్ప తగలేయడం మన రక్తం లోనే ఉంది అంటారా - బాష , భూమి , తల్లి దండ్రులు, ఇంకేదైనా.

ఇద్దరు తెలుగు వారు అంతరిక్షంలో ఒంటరిగా తప్పిపోయినా కూడా, అక్కడ ఆంగ్లంలో నే మాట్లాడుతూ ఉంటారు. చచ్చినా తెలుగు లో మాట్లాడరు.

అదే తమిళం , కన్నడ, మరాఠీ, బెంగాలీ, జర్మనీ, స్పానిష్, చైనీస్ వారు సొంత భాషా ప్రేమికులు, కృతజ్ఞత ఉన్నవారు. మైక్రోసాఫ్ట్ అన్ని యూరొపియన్ భాషలలో సాఫ్ట్ వేర్ విడుదల చేస్తుంది.

మనం పుట్టిన పిల్లల కే కృతఘ్నత నేర్పుతాము, మన ఇంటికి తాత నానమ్మ ను దూరంగా ఉంచి. లేదా ఉద్యోగం కోసం, పసి పిల్లల ను నిర్దయ గా వేరు చేస్తాం. అవీ మన కృతజ్ఞతలు మన పిల్లలు, పెద్దలు, భాషతో.

మన భాషను కాపాడుకుందాం, మన కృతజ్ఞత ఆరోగ్యం కోసమన్నా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,285; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877
Dt : 20-Nov-2019, Upd Dt : 20-Nov-2019, Category : General
Views : 2178 ( + More Social Media views ), Id : 225 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , language , indic , google , lekhini , translate
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content