APLatestNews.com top Banner
పిల్లల క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమ క్రమంగా 50 ఏళ్ళు పైగా, కొంచెం కొంచెం . . . - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఊకోండీ , మాకే తెలియదు అదంటే ఏంటో, మేము నేర్పేది ఏమిటి క్రమశిక్షణ, విడ్డూరం కాకపోతే.

అసలు పిల్లల క్రమశిక్షణ అంటే ఏమిటి? ఎక్కడ అమ్ముతారు? స్కూల్ లో చెప్పరా? మరలా ఇంట్లో నా? మా ఆయన లేదా ఆవిడ జాబ్ కెళితే , నాకు ఇంట్లో పని , ఫోన్ లో పని, సీరియల్స్, పిల్లలు బాధ్యత, వాళ్ళ వీళ్ళ గొడవలు? అసలు టైం ఉంటుందా, క్షణం?

పోనీ మా పక్కింట్లో, అసలు ఇద్దరూ ఉండరు ఇంట్లో, ఎప్పుడో సాయంత్రం లేదా రాత్రికి వస్తారు, వాళ్ళ అనాధ పిల్లలు కన్నా, మా పిల్లలు నయం కాదా? కొన్ని రోజులు వాళ్ళ అమ్మా వాళ్ళు, లేదంటే అత్తా వాళ్ళు వచ్చి చూస్తారు.

ఇటు పక్క ఇంట్లో అసలు నాన్నే ఉండడు, వారానికి ఒక సారి వస్తారు పిల్లలను కలవాలని, వారు వేరు అయి పోయారు లే విడాకులతో.

మొన్న రెండేళ్లుగా నిర్ధయ గా పిల్లల ను అమ్మ, అత్తయ్య వాళ్ళ నెత్తిన వేసి చేతులు దులుపుకున్నాం. ఎందుకంటే, బిడ్డల కన్నా సంపాదన ముఖ్యము కాబట్టి. ఎవరన్నా కాదంటారా?

మేము కన్న వాళ్ళను మేమే చూడాలా? మా కన్న వాళ్ళు చూడకూడదా? వారు కూడా ఆనందంగా ప్రొత్సహిస్తూ, మమ్మల్ని మా బిడ్డలు ను నిర్దయగా వేరు చేసి దూరం చేసి, హయిగా తీసుకెళ్లారు. అదేనా క్రమశిక్షణ అంటే , తెలీక అడుగుతున్నా?

మేము పక్కన లేకపోతే తట్టి నెట్టకపోతే, పిల్లలు ఫోన్ లోనో, లాప్ టాప్ లోనో, గేము లోనో , టీవీల్లో నో మునిగి తేలుతూ ఉంటారు, పుస్తకాలు పట్టుకుని చదవరు, హోం వర్క్ చేయరు, గోల గోల, తగువులు.

ఆ టెక్నాలజీ నేర్పింది ఎవరూ అని అడగొద్దు దయచేసి. గోల వదిలించుకోవటం కోసం ప్రశాంతంగా ఉండటం కోసం, మేమే నేర్పాము చెడగొడుతున్నాం అని ప్రాణం పోయినా , ఒప్పకోం గదా. అబ్బా.

స్కూల్లో పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో, ఏమి ఇతర పనులు నేర్చుకుంటున్నారో మేమెలా చూడగలము.

మా అమ్మా నాన్న, ఇరవై ఏళ్ళు పైగా పక్కన పెట్టుకుని తిట్టి, తన్ని చెపితేనే , క్రమశిక్షణ అన్న పదం ఎక్కడో లీలగా విన్న తెలిసిన పదం లాగ ఉంది.

మీరడగడం ఎలా ఉంది అంటే మమ్మల్ని, పాత సావిత్రి గారు రామారావు గారి గురించి అడిగితే ఎలా? అది గతం గతః. ఇప్పుడు పోకిరీ, అర్జున్ రెడ్డి గురించి అడగండి, గడగడా చెపతాము .

ఇప్పుడు క్రమశిక్షణ అంటే , క్రమ క్రమంగా 50 ఏళ్ళు పైగా, కొంచెం కొంచెం ఎదురు దెబ్బలు తింటూ, ఎవరికి వారు నేర్చుకోవాలి. లేదంటే ఎటూ శని , రాహు కేతువుల గ్రహలు ఉన్నారు కదా, వారే నేర్పుతారు.
 

Dt : 08-Nov-2019, Upd Dt : 08-Oct-2019 , Category : General
Views : 49 ( + More Social Media views ) ( id : 213 )
Tags : children self discipline

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content