APLatestNews.com top Banner
వృధ్యాప్యం లో మనకు అన్నం పెట్టేది సంతానమా? లేక వారి సంస్కారమా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ముఖపుస్తకములో ఒకరు రాసారు, వృధ్యాప్యం లో మనకు అన్నం పెట్టేది, చూసేది, అండగా ఉండేది, మన సంతానం కాదు, మనం చిన్నతనం నుంచి వారికి నేర్పిన సంస్కారం అని.

ఎంత మంది గురువు లు ఒప్పకుంటారో ఈ మాటలను? ఎందుకంటే, తమ తప్పును ఎవరు కూడా, తేలికగా ఒప్పుకోరు ఎవరూ, కలియుగములో.

కానీ 80 శాతం ఒప్పుకోరు, వారి వాదన ఏమిటి అంటే, డబ్బు ఇచ్చాము సౌకర్యాలు ఇచ్చాము, చదువు చెప్పాము, ఇంకా ఎన్నో ఇచ్చాము, ఆ ఒక్కటి అంటే సంస్కారము మేము తీరిక లేక చెప్పక పోతే, పిల్లలు నేర్చుకో కూడదా? అదేమన్నా పెద్ద కష్టమా అని? అన్నీ ఎక్కడ నేర్పుతాము దగ్గర ఉండి అంటారు. మేము కష్టపడేది వారి కోసమే కదా.

ఆ జవాబులోనే ఉంది, వారి సంస్కారము. మనకు లేనిది, మన పిల్లలకు ఎలా వస్తుంది. రేపు ఇబ్బందులు పడేది కూడా, ఆ 80 మందే.

ఉదాహరణ, ఒక తండ్రి, తన అమ్మా నాన్నను విడిచి దూరంగా ఉండి, కోటీశ్వరుడు అయ్యాడు. కొడుకు అడిగాడు, నాన్న తాత నానమ్మ మనతో ఎందుకు ఉండరు అని. వారు ఇక్కడ ఉండలేరు అని జవాబు ఇచ్చారు.

తాత వాళ్ళ పరిస్తితి మనవడికి తెలుసు, నాన్న చెప్పేది అబద్దము అని కూడా తెలుసు. రేపు, తను పెద్ద ఆయ్యాక అంతకన్నా ఇంకా మంచిగా జవాబు చెపుతాడు, తన తండ్రికి.

పిల్లలు మనము చేసే ప్రతి పని గమనిస్తుంటారు, మనకు బయటకు చెప్పకపోయినా, లోన ముద్ర వేసుకుంటారు. నమ్మరా? ప్రహ్లాదుడు గర్భములో ఉన్నప్పుడే, నారాయణుడు గురించి విన్నాడు. పుట్టాక, రాక్షసుడైన హిరణ్యకశపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకును మార్చలేకపోయాడు. అలాంటిది, పుట్టాక మనము చేసే పనులను నేర్చుకోరా.

గమనిక : దయచేసి, సంస్కారం అంటే ఏమిటి? మా ఇంట్లో వంట్లో అలాంటి వి లేవు వినలేదు. మాకు తీరిక లేదు , ఎక్కడ ఏ ఊళ్ళో దొరుకుతుంది? ఒకటి కొంటే 2 ఇస్తారా? డిస్కౌంట్ ఉంటుందా?

అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ లో ఉంటుందా కార్డు తో కొనడానికి? ఫ్రీ డెలివరీ నా? అని మాత్రం అడగవద్దు. మీ పక్కన ఎవరన్నా సంస్కారం తెలిసినవాళ్ళు ఉండవచ్చేమో, కనుగోవడానికి ప్రయత్నము చేయండి, ఇప్పుడు అన్నా.
 

Dt : 01-Nov-2019, Upd Dt : 01-Oct-2019 , Category : General
Views : 73 ( + More Social Media views ) ( id : 209 )
Tags : Sanskaram , Basic Human Values , elders care

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content